EPAPER

ODI World Cup 2023  : పాకిస్తాన్ సెమీస్ చేరే అవకాశం ఉందా?

ODI World Cup 2023  : పాకిస్తాన్ సెమీస్ చేరే అవకాశం ఉందా?
ODI World Cup 2023

ODI World Cup 2023  : వర్షం వచ్చి పాకిస్తాన్ కు వరంగా మారింది. న్యూజిలాండ్ కి శాపంగా మారింది. అదే మ్యాచ్ లో కివీస్ గాని గెలిచి ఉంటే, ఈ పాటికి కాన్ఫిడెంట్ గా ఉండేది. లీగ్ లో ఆఖరి మ్యాచ్ శ్రీలంకతో ధీమాగా ఆడేది. అదే ఇప్పుడు చావో రేవో అన్నట్టుగా ఆడాల్సిన పరిస్థితి వచ్చింది.


ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే, కివీస్ తో మ్యాచ్ ను వర్షం వచ్చి కాపాడింది. కాకపోతే వాళ్లు కూడా 25 ఓవర్లలో 200 పరుగులు చేశారు. అయితే చివరికి వచ్చేసరికి సినిమా ఎలా ఉండేదో ఎవరికీ తెలీదు కాబట్టి, అలా గెస్ చేయడం కరెక్ట్ కాదు.

మొత్తానికి ఇప్పుడు మూడు జట్లు సెమీస్ రేస్ లో ఉన్నాయి. ఆస్ట్రేలియా 10 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. తర్వాత తను ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ పై ఆడాల్సి ఉంది. అందువల్ల తన స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదనే చెప్పాలి.


పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్గనిస్తాన్ మూడింటిలో ఏ జట్టుకి అవకాశాలున్నాయని అంటే న్యూజిలాండ్ కే బాగున్నాయని చెప్పాలి. ఆఖరి మ్యాచ్ శ్రీలంక మీద ఆడి భారీ స్కోరు సాధిస్తే రన్ రేట్ ప్రకారం. పాక్, ఆఫ్గాన్లను దాటేస్తుంది.

పాకిస్తాన్ కూడా ఆఖరి మ్యాచ్ బలహీనపడిన ఇంగ్లండ్ మీద ఆడాలి. ఇప్పుడు కివీస్ రన్ రేట్ తమ కన్నా ఎక్కువ కాబట్టి, అంతకన్నా గట్టిగా ఆడి విజయం సాధిస్తే అప్పుడు 4 వ ప్లేస్ తనది అవుతుంది.

ఆఫ్గనిస్తాన్ తర్వాత రెండు మ్యాచ్ లు బలమైన జట్లతో ఆడనుంది. ఒకటి ఆస్ట్రేలియా, రెండు సౌతాఫ్రికా…అందువల్ల ఏమైనా అద్భుతాలు జరిగి రెండింటా విజయం సాధిస్తే 12 పాయింట్లతో సెమీస్ కు వెళుతుంది.

కనీసం ఒకటి గెలిచినా 10 పాయింట్లతో పాక్, కివీస్ కు సమానం అవుతుంది.  ఇంగ్లండ్ పై పాకిస్తాన్ గెలిచిన పక్షంలో లెక్కలివి. అప్పుడు కివీస్, పాక్, ఆఫ్గాన్ 10 పాయింట్లతో ఉంటే, రన్ రేట్ ప్రకారం మెరుగ్గా ఉన్న జట్టు సెమీస్ కి వెళతాయి.

నాలుగో స్థానమే ఇంత కష్టంగా ఉంటే, పాక్ మూడుకి రావాలంటే చాలా మిరాకిల్స్ జరగాలి. పెద్ద జట్లన్నీ ఓడిపోవాలి. అదెలాగూ జరగదు కాబట్టి, నాల్గవ స్థానంపైన,  ఈ నెల 11న జరిగే మ్యాచ్ పైనే పాక్ ఆశలన్నీ పెట్టుకుంది.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×