EPAPER

Ind vs Eng 2nd Test : సర్ఫరాజ్ ని అందుకే తీసుకోలేదా?

Ind vs Eng 2nd Test : సర్ఫరాజ్ ని అందుకే తీసుకోలేదా?

Ind vs Eng 2nd Test : టీమ్ ఇండియాలో కీలకమైన ఆటగాళ్లు ముగ్గురు విరాట్ కొహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా విశాఖలో జరిగే రెండో టెస్ట్ లో ఆడటం లేదు. దీంతో విరాట్, రాహుల్ ప్లేస్ లో ఇద్దరు బ్యాటర్లను తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. దీంతో రజత్ పాటీదార్, సర్ఫరాజ్ ఖాన్ లు రిజర్వ్ బెంచ్ లోకి వచ్చారు. అయితే ఆల్రడీ విరాట్ కొహ్లీ ప్లేస్ లో శుభ్ మన్ గిల్ ఆడుతున్నాడు. రాహుల్ ప్లేస్ లో వీరిద్దరిలో ఎవరో ఒకరినే తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.


దీంతో టీమ్ మేనేజ్మెంట్ పై తీవ్ర ఒత్తిడి పడింది. ఎందుకంటే ఇద్దరు కూడా బాగా ఆడుతున్నారు. దాంతో విధిలేని పరిస్థితుల్లో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం రజత్ పటీదార్ కి దక్కింది. సర్ఫరాజ్ కి అదృష్టం ఇంకా తలుపు తట్టలేదు. కానీ నెట్టింట మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ని టార్గెట్ చేస్తూ వీటిని సంధిస్తున్నారు.

రజత్ కంటే సర్ఫరాజ్ కు దేశవాళీ క్రికెట్ లో మంచి రికార్డ్ ఉందని కామెంట్ చేస్తున్నారు. అంతే కాదు గిల్, శ్రేయాస్  విషయంలో ఎందుకంత అవ్యాజ్యమైన ప్రేమ చూపిస్తున్నారని విమర్శిస్తున్నారు. వారు అన్నిసార్లు విఫలమవుతున్నా పదేపదే అవకాశాలిస్తున్నారు. ఫామ్ లో లేని ఇద్దరిని భరిస్తున్నారని ఎత్తిపొడుస్తున్నారు.


వీరిద్దరికి టెస్ట్ మ్యాచ్ లో అవకాశం రావడానికి, ఇంతకన్నా మంచి సమయం లేదని అంటున్నారు. రేపు మూడో టెస్ట్ కి రాహుల్, కొహ్లీ వచ్చేస్తే, ఇంతే సంగతని అంటున్నారు. అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం వచ్చినందుకు రజత్ పటీదార్ కు అభినందనలు, అదే సమయంలో సర్ఫరాజ్ కి ఇవ్వకపోవడం దారుణమని అంటున్నారు.

టీమిండియా మేనేజ్‌మెంట్ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని రజత్ పటీదార్ ను ఎంపిక చేసిందని అంటున్నారు. సర్ఫరాజ్ కన్నా, పటీదార్ నిలకడగా  టెస్ట్ ఫార్మాట్ లో ఆడతాడని, అందుకే అతనికి ప్రాధాన్యమిచ్చినట్లు  తెలుస్తోంది.

గిల్, శ్రేయాస్ విఫలం కావడం వల్ల, నిలకడగా ఆడేవారికి ప్రాధాన్యం ఇచ్చినట్టుగా చెబుతున్నారు. పైగా   రజత్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో 111, 151 రెండు శతకాలు బాదాడు.అది కూడా ఎంపికకు ప్రధాన కారణమని అంటున్నారు. 

ఇకపోతే సర్ఫరాజ్ కూడా కంగారుపడాల్సిన పనేం లేదు, గిల్, శ్రేయాస్ ఇద్దరూ రెండో టెస్ట్ లో తేలిపోయారు. అందుకని మూడో టెస్ట్ లో అవకాశం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని సీనియర్లు వ్యాక్యానిస్తున్నారు. 

Related News

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Big Stories

×