EPAPER

Washington Sundar| రవీంద్ర జడేజా స్థానంపై వాషింగ్ టన్ సుందర్ కన్ను.. జింబాబ్వే సిరీస్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శన!

టీమిండియా స్పిన్ బౌలర్, ఆల్ రౌండర్ అయిన వాషింగ్ టన్ సుందర్ జట్టు కోసం తన వంద శాతం నైపుణ్యం కనబర్చేందుకు దృష్టిపెడుతున్నానని చెప్పాడు. రవీంద్ర జడేజా లాంటి టాలెంట్ మరెవరికీ లేదని అన్నాడు. ఇటీవలే భారత క్రికెట్ జట్టు అంతర్జాతీయ టి20 వరల్డ్ కప్ గెలుచుకున్న తరువాత జడేజా టి20 క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. టీమిండియాలో ప్రధాన ఆల్ రౌండర్ గా ఎదిగేందుకు తాను వంద శాతం కష్టపడతానని సుందర్ వ్యాఖ్యానించాడు.

Washington Sundar| రవీంద్ర జడేజా స్థానంపై వాషింగ్ టన్ సుందర్ కన్ను.. జింబాబ్వే  సిరీస్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శన!

Washington Sundar| టీమిండియా స్పిన్ బౌలర్, ఆల్ రౌండర్ అయిన వాషింగ్ టన్ సుందర్ జట్టు కోసం తన వంద శాతం నైపుణ్యం కనబర్చేందుకు దృష్టిపెడుతున్నానని చెప్పాడు. జట్టులో రవీంద్ర జడేజా లేని లోటు భర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపాడు. కానీ రవీంద్ర జడేజా లాంటి టాలెంట్ మరెవరికీ లేదని అన్నాడు. ఇటీవలే భారత క్రికెట్ జట్టు అంతర్జాతీయ టి20 వరల్డ్ కప్ గెలుచుకున్న తరువాత జడేజా టి20 క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. టీమిండియాలో ప్రధాన ఆల్ రౌండర్ గా ఎదిగేందుకు తాను వంద శాతం కష్టపడతానని సుందర్ వ్యాఖ్యానించాడు.


Also Read: టీమిండియా హెడ్ కోచ్ సాలరీ ఎంతో తెలుసా?.. రాహుల్ ద్రవిడ్, రవిశాస్త్రితో సమానంగా గౌతమ్ గంభీర్

జింబాబ్వేతో మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ అద్భుత ప్రదర్శన
ఇండియా-జింబాబ్వే మధ్య జరిగిన మూడో టి20 మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ తన అద్భుత ఆటతీరుని అందరినీ ఆకట్టుకున్నాడు. ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించినందుకు ఆయనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. మ్యాచ్ లో సుందర్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 15 రన్లకు మూడు వికెట్లు సాధించాడు. జింబాబ్వేతో జరిగే అయిదు మ్యాచ్ ల సిరీస్ లో ఇప్పటివరకు సుందర్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో రవీంద్ర జడేజా తరువాత ప్రధాన ఆల్ రౌండర్ స్థానానికి అర్హత సాధించాడు. ఈ సంవత్సరం జరిగిన ఐపిఎల్ సిరీస్ లో హైదరాబాద్ తరపున వాషింగ్టన్ సుందర్ కు అవకాశం లభించలేదు. ఆయన స్థానంలో నితీశ్ రెడ్డి బౌలింగ్ చేశాడు. కానీ జింబాబ్వే తో తలపడే టీమిండియాలో ఆడే అవకాశం సుందర్ నే వరించింది.


Also Read: Hardik Pandya | లోకం అంతా ఒకవైపు.. పాండ్యా ఒక్కడూ ఒకవైపు

జింబాబ్వే సిరీస్ లో ఇండియా ముందంజ
శుభ్ మన్ గిల్ కెప్టెన్ గా టీమిండియా.. జింబాబ్వే సిరీస్ లో 2-1తో ముందంజలో ఉంది. తొలిమ్యాచ్ లో జింబాబ్వే విజయం సాధించినప్పటికీ.. భారత జట్టు ఆ తరువాత పుంజుకుంది. తరువాత జరిగిన రెండు మ్యాచ్ లలో ఇండియా.. జింబాబ్వేని ఓడించింది. రెండు జట్ల మధ్య చివరి రెండు మ్యాచ్ లు శనివారం, ఆదివారం జరుగనున్నాయి.

Washington Sundar, Allrounder, Ravindra Jadeja, Zimbabwe,

Related News

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Big Stories

×