EPAPER

Shamar Joseph : ఓ గయానా బౌలర్ కథ..! జామకాయలు, నిమ్మకాయలతో బౌలింగ్ ప్రాక్టీస్..

Shamar Joseph : ఓ గయానా బౌలర్ కథ..! జామకాయలు, నిమ్మకాయలతో బౌలింగ్ ప్రాక్టీస్..

Shamar Joseph : అవి కరేబియన్ దీవులు, అక్కడ గయానాలోని బరకర అనే మారుమూల గ్రామం. చుట్టూ నీళ్లు, అడవి, కనీస సౌకర్యాలు మచ్చుకైనా కనిపించవు. ఆ దీవి నుంచి బయటపడాలంటే, కంజీ నదిలో రెండురోజులు బోటుపై ప్రయాణించాలి. అప్పుడు సమీప పట్టణానికి చేరుకుంటాం. అలాంటి మారుమూల గ్రామంలో క్రికెట్ ఆడాలని ఒక కుర్రాడు నిర్ణయించుకున్నాడు.
అతని పేరు షమర్ జోసెఫ్.


కట్ చేస్తే..

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో షమర్ ఆరంగ్రేటం చేశాడు. తను వేసిన తొలిబంతికే స్టీవ్ స్మిత్ వికెట్ తీసి, ప్రపంచానికి తన రాకను ఘనంగా చాటాడు. అంతేకాదు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ (283 ఆలౌట్) ముగిసే సమయానికి షమర్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు.


అంతేకాదు ఆడిన తొలి టెస్టులోనే ఐదు వికెట్ల హాల్ సాధించాడు. ఈ ఘనత సాధించిన పదో కరేబియన్ బౌలర్‌గా రికార్డ్ సృష్టించాడు. ఇంకా తొలి ఇన్నింగ్స్ లో 36 పరుగులు చేశాడు. ఇది కూడా రికార్డే. ఈ ఘనత సాధించిన తొలి వెస్టిండీస్ అరంగ్రేటం ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

ఆస్ట్రేలియా గడ్డపై రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ జట్టు  వచ్చింది. ఆడిలైడ్ ఒవల్ లో తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ముగ్గురు ఆరంగ్రేటం ఆటగాళ్లతో వచ్చిన వెస్టిండీస్ జట్టులో ప్రపంచం దృష్టిని  షమర్ జోసెఫ్ ఆకర్షించాడు. అంతేకాదు అతని వెనుక దాగిన ఒక కన్నీటి కథ, అనితరసాధ్యమైన అతని కఠోర సాధన చూసి ప్రపంచం నివ్వరబోతోంది.
మనిషి అనుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని మరోసారి రుజువైందని నెట్టింట షమర్ జోసెఫ్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

ఈ టెస్టులో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 188 పరుగులకు ఆలౌటయ్యింది. క్రికె మెకంజీ (50) హాఫ్ సెంచరీ చేయగా.. 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన షమర్ జోసఫ్.. 36 పరుగులతో సెకండ్ హయ్యెస్ట్ స్కోరర్‌గా నిలిచాడు.

ఇక షమర్ జోసెఫ్ కథలోకి వస్తే…

సెక్యూరిటీ గార్డ్ గా ఉద్యోగం చేస్తున్న షమర్.. ఒకరోజు క్రికెట్ ఆడాలని బలంగా నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే చేస్తున్న ఉద్యోగం మానేశాడు. ప్రాక్టీస్ చేద్దామంటే చేతిలో నయాపైసా లేదు. ఇంట్లో బ్లాక్ అండ్ వైట్ టీవీ తప్ప మరొకటి లేని కడు పేదరికం. ఇంటర్నెట్ సౌకర్యం కూడా లేదు.

తను చిన్నతనంలో టేప్ బాల్ తోనే క్రికెట్ ఆడాడు. అది లేనప్పుడు నిమ్మకాయలు, జామకాయలతో ఆడేవాడు. ఆ అనుభవం మాత్రమే ఉంది. నిర్ణయమైతే తీసుకుని కంజీ నదిపై రెండు రోజులు ప్రయాణం చేసి సమీప పట్టణానికి చేరుకున్నాడు. అక్కడ బతకడానికి ఏదొక పని చేయడం, గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేయడం అదే పనిగా స్థానిక మ్యాచ్ ల్లో ఆడేవాడు. వికెట్లు తీస్తుండటంతో అందరూ అవకాశాలు ఇచ్చేవారు.  అలా ప్రయాణం సాగుతున్న సమయంలో ఒక అవకాశం వచ్చింది.

2023 ఫిబ్రవరిలో వెస్టిండీస్ ఛాంపియన్‌షిప్‌ టోర్నమెంట్ జరిగింది. ఇక్కడ గయనా తరఫున షమర్ బరిలోకి దిగాడు.  అలా తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. అలా అందరికీ పరిచయం అయ్యాడు. తర్వాత కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో గయానా జట్టుకు నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు. అనుకోకుండా కీమో పావెల్ గాయపడటంతో షమర్‌కు అవకాశం దక్కింది.

2023 నవంబర్ లో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన వెస్టిండీస్-ఏ జట్టులో షమర్ చోటు దక్కించుకున్నాడు. ఆ టూర్‌లో వెస్టిండీస్-ఏ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. దీంతో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఇప్పుడు తను వేసిన తొలిబంతికే స్మిత్ ను అవుట్ చేసి ప్రపంచం దృష్టిలో పడ్డాడు. హీరో అయ్యాడు.

Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×