EPAPER

Yuvraj Singh: యువరాజ్ ఆల్ టైం ఫేవరేట్ టీం ఇదేనంటా.. ధోనీకి చోటులేదా?

Yuvraj Singh: యువరాజ్ ఆల్ టైం ఫేవరేట్ టీం ఇదేనంటా.. ధోనీకి చోటులేదా?

MS Dhoni: యువరాజ్ సింగ్ తన ఆల్ టైం ఫేవరేట్ టీంను వెల్లడించారు. ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆయన అప్పటికప్పుడే తన ఆల్ టైం ఫేవరేట్ టీం కూర్చి వివరించారు. తన ఫేవరేట్ టీమ్‌ను సచిన్ టెండూల్కర్‌తో ప్రారంభించారు. సచిన్ టెండూల్కర్, రిక్కీ పాంటింగ్‌లు ఓపెనర్లుగా ఉంటారని తెలిపారు. ఆ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పేర్లు ఎంచుకున్నారు. ఐదో ప్లేస్‌లో ఏబీ డివిలియర్స్, ఆరో స్థానంలో స్పెషలిస్ట్ వికెట్ కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్‌ను పేర్కొన్నారు.


ఇక బౌలింగ్ వైపు ఫోకస్ పెట్టి.. ఏడో, ఎనిమిదో స్థానాల్లో ఆస్ట్రేలియన్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్‌ను ముత్తయ్య మురళీధరన్‌ పేర్లను వరుసగా ప్రస్తావించారు. పేసర్లుగా గ్లెన్ మెక్ గ్రాత్, వసీం అక్రమ్‌లను తొమ్మిది, పదో స్థానాల్లో ఎంచుకున్నారు. ఇక 11వ స్థానంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ను పేర్కొన్నారు. ఇది తన ఆల్ టైం ఫేవరేట్ టీం అని వివరించారు. యాంకర్ సరదాగా.. మరి 12వ స్థానంలో కూడా ఎవరినైనా ఎంచుకోవాలని చెబితే ఎవరిని ఎంచుకుంటారని ప్రశ్నించారు. ఇందుకు అంతే సరదాగా సమాధానం ఇస్తూ.. ఆ 12వ స్థానంలో తానే ఉంటానని వివరించారు. ఈ లిస్టులో మాత్రం ఎంఎస్ ధోనిని పేర్కొనలేదు. దీంతో యువరాజ్ సింగ్ ఆల్ టైం ఫేవరేట్ టీమ్‌లో ఎంఎస్ ధోనికి చోటులేదని అర్థమైపోతున్నది.

వరల్డ్ చాంపియన్షిప్స్ ఆఫ్ లెజెండ్స్ టైటిల్ ఫైనల్‌లో ఇండియా చాంపియన్స్.. పాకిస్తాన్ పై విజయం సాధించారు. ఈ టీమ్ కెప్టెన్‌గా యువరాజ్ సింగ్ రాణించారు. చివరి ఓవర్‌లో యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్‌లు క్రీజులో నిలబడి ఇండియాకు విజయాన్ని అందించారు. పాకిస్తాన్ చాంపియన్లు 20 ఓవర్‌లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు సాధించారు. ఇండియా చాంపియన్స్ 19.1 ఓవర్‌లలోనే 159 పరుగులు సాధించి విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్ అనంతరం, ఆయనతో యాంకర్ మాట్లాడుతూ ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. ఇందులో భాగంగానే యువరాజ్ సింగ్ తన ఆల్ టైం ఫేవరేట్ టీంను అక్కడిదక్కడే కూర్చి వెల్లడించారు.


Tags

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×