EPAPER

T20 World Cup: 30 ఏళ్ల తర్వాత అదే సీన్ చూస్తామా?

T20 World Cup: 30 ఏళ్ల తర్వాత అదే సీన్ చూస్తామా?

T20 వరల్డ్ కప్ లో ఇంటిదారి పడుతుందనుకున్న పాకిస్థాన్ అనూహ్యంగా అదృష్టం కలిసొచ్చి ఫైనల్ చేరితే… ఫైనల్ వెళ్తుందని ఆశలు పెట్టుకున్న టీమిండియా మాత్రం అభిమానులను నిరాశపరిచింది. ఫైనల్లో ఇంగ్లండ్ తో తలపడాల్సి రావడంతో… పాకిస్థాన్ అభిమానులు ఇప్పుడు సంబరపడుతున్నారు. 1992 వరల్డ్ కప్ నాటి పరిణామాలే పొట్టి వరల్డ్ కప్ లోనూ జరిగాయని… పాకిస్థాన్ ఫైనల్లో ఇంగ్లండ్ ను ఓడించడం ఖాయమని అంటున్నారు.


T20 వరల్డ్ కప్‌లో పాక్ ఆటతీరు చూస్తే… అచ్చం 1992 వన్డే వరల్డ్‌కప్‌నే తలపిస్తోంది. ఆస్ట్రేలియాలోనే జరిగిన 1992 వన్డే వరల్డ్‌కప్‌లో లీగ్‌ దశలో భారత్ చేతిలో ఓడిన పాకిస్థాన్… ఇంటిబాట పట్టాల్సిన పరిస్థితుల్లో ఆఖరి రెండు లీగ్‌ మ్యాచ్‌ల్లో అద్భుతంగా ఆడి సెమీస్‌కు చేరింది. ఆ తర్వాత సెమీస్ లో న్యూజిలాండ్‌తో తలపడి గెలిచి ఫైనల్ చేరింది. ఫైనల్లో ఇంగ్లండ్‌ను మట్టికరిపించి జగజ్జేతగా నిలిచింది. ఇప్పుడు T20 వరల్డ్ కప్ లోనూ అదే జరిగింది. సూపర్‌-12 దశలో టీమిండియా చేతిలో ఓడిన పాకిస్థాన్… సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ పై గెలిచింది. కానీ… నెదర్లాండ్స్ పై గెలిస్తే సెమీస్ చేరే ఛాన్స్ ఉన్న సఫారీలు అనూహ్యంగా ఓడిపోవడంతో… అదృష్టం కలిసొచ్చి పాక్ సెమీస్ చేరింది. అచ్చం 1992 వరల్డ్ కప్ లో మాదిరే… సెమీస్ లో కివీస్ పై గెలిచి… ఫైనల్లో ఇంగ్లండ్ తో తలపడేందుకు సిద్ధమైంది. దాంతో… పొట్టి వరల్డ్ కప్ కచ్చితంగా పాకిస్థాన్ కే రాసిపెట్టి ఉందంటున్నారు… అభిమానులు.

అయితే ఇంగ్లండ్ ఫ్యాన్స్ మాత్రం… ఇప్పుడున్న ఫామ్ లో తమ జట్టును ఓడించడం అంత తేలిక కాదంటున్నారు. సెమీస్ లో భారత్ ను చితగ్గొట్టి ఫైనల్ చేరిన ఇంగ్లిష్ టీమ్… పాక్ కు కూడా షాక్ ఇవ్వడం ఖాయమంటున్నారు. మరి పాకిస్థాన్ అభిమానుల సెంటిమెంట్ ప్రకారం ఆ జట్టే కప్ ఎగరేసుకుపోతుందా? లేక ఇంగ్లిష్ ఫ్యాన్స్ ధీమా ప్రకారం బట్లర్ సేన పొట్టి కప్ ను ఒడిసి పడుతుందా? అనేది తేలాలంటే… వచ్చే ఆదివారం వరకు ఆగాల్సిందే.


Tags

Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×