EPAPER

West Indies : విండీస్ పతనం.. ఆ మ్యాచ్ తోనే ప్రారంభమైందా..?

West Indies : విండీస్ పతనం.. ఆ మ్యాచ్ తోనే ప్రారంభమైందా..?

West Indies : వెస్టిండీస్ ఒకప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ జట్టు. క్లైవ్ లాయిడ్, వివియన్ రిచర్డ్స్, గార్డన్ గ్రీనిడ్జ్, డెస్మండ్ హేన్స్ లాంటి విధ్వంసకర బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోసేవారు. జోయెల్ గార్నర్, మైఖెల్ హోల్డింగ్, ఆండీ రాబర్ట్స్ లాంటి బీకర పేసర్లు ధాటికి ఇతర జట్ల బ్యాటర్లు వణికిపోయేవారు. వారి బౌన్సర్లను ఎదుర్కోవడం బ్యాటర్లకు సవాల్ గా ఉండేది. పరుగులు సాధించడం అటు ఉంచితే సేఫ్ గా పెవిలియన్ కు తిరిగివస్తే చాలు అని అప్పట్లో ఇతర జట్ల బ్యాటర్లు భావించేవారు. ఇలా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఎంతో పటిష్టంగా ఉండేది విండీస్ జట్టు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లాంటి మేటి జట్లే విండీస్ దాటికి విలవిల లాడేవి. ఇదంతా విండీస్ జట్టు ఘన చరిత్ర.


వన్డే క్రికెట్ లోనూ ఆరంభంలో విండీస్ దే ఆధిపత్యం. 1975 తొలి ప్రపంచ కప్ ను సునాయాసంగా ఆ జట్టు కైవసం చేసుకుంది. 1979 వరల్డ్ కప్ లోనూ అదే జోరు కొనసాగించింది. 1983లో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అందరూ భావించారు. కానీ అద్భుతం జరిగింది. అనూహ్యంగా ఫైనల్ కు చేరిన భారత్.. విండీస్ జైత్రయాత్రకు బ్రేక్ వేసింది. తుది సమరంలో ఆ జట్టును ఓడించి కపిల్ డెవిల్స్ విశ్వవిజేతగా నిలిచింది.

1983లో వరల్డ్ ఫైనల్ ఓడిన తర్వాత విండీస్ పతనం క్రమకమంగా మొదలైంది. ఆ తర్వాత జరిగిన 9 ప్రపంచ కప్ టోర్నిల్లో ఒక్కసారి కూడా వెస్టిండీస్ ఫైనల్ కు చేరలేదు. 1990 తర్వాత విండీస్ బ్యాటింగ్ విభాగం బలహీన పడింది. బ్రియాన్ లారా , క్రిస్ గేల్ లాంటి స్టార్ బ్యాటర్లు అద్భుతంగా ఆడినా మిగిలిన జట్టు బలహీనంగా ఉండటంతో విండీస్ జట్టు నిలకడ ప్రదర్శన చేయలేకపోయింది. కోట్నీ వాల్ష్, కర్టలీ ఆంబ్రోస్ రిటైర్మ మెంట్ తర్వాత విండీస్ పేస్ అటాక్ పూర్తిగా బలహీనపడిపోయింది. అందుకే ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నిలో విండీస్ మెరుపులు కనిపించలేదు.


1996 వరల్డ్ కప్ లో కెన్యా లాంటి పసికూనల చేతిలోనూ వెస్టిండీస్ జట్టు ఓడింది. 2007లో సొంతగడ్డపై జరిగిన వరల్డ్ కప్ లో కనీసం సెమీస్ కు చేరలేదు. ఆ జట్టు చివరిసారిగా 1996 వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరుకుంది. ఆ తర్వాత 6 మెగా టోర్నిల్లో క్వార్టర్ ఫైనల్ దాటలేదు. ఇలా పతనమైన విండీస్ 13వ ప్రపంచ కప్ టోర్నిలో పాల్గొనే అర్హతే సాధించలేకపోయింది. ఆ జట్టు లేకుండా జరగబోతున్న తొలి ప్రపంచ కప్ ఇదే.

Related News

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Big Stories

×