EPAPER

West Indies vs South Africa: రెండో టెస్టులో విండీస్ చిత్తు..సౌతాఫ్రికాదే సిరీస్

West Indies vs South Africa: రెండో టెస్టులో విండీస్ చిత్తు..సౌతాఫ్రికాదే సిరీస్

SouthAfrica test series win in Guyana: వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తేడాతో సౌతాఫ్రికా కైవసం చేసుకుంది. అంతకుముందు తొలి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగియగా.. గయానా వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 40 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా టీం మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 160 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఇందులో డేన్ పీడ్ట్(38), బెడింగ్‌హామ్(28), ట్రిస్టన్ స్టబ్స్(26) పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో షమీర్ జోషఫ్ 5 వికెట్లు తీయగా..సీల్స్ మూడు వికెట్లు, హోల్డర్, మోటీ తలో వికెట్ పడగొట్టారు.


అనంతరం బ్యాటింగ్ చేపట్టిన వెస్టిండీస్.. తొలి ఇన్నింగ్స్‌లో 144 పరుగులకే పరిమితమైంది. హోల్డర్(54), కీసీ కార్తీ(26), షమర్ జోసెఫ్(25) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో వియాన్ ముల్డర్ నాలుగు వికెట్లు, నాంద్రే బర్గర్ మూడు వికెట్లు, మహరాజ్ రెండు వికెట్లు, రబడ ఒక వికెట్ పడగొట్టాడు. అయితే సౌతాఫ్రికాకు 16 పరుగుల ఆధిక్యం లభించింది.

రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 246 పరుగులు చేసింది. వెర్రెయిన్నే(59), మార్‌క్రమ్(51), టోనీ డి జోర్జి(39), వియాన్ ముల్డర్(34), ట్రిస్టన్ స్టబ్స్(24) పరుగులతో రాణించారు. విండిస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ 6 వికెట్లు పడగొట్టగా, మోతీ, వారికన్ చెరో రెండు వికెట్లు తీశారు. దీంతో వెస్టిండీస్‌కు సౌతాఫ్రికా 263 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.


Also Read: ధోనీకి ఐపీఎల్ లో చోటు ఉందా? లేదా?

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ బోల్తాపడింది. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి 222 పరుగులకే ఆలౌటైంది. గుడకేశ్ మోతీ(45) పరుగులతో రాణించాడు. అలాగే కావెం హాడ్జ్(29), జాషువా డా సిల్వా(27), జోమెల్ వారికన్(25), క్రైగ్ బ్రాత్‌వైట్(25) పర్వాలేదనిపించినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. సౌాతాఫ్రికా బౌలర్లలో రబడ మూడు వికెట్లు, కేశవ మహరాజ్ మూడు వికెట్లు పడగొట్టారు. వియాన్ ముల్డర్, డేన్ చెరో రెండు వికెట్లు తీశారు. దీంతో 40 పరుగుల తేడాతో సౌతాఫ్రికా రెండో టెస్ట్ విజయం సాధించింది. తొలి టెస్ట్ డ్రా కావడంతో సౌతాఫ్రికా 1-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. కాగా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వియాన్ ముల్డర్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కేశ్ మహరాజ్ సొంతం చేసుకున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×