EPAPER

Cricket League Match: అసలు లీగ్ మ్యాచ్ లు ప్రారంభం ఎక్కడ?

Cricket League Match: అసలు లీగ్ మ్యాచ్ లు ప్రారంభం ఎక్కడ?
ipl (
 

Where Do the League Matches Start: క్రికెట్ లీగ్ మ్యాచ్ లు మొదట్లో ఇంగ్లాండ్ లోనే ఉండేవి. కౌంటీ ఛాంపియన్ పేరుతో క్లబ్ మ్యాచ్ లు అప్పట్లో ఆడేవారు. యార్క్ షైర్, హ్యాంప్ షైర్, కౌంటీ క్లబ్, హెంబల్డన్ క్లబ్ ఇలా ఉండేవి. వీటి మధ్య క్రికెట్ మ్యాచ్ లు జరిగేవి. నిజానికి చెప్పాలంటే క్రికెట్ ఆటకి రూపకల్పన, రూల్స్, ఆది, మూలం అంతా ఇంగ్లాండ్ లోనే జరిగింది.


బ్రిటీష్ వాళ్లు మన ఇండియాని సుమారు 200 సంవత్సరాలు పరిపాలించారు. ఇండియా వచ్చిన ఆంగ్లేయులు ఖాళీ సమయాల్లో క్రికెట్ ఆడేవారు. అలా అలా మన భారతీయులకి అంటుకుపోయింది. కాదు కాదు అంటించి వెళ్లారని క్రికెట్ ఇష్టపడిన కొందరంటూ ఉంటారు.

అప్పట్లో ఆంగ్లేయులు ఆడేటప్పుడు బాల్స్ అందించడానికి, ఫీల్డింగ్ చేయడానికి, తర్వాతర్వాత ప్లేయర్లు తగ్గినా మనవాళ్లని తీసుకుని ఆడించేవారు. 1947 తర్వాత వాళ్లు వెళ్లిపోయారు. కానీ క్రికెట్ మాత్రం మన దగ్గరే ఉండిపోయింది. కట్ చేస్తే ఇప్పుడు 140 కోట్ల మంది భారతీయులకి అదొక మతంలా మారిపోయింది. క్రికెట్ అనేసరికి అందరూ కలిసిపోతారు. ఇది ఆటలో ఉన్న గొప్పతనం. మొత్తానికి అండర్ కరెంట్ లా పాకిపోయింది. ఇప్పుడెవరిని క్రికెట్ పేరుతో టచ్ చేసినా ఒక్క షాక్ కొడుతుంది.


Also Read: ఓడిపోయిన ఆటగాళ్లపై.. అభిమానుల దాడి టర్కీలో ఫుట్ బాల్ మ్యాచ్ లో గొడవ

ఒకసారి చరిత్రలోకి చూస్తే 1894లో కౌంటీ ఛాంపియన్ షిప్ ఇంగ్లాండ్ లో ప్రారంభమైంది. మొదట్లో ఓవర్ కి 4 బాల్స్ ఉండేవి. 1889లో ఓవర్ కి 5 బాల్స్ చేశారు. అలా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ప్రారంభమైంది. తర్వాత 1900కి వచ్చేసరికి ఓవర్ కి ఆరు బాల్స్ అయ్యాయి. తర్వాత ఆస్ట్రేలియాలో 8 బాల్స్ కూడా వేశారు కానీ, ఆరు దగ్గరే మళ్లీ ఆగిపోయారు.

1877 సమయంలో రెండు దేశాల మధ్య కూడా మ్యాచ్ లు జరిగేవి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, నార్త్ అమెరికా, కెనడా ఇవన్నీ ఆడేవి. సెంట్ జార్జ్ క్రికెట్ క్లబ్ అని న్యూయార్క్ లో ఉండేది. అప్పట్లో అమెరికాలో క్రికెట్ ఒక పాపులర్ గేమ్ గా ఉండేది. కాకపోతే ఐదేసి రోజులు జరుగుతుండటం, ఇదొక టైమ్ వేస్ట్ గేమ్ అని భావించిన ప్రజలు క్రమంగా క్రికెట్ ని వదిలి ఫుట్ బాల్ పై పడ్డారు.

అయితే ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ మ్యాచ్ లు అప్పుడే ప్రారంభమయ్యాయి. తర్వాత సౌతాఫ్రికా కలిసింది. ప్రపంచ క్రికెట్ కి ఇక్కడే  నాంది పలికింది. 1926లో న్యూజిలాండ్, ఇండియా ఒకేసారి వచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1952లో పాకిస్తాన్ చేరింది. అప్పుడే ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ ( ఐసీసీ) రూపకల్పన జరిగింది.

1965 నుంచి ఒకొక్క దేశం వచ్చాయి.1970లో శ్రీలంక వచ్చింది. అలా క్రికెట్ ఆడే దేశాలతో వన్డే ప్రపంచకప్ 1975లో మొదలైంది. 1983లో ఇండియా ప్రపంచకప్ గెలిచింది. క్రికెట్ ఫీవర్ అప్పుడు స్టార్టయ్యింది.

చాలాకాలం మన క్రికెటర్లు ఫామ్ లో లేకపోతే ఇంగ్లాండ్ వెళ్లి క్లబ్ మ్యాచ్ లు ఆడేవారు. అక్కడికి ప్రపంచంలో క్రికెట్ ఆడే మేటి క్రికెటర్లందరూ వచ్చేవారు. వారు వేసే వైవిధ్యమైన బౌలింగ్ ని ఎదుర్కొని కెరీర్ ను ముందుకు నడిపించేవారు. అక్కడ ఆడటం ఒక గౌరవంగా భావించేవారు. గొప్పగా ఫీలయ్యేవారు.

కానీ ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేరుతో మన ఇండియాలోనే మొదలైపోయాయి. ఇప్పుడెవరూ ఎక్కడికి వెళ్లక్కర్లేదు. ఇతరదేశాల ఆటగాళ్లే మన ఇండియా వచ్చి ఆడుతున్నారు. అదీ మన ఇండియాలో క్రికెట్ గొప్పతనం. అయితే ఎక్కడో మొదలైన క్రికెట్ ను, ఇప్పుడు శాసించే స్థితికి భారత్ చేరుకోవడం ఒక గర్వకారణమని చెప్పాలి.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×