EPAPER

IPL 2025: యువరాజ్ కి గాలం వేస్తున్న.. ఫ్రాంచైజీలు

IPL 2025: యువరాజ్ కి గాలం వేస్తున్న.. ఫ్రాంచైజీలు

Yuvraj Singh set to take up senior coaching role with Delhi Capitals in IPL 2025: ఐపీఎల్ మెగా వేలానికి ఇంకా చాలాకాలం సమయం ఉన్నప్పటికి అప్పుడే ఫ్రాంచైజీల సందడి మొదలైంది. అయితే మూడేళ్లకు ఒకసారి జరిగే మెగా వేలం బహుశా వచ్చే ఏడాది అంటే 2025, ఫ్రిబ్రవరి నెలలో జరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే మూడేళ్ల క్రితం, 2022లో జరిగిన మెగా వేలం కూడా  ఫ్రిబ్రవరి నెలలోనే జరిగింది. అందుకే అటూ, ఇటుగా అదే నెలలో ఉండవచ్చునని అంటున్నారు.


ఇకపోతే ఫ్రాంచైజీలు చాలా అగ్రెసివ్ గా జట్టులో మార్పుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఈసారి మెగా వేలం పూర్తయ్యేసరికి ఐపీఎల్ స్వరూపమే మారిపోతుందని అంటున్నారు. ఇక రాబోయే సీజన్ మొత్తం కొత్త కొత్తగా కనిపించనుందని అంటున్నారు.

ముందు జట్టు సభ్యులకన్నా కెప్టెన్లు, కోచ్ లు, మెంటార్లపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. అందుకోసం రిటైరైన లెజండ్రీ క్రికెటర్లను వెతుకుతోంది. ఈ క్రమంలో వీరికి హాట్ కేక్ లా యువరాజ్ సింగ్ కనిపిస్తున్నాడు. చాలామంది తనపై ఒక కన్నేసి ఉంచారు. గుజరాత్ టైటాన్స్‌ ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేస్తోంది. హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రాకు ఉద్వాసన చెప్పనున్నారని సమాచారం.


కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా కొత్త మెంటార్ కమ్ డైరెక్టర్‌ను వెదుక్కునే పనిలో పడింది.  గౌతమ్ గంభీర్.. జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే. ఢిల్లీ కేపిటల్స్‌లో కూడా భారీ మార్పులు చేర్పులు జరుగనున్నాయి. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఇప్పటికే తప్పుకొన్నాడు. ఆయన స్థానం కూడా భర్తీ కానుంది.

Also Read: కోల్ కతా.. రింకూసింగ్ ని వదులుకుంటుందా?

ఇలా పలుచోట్ల పలువురు దేశ, విదేశీ ఆటగాళ్లు రేసులో ఉన్నారు. వారిలో ప్రధానంగా యువరాజ్ పేరు వినిపిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రడీ సంప్రదింపులు జరిపారని అంటున్నారు. గుజరాత్ టైటాన్స్ మాట్లాడితే చేప వలలో పడలేదు. మరి ఢిల్లీ గాలానికి యువరాజ్ చిక్కుతాడో లేదో చూడాల్సిందే.

ఇకపోతే కోచ్ లు, మెంటార్ల రేసులో ప్రవీణ్ ఆమ్రే, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, గ్యారీ కిర్‌‌స్టెన్, గ్రెగ్ షెప్పర్డ్, ప్యాడీ అప్టాన్, ఇంకా తాజాగా రిటైర్మెంట్ ప్రకటించిన పలువురు దేశ విదేశీ క్రికెటర్ల పేర్లు వినిపిస్తున్నాయి.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×