EPAPER

World Cup 2023 Players: వరల్డ్ కప్ 2023 లో… పది మంది ప్రమాదకరమైన ప్లేయర్స్… ఎవరో తెలుసా…?

World Cup 2023 Players: వరల్డ్ కప్ 2023 లో… పది మంది ప్రమాదకరమైన ప్లేయర్స్… ఎవరో తెలుసా…?

World Cup 2023 Players: ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఈరోజుతో మొదలయ్యింది. ఈ టోర్నమెంట్లో మొత్తం పది జట్లు పాల్గొంటున్నాయి. అయితే ఇందులో కొందరు ఆటగాళ్లు మాత్రం యమ డేంజర్ అని వాళ్ళ రికార్డ్స్ చెబుతున్నాయి. అమీ తుమీ తేల్చుకొని కప్పు ఎలాగైనా కైవసం చేసుకోవాలి అని వరిలోకి దిగుతున్న పదిమంది డేంజరస్ ప్లేయర్స్ ఎవరో ఓ లుక్ చేద్దాం పదండి…


అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు జరగనున్న ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 కోసం వచ్చిన పది జట్లలో అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు…యువ సంచలనాలు కూడా ఉన్నారు. పాత కొత్త కలయికతో.. అనుభవం, ఉత్సాహం మేలవింపుతో కళకళలాడుతున్న ఈ జట్టులలో ఆ పదిమంది దీటైన ఆటగాళ్ల లిస్ట్ ఇదే మరి..

1.విరాట్ కోహ్లీ: భారత్


కింగ్ కోహ్లీ ప్రపంచ క్రికెట్లోని అతిపెద్ద స్టార్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ఉన్న ఇండియన్ టీం లో విధ్వంసకర బ్యాటింగ్ చేయగలిగిన సత్తా ఉన్న ఆటగాడు కోహ్లీ. ఇప్పటికే అతని ఖాతాలో పలు రకాల రికార్డ్ లు ఉన్నాయి. పైగా 2011 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు lobఉన్న అనుభవం కూడా కోహ్లీకి ఉంది. ప్రస్తుతం అతను ఇండియన్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సాధించిన 49 వన్డే సెంచరీల రికార్డుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఈ వరల్డ్ కప్ సాధించడమే కాకుండా ఆ రికార్డును కూడా బ్రేక్ చేస్తాడేమో చూడాలి మరి.

2.బాబర్ ఆజం: పాకిస్థాన్

పాకిస్తాన్ టీం లో గత ఆరు సంవత్సరాలుగా టాప్ ఫైవ్ బ్యాటింగ్ ఫార్మాట్ లో ఉన్న ప్లేయర్ బాబర్ ఆజం. అయితే మొన్న జరిగిన ఆసియా కప్ లో జట్టును ఫైనల్ కు నడిపించలేకపోయినప్పటికీ జరుగుతున్న వరల్డ్ కప్ లో మాత్రం విజయం సాధిస్తాను అనే ధీమాతో ఉన్నాడు.
బాబర్ టెక్నిక్, టాలెంట్ ,టెంపర్మెంట్ అతని ఒక భిన్నమైన ఆటగాడిగా ఆవిష్కరించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. జరగబోయే మ్యాచ్లలో అతని నుంచి ఒక అద్భుతమైన ప్రదర్శనను ఆశించవచ్చు.

3.రషీద్ ఖాన్: ఆఫ్ఘనిస్తాన్

రషీద్ ఖాన్.. ఒక ఐకాన్ లెగ్ స్పిన్నర్ గా గుర్తింపు పొందిన పేరు…2015 లో మైదానంలో అడుగుపెట్టిన ఖాన్ ఇప్పటికి తన ఖాతాలో 336 వికెట్లు జమ చేశాడు. ముఖ్యంగా అతను వేసే గూగ్లీలు ఎదుట ఉన్న ప్రత్యర్థిని కంగారు పెట్టేట్టుగా ఉంటాయి. అందుకే అతను గత ఎనిమిది సంవత్సరాలుగా ఆఫ్గనిస్తాన్ జట్టుకి ప్రధాన ఆధారంగా నిలబడ్డాడు.

4.ఆడమ్ జంపా: ఆస్ట్రేలియా

ఈ ఆస్ట్రేలియన్ స్పిన్నర్ కూడా ప్రత్యర్థులకు మంచి సవాలే విసురుతాడు. ఈ టోర్నమెంట్ లోనే జంపా ఒక స్పెషలిస్ట్ లెగ్ స్పిన్నర్ అని చెప్పొచ్చు. అంతేకాదు అతని స్ట్రైక్ రేట్ కూడా బలంగానే ఉంటుంది.

