EPAPER

Yuvraj Singh’s Father : మావాడి జీవితాన్ని ధోనీ నాశనం చేశాడు: యువీ తండ్రి

Yuvraj Singh’s Father : మావాడి జీవితాన్ని ధోనీ నాశనం చేశాడు: యువీ తండ్రి
Yuvraj ‘s Father Yograj Singh Accuses MS Dhoni of Destroying Son Career :  యువరాజ్ సింగ్ క్రికెట్ కెరీర్ 2000 సంవత్సరం నుంచి 17 వరకు సాగింది. అంటే 17 ఏళ్లపాటు అటూ ఇటుగా సాగిందనే చెప్పాలి. తను కెరీర్ లో 304 వన్డేలు ఆడాడు. 40 టెస్ట్ మ్యాచ్ లు, 58 టీ 20లు ఆడాడు. అయినా సరే, నా కొడుకు కెరీర్ ని ధోనీ నాశనం చేశాడని యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ సింగ్ పదేపదే చెప్పడంపై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.

ఇంతకీ ఆయనేమన్నారంటే.. భారత క్రికెట్ కు యువరాజ్ చేసిన సేవలకు గాను భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2007 టీ 20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలవడంలో యువరాజ్ కీలకపాత్ర పోషించాడని అన్నారు.


అయితే ఆ సమయానికే.. యువరాజ్ భయంకర క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. తర్వాత కోలుకుని మళ్లీ టీమ్ ఇండియాలోకి వచ్చాడు. అప్పటికే తన ఆట లయ తప్పింది. దాంతో నెమ్మదిగా టీమ్ ఇండియా నుంచి కనుమరుగయ్యాడు. ఇందులో ధోనీ చేసిందేం ఉందని నెటిజన్లు అంటున్నారు.

అయితే యువరాజ్ తండ్రి ఏమంటారంటే.. మరో నాలుగేళ్లు ఆడగలిగే సత్తా నా కొడుక్కి ఉంది, క్యాన్సర్ తో పోరాడుతూ దేశం కోసం ఆడి, ప్రపంచకప్ సాధించాడు.. అందుకైనా యువరాజ్ కి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలా అడిగితే అర్థం ఉంది కానీ, ధోనీ వల్ల యువరాజ్ కెరీర్ నాశనమైందని నిందించడం తగదని అభిమానులు అంటున్నారు.


ధోనీ విషయానికి వస్తే తను ఫస్ట్ వన్డే 2004లో ఆడాడు. అంటే యువరాజ్ ఇండియన్ క్రికెట్ లోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత జట్టులోకి వచ్చాడు. యువరాజ్ 304 వన్డేలు ఆడితే, ధోనీ 350 ఆడాడు. యువరాజ్ కన్నా 46 మాత్రమే ఎక్కువ ఆడాడు.

Also Read: భారత్ కు ఏడో పతకం.. హై జంప్ లో నిషాద్ కుమార్ కు సిల్వర్!

యువరాజ్ ది ఎటాకింగ్ ప్లే కావడంతో 40 టెస్టు మ్యాచ్ లు ఆడినా ఆకట్టుకోలేక పోయాడు. కేవలం 1900 పరుగులు మాత్రమే చేశాడు. అందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 10 వికెట్లు మాత్రమే తీశాడు. అలా తను టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు. తర్వాత 58 టీ 20లు ఆడాడు. ధోనీ 98 టీ 20లు ఆడాడు. యువరాజ్ కన్నా 40 మాత్రమే ఎక్కువ ఆడాడు. టెస్టులు మాత్రం ధోనీ 90 ఆడాడు.

నిజానికి యువరాజ్ నిలకడగా ఆడి ఉంటే, ధోనీ టీమ్ ఇండియాలోకి వచ్చేసరికి కెప్టెన్ అయ్యేవాడు. అప్పుడు తన కెప్టెన్సీలో ధోనీ ఆడాల్సి వచ్చేది. వచ్చిన అవకాశాలను యువరాజ్ వదులుకున్నాడు. తన ఆటిట్యూడ్ తనకి మైనస్ అయ్యిందని సీనియర్ క్రికెటర్లు చెబుతుంటారు. అవన్నీ వదిలేసి ధోనీపై ఏడవడం సరికాదని అంటున్నారు.

ఎవరెన్ని అన్నా ఇండియన్ క్రికెట్ లో బెస్ట్ ఆల్ రౌండర్ ఎవరంటే, యువరాజ్ ముందు వరుసలో ఉంటాడు. అలాగే వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఎవరంటే, ధోనీ పేరు చెబుతారు. వీరిద్దరి అదనపు బలాల వల్ల.. నాడు ఇండియన్ క్రికెట్ టీమ్ రెండు ప్రపంచకప్ లను కొట్టింది. తర్వాత కాలంలో యువరాజ్ స్థానాన్ని రవీంద్ర జడేజా భర్తీ చేశాడు కానీ, ధోనీ స్థానాన్ని ఇప్పటికి కూడా ఎవరూ భర్తీ చేయలేకపోతున్నారు.

అందుకే ధోనీని విమర్శించేముందు యువరాజ్ తండ్రి…ఈ గణాంకాలన్నీ ఒకసారి పరిశీలన చేయాలని నెటిజన్లు కోరుతున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×