EPAPER

Paris Olympics 2024: ఒలింపిక్స్ నుంచి ఈసారి మెడల్స్ తెచ్చేదెవరు.?

Paris Olympics 2024: ఒలింపిక్స్ నుంచి ఈసారి మెడల్స్ తెచ్చేదెవరు.?

Which Athletes Can Win Medals For India At The Paris Olympics 2024: విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్‌.. జులై 26 నుంచి అంటే నేటి నుంటే ఒలింపిక్స్‌ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. వందేళ్ల తర్వాత పారిస్ ఒలంపిక్స్ కు ప్రాధాన్యం ఇస్తోంది. అయితే ఈసారి ఒలంపిక్స్ బరిలో ఏకంగా 117 మంది భారతీయ అథ్లెట్‌లు పాల్గొంటున్నారు. ఈసారి ఒలింపిక్స్‌లో భారత్ సత్తా ఎలా ఉండబోతోంది..? భారత్‌కు మెడల్స్ తెచ్చేదెవరు..? ప్రఖ్యాత క్రీడా వేదికపై మువ్వన్నెల జెండాను నిలిపేదెవరు..?


ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రీడా ఈవెంట్.. సమ్మర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి లైట్ సిటీ పారిస్‌ సిద్ధమయ్యింది. ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత స్థాయి క్రీడాకారులు తలపడే పోటీ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రతి క్రీడాభిమానీ ఎదురుచూస్తున్నారు. జులై 26 నుండి ఆగస్ట్ 11 వరకూ జరిగే ఈ కార్యక్రమంలో మొత్తం 32 క్రీడా విభాగాల్లో 329 ఈవెంట్‌లు నిర్వహించబోతున్నారు. ఇందులో 206 జాతీయ ఒలింపిక్ కమిటీలకు చెందిన అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ క్రీడా మహోత్సవ 33 ఒలింపిక్స్‌ను ఫ్రాన్స్ దేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.

వందేళ తర్వాత మరోసారి ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తోంది ఫ్రాన్స్. ఒలింపిక్ క్రీడల పురాతన సంప్రదాయానికి ఆధునిక ట్విస్ట్ జోడిస్తూ… ఈసారి, 28 సాంప్రదాయ ఒలింపిక్ క్రీడలతో పాటు మరో నాలుగు కొత్త క్రీడలను కూడా క్రీడాభిమానుల్ని అలరించనున్నాయి. బ్రేకింగ్, స్కేట్‌బోర్డింగ్, సర్ఫింగ్, స్పోర్ట్స్ క్లైంబింగ్‌లు ఈ వేసవి ఒలింపిక్స్‌లో తొలి ప్రదర్శన ఇవ్వనున్నాయి. దాదాపు 10 వేల 500 మంది క్రీడాకారులు పారిస్‌లోని ఒలింపిక్ గేమ్స్‌లో పోటీ పడేందుకు ఉర్రూతలూగుతున్నారు. అయితే, ఇందులో 117 అథ్లెట్లతో కూడిన భారత క్రీడా బృందం కూడా తమ ముద్రను వేయడానికి సన్నద్ధం అయ్యింది.


భారతదేశం నుండి ఈ ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనడానికి ఒక్క అథ్లెటిక్స్ నుండే అధికంగా 29 మంది బరిలో ఉన్నారు. ఇక 21 మంది షూటింగ్‌లో, హాకీలో 19 మంది పోటీ పడనున్నారు. తర్వాతి స్థానాల్లో ఎనిమిది మందితో టేబుల్‌ టెన్నిస్‌, ఏడుగురు బ్యాడ్మింటన్‌, ఆరుగురు రెజ్లింగ్‌ క్రీడాకారులు, ఆరుగురు ఆర్చరీ, ఆరుగురు బాక్సింగ్‌, నలుగురు గోల్ఫ్‌, ముగ్గురు టెన్నిస్‌, ఇద్దరు స్విమ్మింగ్‌, ఇద్దరు సెయిలింగ్‌ క్రీడలకు ప్రాతినిధ్యం దక్కింది. ఇక, జూడో, రోయింగ్, వెయిట్‌లిఫ్టింగ్, ఈక్వెస్ట్రియన్‌ నుంచి ఒక్కొక్కరు బరిలో ఉన్నారు. భారత్ నుండి ఒలింపిక్స్‌కు ఎంపికైన వారిలో పురుష అథ్లెట్లు 70 మంది కాగా.. మహిళా క్రీడాకారులు 47 మంది ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024 జులై 26న సీన్ నదిపై జార్డిన్స్ డు ట్రోకాడెరోలో ప్రారంభం కానుంది.

