EPAPER

Vinesh Phogat: భారంతో భారత్‌కి తిరిగి వచ్చిన రెజ్లర్ వినేశ్, ఘనస్వాగతం పలికిన ఫ్యాన్స్

Vinesh Phogat: భారంతో భారత్‌కి తిరిగి వచ్చిన రెజ్లర్ వినేశ్, ఘనస్వాగతం పలికిన ఫ్యాన్స్

Wrestler Vinesh, Who Returned To India With A Heavy Heart, Was Warmly Welcomed By The Fans: పారిస్ ఒలింపిక్స్‌ 2024 మహిళల 50 కేజీల విభాగంలో ఫైనల్‌ వరకు చేరి అనూహ్య రీతిలో భారత స్టార్ రెజ్లర్ వినేశ్‌ ఫోగాట్‌పై అనర్హత వేటు ఎదుర్కొంది. ఆట ముగించుకొని భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ పారిస్‌ నుంచి నేరుగా స్వదేశానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆమెకు స్వాగతం పలికేందుకు రెజ్లర్లు బజరంగ్‌ పునియా, సాక్షి మాలిక్‌ తదితరులు విమానాశ్రయానికి వెళ్లారు. ఈ క్రమంలో వినేశ్‌ ఫొగాట్‌ ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. దీంతో ఆమెను పలువురు ఓదార్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.


ఇక కోర్టు ఆఫ్ స్పోర్ట్స్‌లో అప్పీలు చేసినా తనకి చుక్కెదురైంది. తనకు అనుగుణంగా రిజల్ట్స్ మాత్రం రాలేదు. ఆమె విజ్ఙప్తిని కాస్ కొట్టేసింది. తాజాగా ఆమె కార్యక్రమాలు ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చింది. దీంతో ఆమెకి క్రీడాభిమానులు భారీస్థాయిలో విమానాశ్రయానికి తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. వారందరిని చూసిన వినేశ్ తన భాధని ఆపుకోలేక భావోద్వోగానికి గురై కన్నీరుమున్నీరు అయింది. ఆమెను కాంగ్రెస్ దీపిందర్, రెజ్లర్లు సాక్షి, బజరంగ్ పునియాలు ఆమెను ఓదార్చారు.

Also Read: కోర్టు తీర్పుపై భారత రెజ్లర్ వినేష్ ఫోగట్‌ వైరల్ పోస్ట్


దేశంలోని ప్రతి ఒక్కరు ఆమె పోరాటాన్ని ఇష్టపడుతారు. దానికి ఇదే గొప్ప స్వాగతమంటూ బజరంగ్ పునియా అన్నారు. అంతేకాకుండా దేశం కోసం ఆమె ఏం చేసిందనేది మనందరికి తెలిసిన విషయమే. చాలా తక్కువ మంది మాత్రమే చేయగలరంటూ క్రీడాకారిణి సాక్షి మాలిక్ అన్నారు. ఇక వినేశ్ ఎప్పటికి భారత్‌ తరుపు నుండి పోరాట యోధురాలే అనేది మనందరికి తెలిసిందే. ఆమెను విన్నర్‌గా భావించి ఘనస్వాగతం పలికాం. అందరిలో కెల్లా తనని విజేతగా భావించారు భారత క్రీడాభిమానులు. అంతేకాకుండా ఆమె మా దృష్టిలో స్వర్ణ పతకాన్ని ఎప్పుడో సాధించింది. సాధారణంగా ఆమె 53 కేజీల విభాగంలో తలపడే రెజ్లర్ వినేశ్ కానీ.. ఒలింపిక్స్‌లో 50 కేజీల బరిలో దిగింది. ఎందుకనేది పెద్ద ప్రశ్నేనని రెజ్లర్ సత్యవర్త్‌ కడియన్ అభివర్ణించారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×