EPAPER

Who is Hero of IPL 2024: ఐపీఎల్ 2024 హీరో ఎవరు..? ఫైనల్ లో హైదరాబాద్ వర్సెస్ కోల్ కతా

Who is Hero of IPL 2024: ఐపీఎల్ 2024 హీరో ఎవరు..? ఫైనల్ లో హైదరాబాద్ వర్సెస్ కోల్ కతా

Who is Hero of IPL 2024..? IPL 2024 Final Match Hyderabad Vs Kolkata: ఐపీఎల్ 2024 సీజన్ చివరి అంకంలోకి వచ్చేసింది. ఒకే ఒక్క మ్యాచ్ దూరంలో నిలిచింది. ఈ రెండు జట్లలో ఏది విజయం సాధిస్తుంది? ఏది కప్ కొడుతుంది? అని ఎవరికివారు నెట్టింట విశ్లేషణలు బీభత్సంగా చేస్తున్నారు. ఎప్పటి ఎప్పటి రికార్డులో తీసి ఆధారాలు చూపిస్తున్నారు. అందుకోసమే తాము చెప్పిన జట్టే గెలుస్తుందని ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు.


లీగ్ వరకు చూస్తే కోల్ కతా 14 మ్యాచ్ లు ఆడి 9 మ్యాచ్ లు గెలిచింది. 3 మ్యాచ్ లు మాత్రమే ఓడింది. రెండు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దయ్యాయి. అలా 20 పాయింట్లతో టేబుల్ టాపర్ గా నిలిచింది. ప్లే ఆఫ్ లో హైదరాబాద్ తో ఆడి, వారిని ఓడించి నేరుగా ఫైనల్ కి అర్హత సాధించింది.

ఇక ఫైనల్ లో ఢీకొట్టబోయే మరో జట్టు హైదరాబాద్ విషయంలో చూస్తే లీగ్ లో 14 మ్యాచ్ లకు 8 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యి 17 పాయింట్లతో టేబుల్ లో సెకండ్ ప్లేస్ కి చేరుకుంది. ప్లే ఆఫ్ లో కోల్ కతా తో ఆడి పరాజయం పాలైంది. ఇప్పుడు మళ్లీ రాజస్థాన్ తో గెలిచి ఫైనల్ లో అడుగుపెట్టింది.


Also Read: టీ 20 అంటే ఫియర్ లెస్ క్రికెట్: గౌతం గంభీర్

ఇంతవరకు ఈ రెండు జట్ల మధ్య 27 మ్యాచ్ లు జరిగాయి. రికార్డ్ బ్రేక్ 18 విజయాలతో కోల్ కతా టాప్ రేంజ్ లో ఉంది. హైదరాబాద్ 9 మ్యాచ్ ల్లో మాత్రమే గెలుపొందింది. ఈ రకంగా చూస్తే హైదరాబాద్ కి ఫైనల్ మ్యాచ్ లో ఇక్కట్లు తప్పేలా లేవు. అది గెలవాలంటే వందకి రెండు వందల శాతం కష్టపడాల్సిందేనని నిపుణులు అంటున్నారు.

కోల్ కతా విషయానికి వస్తే సునీల్ నరైన్, గుర్బాజ్ ఉన్నారు. ఇక మిడిల్ ఆర్డర్ లో వెంకటేశ్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్, రింకూ సింగ్ , ఆండ్రి రసెల్ ఉన్నారు. ఇక బౌలింగులో మిచెల్ స్టార్క్, వైభవ్ ఆరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఇలా అందరూ మంచి ఫామ్ లో ఉన్నారు. అందుకే వరుసపెట్టి విజయాలు సాధిస్తూ వెళుతున్నారు.

Also Read: Dipa Karmakar Record : దీపా కర్మాకర్ రికార్డ్.. గోల్డ్ మెడల్ సాధించిన తొలి ఇండియన్ జిమ్నాస్ట్

హైదరాబాద్ విషయానికి వస్తే అంతా ఏసీడీసీ ఆటగాళ్లలా మారారు. అయితే కొట్టు, లేదా అవుటు అన్నట్టే ఆడుతున్నారు. అయితే ఆ పద్ధతితోనే వాళ్లు ఇంత దూరం వచ్చారు. ఏ మాత్రం కోల్ కతా ఉదాసీనత చూపిందంటే 20 ఓవర్ల మ్యాచ్ లో 300 కొడదామని వారు కాసుకుని కూర్చున్నారు. యువ కెరటం అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వదిలితే పులుల్లా రెచ్చిపోతున్నారు. ఇంక నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, రాహుల్ త్రిపాఠి అందరూ వరుసపెట్టి వాయ పెడుతున్నారు.

తాజాగా క్వాలిఫైయర్ 2 లో 175 పరుగుల టార్గెట్ ను కూడా హైదరాబాద్ బౌలర్లు కాపాడిన తీరుతో వారి బౌలింగు బలం కూడా పెరిగింది. అందువల్ల రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది. మరి ఎవరు గెలుస్తారో వేచి చూడాల్సిందే

Tags

Related News

Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ.. ఇండియా ‘ఏ’ టీం తొలి విజయం

Neeraj Chopra Diamond League: బ్రసెల్స్ డైమండ్ లీగ్ లో నీరజ్ చోప్రాకు రెండో స్థానం.. 2024లో ఏకంగా నాలుగుసార్లు టైటిల్ మిస్!

Matthew Short: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ఓపెనర్..13ఏళ్ల రికార్డు బ్రేక్

Virat Kohli: కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ షురూ..!

India vs Bangladesh 1st Test: ఒక్కటి గెలిస్తే చాలు.. 92 ఏళ్ల రికార్డు బ్రేక్

MS Dhoni: ధోనీ.. ఓసారి వాటర్ బాటిల్ తన్నేశాడు.. తెలుసా? : బద్రీనాథ్

Piyush Chawla: గంభీర్‌కి.. కొహ్లీ రికార్డులన్నీ తెలుసు: చావ్లా

Big Stories

×