Big Stories

India’s Next T20I Captain: సీనియర్స్ రిటైర్మెంట్.. నెక్ట్స్ టీ20 పగ్గాలు ఎవరికి?

Who Will be India Next T20 World Cup Captain: 13 ఏళ్ల తర్వాత టీమ్ ఇండియా వరల్డ్‌కప్‌ను ముద్దాడింది. బాల్‌తో కాదు.. టీవీల ముందు కూర్చున్న వారి గుండెలతో ఓ ఆట ఆడుకుందనే చెప్పాలి. ఆఖరి బాల్‌ వరకు నరాలు తెగేంత ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో ఆఖరికి రోహిత్ సేన విక్టరీ సాధించింది. సగర్వంగా కప్పును పైకెత్తింది. నిజానికి ఈ మూమెంట్‌ కోసం టీమ్‌ ఇండియా మాత్రమే కాదు. మొత్తం ఇండియా అంతా ఎదురుచూసింది. ఈ ఉద్విగ్న క్షణాలను అలా గుండెలో నింపేసుకొని ఆనందించే లోపలే కొన్ని ప్రశ్నలు.. మరికొన్ని వార్తలు ఆనంద బాష్పాలను కాస్త.. కన్నీరుగా మార్చేసే పరిస్థితి వచ్చింది. ఇంతకీ అతి త్వరలో టీమ్‌ ఇండియాలో జరిగే మార్పులేంటి? ఈ మార్పులు ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతున్నాయి?

- Advertisement -

2024 వరల్డ్‌కప్‌.. ఎన్నో సంతోషాలకు కేరాఫ్‌.. ఓ టీమ్ స్పిరిట్‌కు బెస్ట్‌ ఎగ్జాంపుల్.. వీరి వల్ల మాత్రమే వరల్డ్ కప్ గెలిచాం అని చెప్పుకునే పరిస్థితి లేదు. విన్నింగ్ ఈక్వెషన్ నుంచి ఏ ఒక్కరిని తీసేసినా కప్పు మనకు వచ్చే సీనే లేదు. రోహిత్‌, కోహ్లీ, అక్షర్ పటేల్, బుమ్రా, అర్షదీప్, హార్దిక్, సూర్యా.. ఇలా ఎవరి పార్ట్ వాళ్లు సక్సెస్‌ఫుల్‌గా నిర్వర్తించారు. ఫైనల్‌ ఫైట్‌లో పంత్ ఔటైన తర్వాత అక్షర్‌ను బరిలోకి దించడమనేది రోహిత్ సూపర్ కెప్టెన్సీకి ఓ ఉదాహరణ.. ఇక కోహ్లీ కంబ్యాక్‌ అయితే మరో హైలేట్.. చివరి ఐదు ఓవర్లు ఇండియన్ బౌలింగ్ స్క్వాడ్ చేసిన మిరాకిల్.. చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు.

- Advertisement -

ఇక హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. అతని గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువే.. అందుకోలేనంత ఎత్తులో ఆకాశంలో ఎగురుతున్న గాలిపటానికి. కనిపించని దారంలాంటి వాడు ద్రావిడ్. ప్లేయర్‌గా వరల్డ్ కప్‌ టీమ్‌లో భాగం కాలేకపోయినా కోచ్‌గా కప్పు సాధించి తన సత్తా చాటాడు. మిస్టర్‌ కూల్‌ అని పిలుచుకునే ద్రవిడ్‌ కూడా.. కప్పు గెలిచాక ఎంత ఎక్సైట్‌ అయ్యాడో చూస్తే.. ఈ కప్పు గెలవడానికి తాను పడ్డ కష్టం ఏంటో అర్థమవుతోంది. ఇవన్ని హ్యాపీ నోట్స్.. అంతా బాగుంది.

కానీ ఇదే వరల్డ్‌కప్ కొన్ని మరిచిపోలేని.. ఇక తిరిగిరాని జ్ఞాపకాలను మిగిల్చి వెళ్తుంది. రానున్న సంవత్సరాల్లో ఎన్నో వరల్డ్ కప్‌లు వస్తాయి. టీమ్‌ ఇండియా అందులో అదరగొడుతుంది. కానీ ఇకపై ఆ టీమ్‌లో రోహిత్, కోహ్లీని ఇక చూడలేం.. ఈ జోడి చేసిన మిరాకిల్స్‌ ఇకపై చెప్పుకోవడమే తప్ప కళ్లారా చూడలేం. ఇకపై తెర వెనకుండి వ్యూహాలు రచించి వాటిని అమలు చేసే ద్రావిడ్ కూడా ఇక మనకు కానరాడు. ద్రావిడ్ కూడా హెడ్ కోచ్‌ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు.. ఇదే ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్‌కు అస్సలు డైజెస్ట్‌ కానీ అంశం.