సాధారణంగా ప్రారంభ వేడుక స్టేడియం కాకుండా మరో చోట నిర్వహించడం ఒలింపిక్స్‌ చరిత్రలో ఇదే తొలిసారి. పారిస్ ఒలింపిక్స్ 2024 సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. దీని కోసం ఒలింపిక్స్‌కు ఎంపికైన భారత క్రీడాకారులంతా అహర్నిశలూ కష్టపడ్డారు. గత ఒలింపిక్స్‌లో భారత్ నుండి 123 మంది పాల్గొంటే.. ఈసారి ఐదుగురు తగ్గి, 117 మంది భారత్ తరఫున ఒలింపిక్స్‌లో తమ సత్తా చాటనున్నారు. ఇక, టేబుల్ టెన్నిస్ దిగ్గజం ఆచంట శరత్ కమల్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఈ పారిస్ ఒలింపిక్స్‌లో భారత జట్టుకు ఫ్లాగ్ బేరర్లుగా వ్యవహరించనున్నారు. భారత అథ్లెట్ల అందరూ ఇప్పటికే యూరప్‌లో శిక్షణను పూర్తి చేసుకోగా… భారత్‌కు చెందిన ఏకైక బంగారు పతక విజేత నీరజ్ చోప్రా తన టైటిల్‌ను కాపాడుకోవడం కోసం భారీ అంచనాలతో బరిలో దిగుతున్నారు.

Also Read: ఆరోజు షమీ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు: ఫ్రెండ్ చెప్పిన మాట

నిజానికి, ప్రపంచంలోనే అత్యధిక జనాభా, ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం.. ఒలింపిక్స్‌ పతకాలు సాధించడంలో మాత్రం వెనుకబడుతూనే ఉందన్నది వాస్తవం. ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ పేరిట ఇప్పటి వరకు మొత్తం 35 పతకాలే ఉన్నాయి. అందులో టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన 7 పతకాలే ఇప్పటి వరకూ భారత్ సాధించిన అత్యధిక పతకాలు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఒక స్వర్ణం, రెండు రజత పతకాలు, 4 కాంస్య పతకాలతో మొత్తం 7 మెడల్స్ సాధించి విజయవంతంగా నిలిచింది. అప్పుడు, పతకాల పట్టికలో 48వ స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్‌ చరిత్రలోనే భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన కూడా. అయితే, గత ఒలింపిక్స్‌‌లో టాప్‌-50లో ఉన్న భారత్‌ ఈసారి టాప్‌-30 లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, మొత్తం పతకాలు రెండంకెలు దాటాలనే లక్ష్యంతో బరిలో దిగుతుంది. అందుకే, భారత అభిమానులు ఈసారి మన క్రీడాకారుల నుండి మరిన్ని పతకాలు ఆశిస్తున్నారు.

ఈసారి భారత్ స్పోర్ట్స్ అథారిటీ కూడా పతకాల వేట కోసం భారీగానే ఖర్చు చేసింది. విశ్వక్రీడల్లో భారత్‌ ఎన్నడు లేని విధంగా ఒలింపిక్స్ లో మన క్రీడాకారులు ఎన్నో పథకాలు తేవాలని సుమారు రూ.470 కోట్లు ఖర్చు చేశారు. ఇక, భారత్‌కు స్వర్ణ పతకం సాధిస్తారనే అంచనాలున్న వారిపై అధికంగా వెచ్చించారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే వారిలో భారతదేశానికి చెందిన అథ్లెట్లు బలంగా ఉన్నారు. నీరజ్ చోప్రా, మీరాబాయి చాను, పివి సింధులు ఇప్పటికే గత ఒలింపిక్స్‌లో పతకాలను సొంతం చేసుకున్నారు. ఇక, నిఖత్ జరీన్, ఆంటిమ్ పంఘల్, సిఫ్ట్ కౌర్ సమ్రా వంటి వారు తమ తొలి ఒలింపిక్ పోటీలో పోడియంను అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ పోడియంలో గెలిచే మార్గం అనుకున్నంత సులభం కూడా కాదు.

ఇందులో అథ్లెట్ నీరజ్ చోప్రా పేరు అగ్రస్థానంలో ఉంది. ఇక, ఈ ఒలింపిక్స్‌లో ఉన్న 32 క్రీడల్లో భారతదేశం 16 క్రీడల్లో పాల్గొంటుంది. ఈ ఒలింపిక్స్ వీక్షించడానికి భారతదేశంలో స్పోర్ట్స్ 18, స్పోర్ట్స్ 18+ ఛానెళ్లలో ప్రత్యక్షంగా ప్రసారం చేస్తుండగా.. దీంతోపాటు, జియో సినిమా యాప్‌లో కూడా ఒలింపిక్స్‌ను వీక్షించే అవకాశం ఉంది. అయితే, భారత క్రీడాభిమానుల కోసం జియో సినిమా యాప్ పారిస్ ఒలింపిక్స్‌ను ఉచితంగా ప్రసారం చేస్తుంది. విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్‌.. జులై 26 నుంచి అంటే నేటి నుంటే ఒలింపిక్స్‌ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. వందేళ్ల తర్వాత పారిస్ ఒలంపిక్స్ కు ప్రాధాన్యం ఇస్తోంది. అయితే ఈసారి ఒలంపిక్స్ బరిలో ఏకంగా 117 మంది భారతీయ అథ్లెట్‌లు పాల్గొంటున్నారు. ఈసారి ఒలింపిక్స్‌లో భారత్ సత్తా ఎలా ఉండబోతోంది..? భారత్‌కు మెడల్స్ తెచ్చేదెవరు..? ప్రఖ్యాత క్రీడా వేదికపై మువ్వన్నెల జెండాను నిలిపేదెవరు..?

Related News

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Yashasvi Jaiswal: యశస్వి జైశ్వాల్ ముంగిట.. అద్భుత రికార్డ్

IND vs PAK: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ లో భారీ మార్పులు.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

Big Stories

×