EPAPER

Shahbaz Ahmed Comments: ముందుంది అసలైన సమరం.. సంబురాలు చేసుకునేది అప్పుడే..!

Shahbaz Ahmed Comments: ముందుంది అసలైన సమరం.. సంబురాలు చేసుకునేది అప్పుడే..!

Shahbaz Ahmed Comments on IPL Final: ఐపీఎల్ క్వాలిఫైయర్ 2 లో మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్ గా నిలిచిన షాబాజ్ అహ్మద్ మాట్లాడుతూ సంబురాలు ఇప్పుడే కాదని అన్నాడు. ముందుంది అసలైన సమరమని అన్నాడు. కోల్ కతాని ఎదుర్కోవడం ఎంతో సవాళ్లతో కూడుకున్నదని అన్నాడు. కప్ కొట్టిన తర్వాతే అసలైన సంబరాలు చేసుకుంటామని అన్నాడు.


ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన షాబాజ్ అహ్మద్.. ఎంతో విలువైన 18 పరుగులు చేయడమే కాదు.. కీలకమైన 3 వికెట్లు తీసి మ్యాచ్ ని హైదరాబాద్ వైపు తిప్పేశాడు. బ్రహ్మాండంగా ఆడుతున్న యశస్వి జైశ్వాల్ ని అవుట్ చేసి, మ్యాచ్ ని టర్న్ చేశాడు. తర్వాత యువ సంచలనం రియాన్ పరాగ్ (6)ని అవుట్ చేశాడు. తర్వాత అశ్విన్ ని డక్ అవుట్ చేశాడు. దీంతో మ్యాచ్ స్వరూపమే ఒక్కసారి మారిపోయింది. 4 ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి డేంజరస్ బ్యాటర్ల పరాగ్, జైశ్వాల్‌ను అవుట్ చేశాడు.

హైదరాబాద్ కి బ్రేక్ అందించిన షాబాజ్ అహ్మద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అనంతరం మాట్లాడుతూ మ్యాచ్ కి ముందు మా కెప్టెన్, కోచ్ ఒకటే మాట చెప్పారు. సమయం వచ్చినప్పుడు నిన్ను పంపిస్తామని తెలిపారు. బ్యాటింగ్ లైనప్ కుప్పకూలినప్పుడు నీ అవసరం ఉంటుందని, అందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారని అన్నాడు.


అయితే ఇంపాక్ట్ ప్లేయర్ గా నన్ను మాత్రం కోచ్ ఎంపిక చేశాడు. దీనిని కెప్టెన్ కమిన్స్ ఓకే చేశాడు. వారిద్దరూ ఒప్పుకోవడం వల్లే నేను ఆడగలిగాను, నిరూపించుకున్నానని అన్నాడు. వారివల్ల ప్రపంచానికి పరిచయం అయ్యానని తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగులో రాణించి అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది అన్నాడు. వచ్చే ఫైనల్ మ్యాచ్ లో కూడా రాణించి నా వంతు పాత్ర సమర్థవంతంగా పోషించాలని భావిస్తున్నట్టు తెలిపాడు.

Also Read: స్పిన్నర్లు తిప్పేశారు.. హైదరాబాద్ ను గెలిపించారు!

ఈ సందర్భంగా హైదరాబాద్ మ్యాచ్ లో మరో హీరో అభిషేక్ శర్మ మాట్లాడుతూ 4 ఓవర్లు కోటా వేస్తానని అనుకోలేదు. నిజానికి బౌలింగుని పక్కన పెట్టి, రెండేళ్ల నుంచి బ్యాటింగుపైనే ఫోకస్ పెట్టానని అన్నాడు. కానీ ఇప్పుడు ఆల్ రౌండర్ గా వెలుగులోకి రావడం ఆనందంగా ఉందని అన్నాడు. మరి ఈ ఇద్దరు హీరోలు వచ్చే ఫైనల్ మ్యాచ్ లో ఎలా ఆడతారో వేచి చూడాల్సిందే.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×