5.హెన్రిచ్ క్లాసెన్: దక్షిణాఫ్రికా

హెన్రిచ్ క్లాసెన్…సౌత్ ఆఫ్రికన్ పవర్ హీటర్.. బాల్ ను సునాయాసంగా బౌండరీలు దాటించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. గత నెలలో జరిగిన ఓడిఐ సిరీస్ లో ఏకంగా 83 బంతులకు 174 పరుగులు చేసిన క్లాసిక్ రికార్డ్ అతని సొంతం.

6.బెన్ స్టోక్స్: ఇంగ్లండ్

స్టోక్స్ స్ట్రైక్ రేట్ ఓ లెవెల్ లో ఉంటుంది.. 2019 ప్రపంచ కప్ ఇంగ్లాండ్ ఖాతాకి వెళ్లడానికి అతను కూడా ఒక ముఖ్య కారణం. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన ఓడిఐ సిరీస్ లో 124 బంతులకు 184 పరుగులు సాధించాడు. ఈ ప్లేయర్ స్పెషలిస్ట్ బ్యాటరే కాదు ఆల్ రౌండర్ కూడా. అంతేకాదు బెన్ స్టోక్స్:…విరాట్ కోహ్లీకి అభిమాన క్రికెటర్ కూడా.

7.షకీబ్ అల్ హసన్: బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ టీమ్ నుంచి వచ్చిన ఒక ఆల్ టైం గ్రేట్ ఆల్ రౌండర్లలో ఒకడు షకీబ్ అల్ హసన్. చాకచక్యంగా బాల్ ని స్పిన్ చేయగలిగిన ఎడమ చేతి వాటం ప్లేయర్ ఇతను.
అందుకే గత 14 సంవత్సరాలుగా ఐసిసి ఓడిఐ ఆల్రౌండ్ ర్యాంకింగ్ లలో ఇతనిదే పై చెయ్యి. 17 ఏళ్ల కెరియర్లో 300 వికెట్లు, 7384 పరుగులు సాధించి ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఈసారి ఎలాగైనా కప్ సాధించాలి అనే గట్టి పట్టుదలతో ఉన్నాడు మరి.

8.షాహీన్ షా ఆఫ్రిది: పాకిస్థాన్

పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా ఆఫ్రిది బాల్ మ్యాజిక్ భారత్ పిచ్ పై ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది అని విమర్శకుల విశ్లేషణ. తరచుగా ఇతను ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్ లో అగ్రస్థానంలో ఉంటాడు మరి. ఈ ఎడమచేతి వాటం పేసర్‌కు వేసే మొదటి ఓవర్ లోనే వికెట్ తీయడం అంటే ఎంతో ఆసక్తి.. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ నసీమ్ షా గాయపడటంతో…ఓపెనింగ్ బౌలర్ గా
ఆఫ్రిది దిగుతాడు. మరి ఈ అవకాశాన్ని అతను ఎంతవరకు సద్వినియోగపరుచుకుంటాడో చూడాలి.

9.మిచెల్ సాంట్నర్: న్యూజిలాండ్

మిచెల్ జోసెఫ్ సాంట్నర్ .. అన్ని ఫార్మేట్ లలో సమర్థవంతంగా ఆడగలిగిన న్యూజిలాండ్ ప్లేయర్ ఇతడు. టెస్టుల్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక ఏడవ వికెట్ భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు ఈ ప్లేయర్.

  1. మతీషా పతిరణ

బేబీ మలింగ అని ముద్దుగా పిలుచుకుని ఈ శ్రీలంక ప్లేయర్ 2023 ఐపీఎల్ ట్రాఫిక్ గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ టీం లో ఒక కీలక మెంబర్. అచ్చం మలింగా యాక్షన్ తో బౌలింగ్ వేయడమే కాదు.. వికెట్లు కూడా బాగా తీస్తాడు. అయితే అతను తన బౌలింగ్ పద్ధతి కంటే కూడా వికెట్ తీశాక చేసే ప్రక్రియకి సోషల్ మీడియాలో బాగా ఫేమస్. పతిరణ వికెట్ తీసిన ప్రతిసారి రెండు చేతులను చాతికి ఆన్చి.. పైకి చూస్తూ కళ్లు తేలేస్తాడు.. పెదవులు ఏదో మంత్రాన్ని పలుకుతున్నట్టు ఉంటాయి.ఆ సీన్ చూస్తే మాత్రం విరూపాక్ష సినిమా గుర్తు రావాల్సిందే.

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×