EPAPER

Shreyanka Patil : మ్యాచ్‌ మధ్యలో క్రికెటర్ కు మ్యారేజ్‌ ప్రపోజల్‌.. శ్రేయాంక పాటిల్ రియాక్షన్ ఇదే..!

Shreyanka Patil : మ్యాచ్‌ మధ్యలో క్రికెటర్ కు మ్యారేజ్‌ ప్రపోజల్‌.. శ్రేయాంక పాటిల్ రియాక్షన్ ఇదే..!

Shreyanka Patil


WPL 2024: ప్రస్తుతం మహిళల ప్రీమియర్ లీగ్ ..డ్య్లూపీఎల్ కొనసాగుతోంది. తాజాగా గుజరాత్ జెయింట్స్ , రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగింది. బెంగళూరు వేదిక జరిగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జీజీ 107 పరుగులు మాత్రమే చేసింది. ఈ టార్గెట్ ను బెంగళూరు జట్టు 12.3 ఓవర్లలోనే రీచ్ అయ్యింది. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

కెప్టెన్ స్మృతీ మంధాన (43) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడింది. తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (35 నాటౌట్), ఎల్సీ పెర్రీ (23) అజేయంగా నిలిచి ఆర్సీబీ సునాయాస విజయాన్ని అందించారు. ఇందంతా మ్యాచ్ హైలెట్స్. ఇక్కడ ఈ మ్యాచ్ మధ్యలో మాత్రం ఆసక్తికర ఘటన జరిగింది.


ఆర్సీబీ ప్లేయర్ శ్రేయాంక పాటిల్ ను ఉద్దేశించి ప్రదర్శించిన ఫ్లకార్డు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ క్రికెట్ ఫ్యాన్ ఈ కన్నడ క్రికెటర్ కు పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. ఇప్పుడు ఆ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. “విల్ యూ మ్యారీ మీ శ్రేయాంక పాటిల్” అని రాసి ఉన్న ఫ్లకార్డును మ్యాచ్ మధ్యలో ప్రదర్శించాడు. ఆ సమయంలో మ్యాచ్ చిత్రీకరిస్తున్న కెమెరాలు ఆ ఫ్లకార్డు వైపే తిరిగాయి. మైదానంలో ఉన్న బిగ్ స్క్రీన్ పై కూడా ఆ దృశ్యాలు కనిపించాయి. దీంతో మ్యాచ్ ను సీరియస్ ఆడుతున్న ప్లేయర్లు ఒక్కసారిగా చిరునవ్వులు చిందించారు.

Read More: లండన్‌కు రాహుల్.. ధర్మశాల టెస్టుకు డౌట్.. మరి బుమ్రా సంగతేంటి..?

ప్లేయర్ అందరూ ఆ ఫ్లకార్డును చూసి ముసిముసి నవ్వులు నవ్వుకున్నా.. శ్రేయాంక పాటిల్ ఎలాంటి ఎక్స్ ప్రెసన్ ఇవ్వలేదు. ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఆ తర్వాత ఫ్లకార్డు ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్  ఆ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోపైనా నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఇదో పబ్లిసిటీ స్టంట్ అని కొందరు కామెంట్ చేశారు.

21 ఏళ్ల శ్రేయాంక్ పాటిల్ ఆర్సీబీ తరఫున మహిళల ప్రిమియర్ లీగ్ లో ఆడుతోంది. ఆమె టీమిండియా తరఫున కూడా ప్రాతినిధ్యం వహిస్తోంది. ఇప్పటికే 2 వన్డే మ్యాచ్ లు ఆడింది. ఆరు టీ20లు కూడా ఆడింది. స్పిన్నర్ రాణిస్తున్న శ్రేయాంక్ వన్డేల్లో 4 నాలుగు వికెట్లు, టీ20ల్లో 8 వికెట్లు తీసుకుంది.

శ్రేయాంక పాటిల్ మైదానంలో ఎంతో చలాకీగా ఉంటుంది. ఉత్సాహంగా ఫీల్డ్ లో కదులుతుంది. ఆమె హావభావాలు క్రికెట్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆమెకు ఓ యువకుడు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు. బ్యాటింగ్ లోనూ ఆమెకు సామర్థ్యం ఉంది. ఆల్ రౌండర్ గా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. మహిళల ప్రిమియర్ లీగ్ లో అవసరమైనప్పుడు జట్టు తరఫున బ్యాట్ తో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్సీబీ జట్టులో స్పిన్నర్ గా ఆమె కీ రోల్ షోషిస్తోంది.

భారత్ మహిళల సీనియర్ జట్టులో చోటు కోసం శ్రేయాంక పాటిల్ ప్రయత్నిస్తోంది. డ్ల్యూపీఎల్ లో సత్తాచాటి సీనియర్ టీమ్ లోకి రెగ్యులర్ ప్లేయర్ కావాలన్న పట్టుదలతో ఉంది.

Tags

Related News

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Big Stories

×