WTC Final: న్యూజిలాండ్ ( New Zealand) వర్సెస్ టీమ్ ఇండియా ( Team India ) మధ్య టెస్ట్ సిరీస్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్ నేపథ్యంలో… టీమిండియా దారుణంగా విఫలమైంది. టీమిండియాను వైట్ వాష్ చేసిన న్యూజిలాండ్ జట్టు సిరీస్ ఎగురేసుకుపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ సిరీస్ గెలవడం ఒక చరిత్ర. ఈ ఏడాది.. వరుసగా మూడు టెస్టులు గెలిచిన న్యూజిలాండ్… టీమిండియాను ( Team India ) చిత్తు చిత్తు చేసింది.
బౌలింగ్, బ్యాటింగ్, ఇలా ఏ రంగమైనా సరే… టీమిండియా కు ( Team India ) చుక్కలు చూపించి… గ్రాండ్ విక్టరీ కొట్టింది న్యూజిలాండ్. చివరి ముంబై టెస్టులు ఆయన గెలుస్తారని అనుకుంటే… గెలుపు దాకా వచ్చి చేతులెత్తేశారు. రిషబ్ పంత్, గిల్ తప్ప ఏ ఒక్క బ్యాటర్ క్రీజులో నిలబడలేకపోయారు. అందరూ దారుణంగా విఫలమయ్యారు. దింతో టీం ఇండియా పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బంగ్లాదేశ్ జట్టును… ఉతికి ఆరేసిన టీమ్ ఇండియా… న్యూజిలాండ్ విషయం వచ్చేసరికి చతికల పడింది.
Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్య వేలికి స్పెషల్ రింగ్..దీని వెనుక సీక్రెట్ ఇదే !
ఏ రంగంలోనూ రాణించలేదు టీమిండియా. అయితే ఇలాంటి నేపథ్యంలో… టీమిండియా కు ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ బరిలో ఉండాలంటే.. న్యూజిలాండ్ పైన కనీసం రెండు టెస్టులైన గెలవాల్సి ఉండేది. కానీ మూడు టెస్టులు ఓడిపోయింది టీమిండియా. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ పాయింట్స్ (World Test Championship ) టేబుల్ లో…. మొదటి స్థానంలో ఉన్న టీమిండియా రెండవ స్థానానికి పడిపోయింది.
దీంతో ఈ పాయింట్స్ టేబుల్ లో ఆస్ట్రేలియా ( Australia ) మొదటి స్థానం కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాకు 62.50 విన్నింగ్ పర్సంటేజ్ ఉంది. అదే సమయంలో… వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ బరిలో ఉండాలంటే ఆస్ట్రేలియా మరో ఐదు టెస్టులు గెలవాలి. వాళ్ల చేతిలో మరో ఏడు టెస్టు ఉన్నాయి. ఆ ఏడు టెస్టుల్లో ఐదు గెలిస్తే నేరుగా ఫైనల్ కు వెళుతుంది. ఇక టీమిండియా పరిస్థితి వేరుగా ఉంది. ప్రస్తుతం టీమిండియా విన్నింగ్ పర్సంటేజ్ వచ్చేసి… 58.33 గా ఉంది. టీమిండియా కు మరో ఐదు టెస్టుల ఛాన్స్ ఉంది.
Also Read: IND vs NZ 3rd Test: పరువు పాయె.. మూడో టెస్టులో టీమిండియా దారుణ ఓటమి
ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఐదు టెస్టుల సిరీస్ త్వరలోనే జరగనుంది. అయితే ఇందులో కనీసం నాలుగు టెస్టులు టీమిండియా గెలవాల్సి ఉంది. అప్పుడు టీమ్ ఇండియా ఫైనల్ కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. మరొక టెస్ట్ డ్రా చేసుకోవాలి. అసలు ఓడిపోకూడదు. ఇలా అయితేనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ కు (World Test Championship )టీమిండియా… వెళ్లడం జరుగుతుంది.