EPAPER

Bank Holidays: 15 రోజులు సెలవులు.. ఇలా అయితే కష్టమే..

Bank Holidays: 15 రోజులు సెలవులు.. ఇలా అయితే కష్టమే..

Bank Holidays: బ్యాంక్ జాబులంటే నిరుద్యోగులకు ఎంతో ఇష్టం. బ్యాంక్ జాబ్‌కు ఉన్నంత క్రేజ్ అంతాఇంతా కాదు. ప్యూర్ వైట్ కాలర్ వర్క్. ఏసీ ఆఫీస్. సొసైటీలో రెస్పెక్ట్. నెల తిరిగే సరికల్లా వేలకు వేలు జీతం. ఇంతకంటే ఇంట్రెస్టింగ్ విషయం.. కావాల్సినన్ని సెలవులు. అవును, అన్ని గవర్నమెంట్ జాబులకు మాదిరే బ్యాంకు ఉద్యోగులకూ ఫుల్ హాలిడేస్ ఉంటాయి. ఇక సమ్మెలు, ధర్నాల పేరుతో అనధికారికంగా మరిన్ని డుమ్మాలు. అందుకే, కొడితే కొట్టాలిరా బ్యాంక్ జాబ్ అనుకుంటారు నిరుద్యోగులు. ఇదంతా ఎందుకంటే.. ఏప్రిల్ నెలలో బ్యాంకులకే ఏకంగా 15 రోజులు సెలవులు వచ్చాయి మరి.


అవును, మీరు చదివింది నిజమే. ఏకంగా సగం నెల సెలవులే. బ్యాంక్ పని మీద వెళ్లేవాళ్లు ఓసారి హాలిడేస్ లిస్ట్ చెక్ చేసుకోవాల్సిందే. అయితే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 11 రోజులే హాలిడేస్. పలు రాష్ట్రాల్లో మాత్రం 15 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి.

ఆర్‌బీఐ వెబ్‌సైట్‌ ప్రకారం.. ఏప్రిల్‌ 1న ఫైనాన్సియల్ ఇయర్ ప్రారంభం కాబట్టి ఆరోజు ఎలాంటి సాధారణ కార్యకలాపాలు జరపరు. బ్యాంకులకు వర్కింగ్ డే అయినా.. కస్టమర్లకు మాత్రం బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండవు. ఏప్రిల్ ఫస్ట్ అలా ముగుస్తుంది.


ఇక, ఏప్రిల్ 4న మహవీర్‌ జయంతి. 5న బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి. 7న గుడ్‌ఫ్రైడే. 14న అంబేడ్కర్‌ జయంతి. 22న రంజాన్‌. ఆయా రోజుల్లో తెలంగాణలో బ్యాంకులు తెరుచుకోవు. ఏపీలో మాత్రం ఏప్రిల్ 4న మహావీర్ జయంతికి సెలవు లేదు.

ఈ జనరల్ హాలిడేస్‌తో పాటు.. రెండు, నాలుగో శనివారాలైన ఏప్రిల్ 8, 22న బ్యాంకులు పనిచేయవు. ఏప్రిల్‌లో 5 ఆదివారాలు వస్తున్నాయి. ఇలా అన్నిటినీ కలుపుకుంటే.. ఏప్రియల్ నెలలో మొత్తంగా 11 రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో స్థానిక పండగల దృష్ట్యా.. 15 రోజులు బ్యాంకులు పనిచేయవు.

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×