EPAPER

Women’s Premier League 2024: ఐపీఎల్ జాతరొచ్చింది.. నేటి నుంచి అమ్మాయిలతో ఆరంభం!

Women’s Premier League 2024: ఐపీఎల్ జాతరొచ్చింది.. నేటి నుంచి అమ్మాయిలతో ఆరంభం!

Women’s Premier League 2024 Full Schedule: ఐపీఎల్ అంటేనే ఒక జాతర అని చెప్పాలి. మూడు గంటల్లో ఫలితం తేలిపోయే ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆదరణ పెరిగిపోతోంది. వన్డే తరహాలో రోజంతా సాగదు, టెస్ట్ మ్యాచ్ తరహాల్లో రోజులు రోజులు సాగదు. ధనా ధన్ క్రికెట్, దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేగుతోంది. ఇప్పటికే అమెరికా లాంటి దేశాలు టీ20లోకి వచ్చేశాయి.


క్రికెట్ ఆడే దేశాల్లో జరిగే ప్రీమియర్ లీగ్ అన్నింటికల్లా ఐపీఎల్ లీగ్ నెంబర్ వన్‌గా ఉంది. త్వరలోనే ఐపీఎల్ ప్రారంభం కానుండగా అంతకు ముందు బోనస్‌లా మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌కు నేడే శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్‌లన్నీ జియో సినిమా, స్పోర్ట్స్ 18లో ప్రత్యక్షప్రసారం కానున్నాయి.

Read More: రాంచీ టెస్టులో.. బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ ఆరంగేట్రం..


ప్రారంభమ్యాచ్‌కు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ హాజరు కానున్నాడు. తనతో పాటు పలువురు హీరోలు షాహిద్ కపూర్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్ర, టైగర్ ష్రాఫ్, కార్తీక్ ఆర్యన్ సందడి చేయనున్నారు.

ముంబై, ఢిల్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ మొత్తం ఐదు జట్లు ఈ సీజన్‌లో టైటిల్ కోసం పోటీ పడుతున్నాయి. గత ఏడాది టైటిల్ విన్నర్, డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్ మధ్య తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది.

భారత మహిళల జట్టు టీమ్ అందరూ కూడా వివిధ జట్లలో తమ ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, శిఖా పాండే, రేణుక సింగ్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, షెఫాలీ వర్మ, లాంటి స్టార్లు ఉన్నారు. ఇంకా యువ క్రికెటర్లు శ్రేయాంక పాటిల్, మిన్ను మణి కూడా రెడీ అయ్యారు.

అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు ఎలీస్ పెర్రీ, చమరి ఆటపట్టు, సోపీ డివైన్, మెగ్ లానింగ్,  అలీసా హీలీ, బెత్‌మూనీ తదితరులు వచ్చేశారు.

తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు క్రికెటర్లు ఐపీఎల్‌లో సందడి చేయనున్నారు. ఒకప్పుడు ఒకరిద్దరే ఉండేవారు. ఇప్పుడు పదిమంది వరకు ఉండటం విశేషం. స్నేహ దీప్తి, త్రిష పూజిత, షబ్నం, అరుంధతి రెడ్డి,  సబ్బినేని మేఘన, గౌహర్ సుల్తానా, యషశ్రీ, అంజలి తదితరులు ఆడనున్నారు.

ఈసారి ఐపీఎల్ రెండు వేదికలపై నిర్వహించనున్నారు. ముంబైలోని డీవై పాటిల్, బ్రబౌర్న్ మైదానాల్లో అరంగేట్ర సీజన్  ప్రారంభం అవుతుంది. తర్వాత నుంచి బెంగళూరు వేదికగా 11 మ్యాచ్‌లు.. ఢిల్లీ వేదికగా మరో 11 మ్యాచ్‌లను షెడ్యూల్ చేశారు. మార్చి 17న ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. 

Related News

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Yashasvi Jaiswal: యశస్వి జైశ్వాల్ ముంగిట.. అద్భుత రికార్డ్

Big Stories

×