రోహిరాట్‌ లేని టీమ్‌ ఎలా ఉంటుంది? నిజంగా కొన్ని రోజుల పాటు ఈ వెలితిని ఎవ్వరూ తీర్చలేరు. అయితే రోహిత్.. లేదా విరాట్.. ఇద్దరిలో ఎవరూ క్రీజులో కుదురుకున్నా ప్రత్యర్థి టమ్స్‌కు వెన్నులో వణుకు పుట్టాల్సిందే.. విన్నింగ్ ప్రాబబిలిటీని మార్చేసే ప్లేయర్స్‌ వీరిద్దరు.. విపత్కర పరిస్థితుల్లో క్రీజులో పాతుకుపోయి పరుగుల వరద పారించేది ఎవరు? ఇక అంతా అయిపోయిందనుకున్న మ్యాచ్‌లను ఒంటి చెత్తో గెలిపించేది ఎవరు? మరి వారిద్దరు ఒకేసారి టీ20లకు రిటైర్‌మెంట్ ప్రకటించడం అనేది టీమ్ ఇండియాకు పెద్దలోటు. కానీ ఈ వరల్డ్ కప్‌.. లెజెండ్స్‌కు పర్‌ఫెక్ట్‌ ఫెర్‌వెల్. ఈ లెజెండ్స్‌కు ఈ గెలుపు ఓ చిరస్మరణీయం. ఓ లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్.. ద్రవిడ్ హెడ్‌ కోచ్‌గా తన బాధ్యతల నుంచి చాలా హ్యాపీగా తప్పుకుంటున్నాడు. కోహ్లీ, రోహిత్‌ కూడా చాలా ఆనందంగా రిటైర్మెంట్ ఇచ్చేశారు.

Also Read: ఇంతకంటే గొప్ప ముగింపు లేదు: గౌతం గంభీర్

మరి నెక్ట్స్‌ టీ20 పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఆ కెప్టెన్సీ స్కిల్స్‌ ఉన్నవారు ప్రస్తుతం టీమ్‌లో ఎవరున్నారనే దానిపై ప్రస్తుతం బీసీసీఐ ఫోకస్ చేసింది. వీటన్నింటికంటే అసలు టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవికి ఎవరికి దక్కుతుందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ బాధ్యతలు చేపట్టేది గౌతమ్ గంభీరే అంటూ తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన బీసీసీఐ ఇంటర్వ్యూకు కూడా హాజరయ్యారు. అయితే ఐదు కండిషన్స్ పెట్టినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే బీసీసీఐ ప్రెసిడెంట్ జైషా మాత్రం ఇద్దరి పేర్లు షార్ట్‌ లిస్ట్‌ అయినట్టు తెలిపారు. కాబట్టి.. గంభీర్‌తో పాటు మరొకరు కాంపిటిషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మరి అతను ఎవరు? ఫైనల్‌గా పగ్గాలు పట్టుకోబోయేది ఎవరు? అనేది తేలాల్సి ఉంది.

చివర్లో మీకో గుడ్ న్యూస్ చెప్పాలి.. అదేంటంటే రోహిరాట్‌ కేవలం టీ20లకు మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ ఇకముందు జరిగే చాంపియన్స్ ట్రోఫి, వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్‌ ఫైనల్స్‌లో వారిద్దరు ఆడుతారని ఇప్పటికే జైషా హింట్ ఇచ్చేశారు. ఈ లెక్కన చూసుకుంటే ఇక ముందు జరిగే టెస్ట్, వన్డే సిరీస్‌లో వారిని కళ్లారా చూడవచ్చు. దీన్ని బట్టి చూస్తే వాళ్లు మొత్తం క్రికెట్‌కు గుడ్ బై చెప్పేందుకు మరో ఏడాది వరకు టైమ్ ఉంది. సో అప్పటి వరకు వారి ఆటను ఆస్వాదించవచ్చు.. ఇందులో ఎలాంటి డౌట్ లేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News