EPAPER
Kirrak Couples Episode 1

AFG vs SL : మ‌రో సంచ‌ల‌నం.. శ్రీలంక పై అఫ్గానిస్థాన్ ఘన విజ‌యం

AFG vs SL : మ‌రో సంచ‌ల‌నం.. శ్రీలంక పై అఫ్గానిస్థాన్ ఘన విజ‌యం

AFG vs SL : వన్డే వరల్డ్ కప్ 2023లో ఆఫ్గానిస్తాన్ సంచలనాల మీద సంచలనాలు నమోదు చేస్తోంది. మొన్న ఇంగ్లండ్ ని మట్టికరిపించింది, తర్వాత పాక్ కి చుక్కలు చూపించింది.ఇప్పుడు శ్రీలంకకి అదే గతి పట్టించింది. పుణెలో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసి 49.3 ఓవర్లలో 241 పరుగులకి ఆలౌట్ అయ్యింది. తర్వాత ఛేజింగ్ లోఏ మాత్రం కంగారు పడకుండా 45.2 ఓవర్లలో ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించింది. టేబుల్ లో 6 పాయింట్లతో పాక్ ని దాటి 5 స్థానంలోకి చేరింది.


ఓడలు బళ్లవుతాయి…బళ్లు ఓడలవుతాయని అంటారు. అది 2023 వన్డే వరల్డ్ కప్ లో నిజమైందనే చెప్పాలి. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ అట్టడుక్కి పోవడం ఏమిటో? ఆఫ్గనిస్తాన్ అన్నింటినీ దాటి 5 ప్లేస్ లో ఉండటమేమిటో? అని క్రీడాపండితులు ఆశ్చర్యపోతున్నారు.

టాస్ గెలిచిన ఆఫ్గాన్లు మొదట ఫీల్డింగ్ తీసుకున్నారు. అలా బ్యాటింగ్ కి వచ్చిన శ్రీలంక ఓపెనర్లు ఆత్మవిశ్వాసంతోనే కనిపించారు. కానీ ఆఫ్గాన్ బౌలింగ్ ని ఎదుర్కొని పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డారు. ఈ దశలో ఓపెనర్ దిముత్ కరుణరత్నే (15) అవుట్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 22 పరుగుల మీద ఉంది. తర్వాత ఫస్ట్ డౌన్ వచ్చిన కెప్టెన్ కుశాల్ మెండిస్ జాగ్రత్తగానే ఆడాడు. ఈ దశలో మరో ఓపెనర్ పాథుమ్ నిశాంక 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే తనే మ్యాచ్ లో టాప్ స్కోరర్ గా ఉన్నాడు.


అయితే బాగా ఆడుతున్నాడు అనుకున్న దశలో మెండిస్ (39) అవుట్ అయ్యాడు. తర్వాత సెకండ్ డౌన్ వచ్చిన సదీర సమరవిక్రమ (36) ఒక మోస్తరుగా ఆడి అవుట్ అయ్యాడు. అప్పటికి  29.1 ఓవర్లు గడిచేసరికి 4 వికెట్ల నష్టానికి శ్రీలంక 139 పరుగులు చేసింది. తర్వాత డిసిల్వా (14), ఏంజిలో మాథ్యూస్ (23), దుష్మంత చమీరా (1), మహేష్ తీక్షణ (29), కసూన్ రజిత (5) ఇలా వచ్చి అలా కొందరు వెళితే, కొందరు బ్యాట్ ని అడ్డదిడ్డంగా కొట్టి ఏదో నాలుగు పరుగులు చేసి అవుట్ అయ్యారు. మొత్తానికి 49.3 ఓవర్లలో 241 పరుగులకి శ్రీలంక చాప చుట్టేసింది.

ఆఫ్గాన్ బౌలర్లలో ముజీబుర్ రహ్మాన్ 2, ఫజల్ హక్ ఫారుఖీ 4, అజ్మతుల్లా ఓమర్ జాయ్, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్టు తీశారు. ఛేజింగ్ కి వచ్చిన ఆఫ్గాన్ ముందే అంతా ప్రిపేర్ అయినట్టుగానే వచ్చింది. ఎక్కడ కూడా శ్రీలంక బౌలర్లకి చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు. ఎంతో జాగ్రత్తగా ఆడారు. 242 పరుగుల లక్ష్యాన్ని 45.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా విజయం సాధించింది. అనవసరపు షాట్లుకి వెళ్లలేదు. కానీ ఒకప్పుడు ఉన్నత ప్రమాణాలతో కనిపించిన శ్రీలంక ఫీల్డింగ్ ఈరోజు చెత్తగా అనిపించింది. క్యాచ్ లు డ్రాప్ చేయడంతో ఆఫ్గాన్లు టెన్షన్ లేకుండా విజయం సాధించారనే చెప్పాలి.

అయితే బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్గాన్ కి తొలి ఓవర్ లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ గుర్భాజ్ పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యాడు. అంతా ఇంతేసంగతని అనుకున్నారు. కానీ ఫస్ట్ డౌన్ వచ్చిన రహ్మత్ షా నిలదొక్కుకున్నాడు. 62 పరుగులు చేశాడు. జట్టుని సురక్షిత స్థానానికి తీసుకెళ్లాడు. ఈ దశలో మరో ఓపెనర్
మరో ఓపెనర్ ఇబ్రహీం (39) అవుట్ అయ్యాడు. అప్పటికి 16.5 ఓవర్లు అయ్యాయి. 2 వికెట్ల నష్టానికి 73 పరుగుల మీద ఆఫ్గాన్ ఉంది. అప్పుడు సెకండ్ డౌన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది (58 నాటౌట్ ) వచ్చాడు.  అజ్మతుల్లా (73 నాటౌట్) తో కలిసి ఇద్దరూ జట్టుని దిగ్విజయంగా విజయ తీరాలకు చేర్చారు.  

శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక 2, కసున్ రజితకి 1 వికెట్టు దక్కాయి. పాయింట్ల పట్టికలో ఎవరూ ఊహించని విధంగా హేమాహేమీ జట్లను కాదని టేబుల్ లో 5 స్థానానికి చేరుకుంది. ఇప్పుడు మిగిలిన రెండు మ్యాచుల్లో గెలిస్తే టేబుల్ మంచి రసవత్తరంగా మారిపోతుందని అంటున్నారు.

Related News

SRH: హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ గుడ్‌న్యూస్..SRHలోకి మొనగాడు వస్తున్నాడు !

Musheer Khan: స‌ర్ఫ‌రాజ్ సోద‌రుడు ముషీర్ కు ఘోర రోడ్డు ప్రమాదం…క్రికెట్‌ కు దూరం !

IPL 2025: CSK జట్టులో కల్లోలం…సీక్రెట్‌ గా జారుకుంటున్న ప్లేయర్లు ?

Ashwin: అశ్విన్​తో కలిసి పంత్ తొండాట…ఇంటి దారి పట్టిన బంగ్లా కెప్టెన్​!

Rishabh Pant: పాపం…RCBలోకి రాకుండా పంత్‌ పై కోహ్లీ కుట్రలు..?

Yuvraj Singh: ఆ హీరోయిన్‌ ను వాడుకుని వదిలేశాడు..ఆస్ట్రేలియాలో అర్థరాత్రుల్లు కూడా ?

Shakib Al Hasan: టీ20లకు బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ వీడ్కోలు

Big Stories

×