EPAPER

Washington Sundar Record: వాషింగ్టన్ సుందర్.. అరుదైన రికార్డ్

Washington Sundar Record: వాషింగ్టన్ సుందర్.. అరుదైన రికార్డ్

IND vs ZIM Washington Sundar wins player of the series award: తాజాగా జరిగిన జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా యువజట్టులో మెరిసిన ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. అయితే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికైన సుందర్, గతంలో కూడా ఒక సిరీస్ లో ఎంపికయ్యాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే కెరీర్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులకంటే, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు ఎక్కువ గెలుచుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డ్ సాధించాడు.


ఇక జింబాబ్వే సిరీస్ లో 5 మ్యాచ్ లు ఆడి 8 వికెట్లు తీశాడు. అంతేకాదు రెండుసార్లు బ్యాటింగ్ కి దిగి, జట్టు క్లిష్టమైన పరిస్థితుల్లో 28 పరుగులు చేశాడు. అంతేకాదు మూడో టీ 20లో పొదుపుగా బౌలింగు చేసి 3 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అలా ఒకటి ఈ అవార్డు, రెండు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు.

ఇలాంటి డిఫరెంటు అవార్డులు అందుకున్న ఆటగాళ్లలో నాలుగో వాడిగా వాషింగ్టన్ సుందర్ నిలిచాడు. తనకన్నా ముందు వరుసలో రిజా హేండ్రిక్స్ (సౌతాఫ్రికా), టిమ్ సీఫర్ట్ (కివీస్), అలెక్స్ కుసక్ (ఐర్లాండ్) ఉన్నారు.


ఇంతకీ వాషింగ్టన్ సుందర్ ఎవరంటే తమిళనాడు వాసి. చెన్నై నివాసి అని చెప్పాలి. ఆల్ రౌండర్ గా పేరుతెచ్చుకున్న తను తమిళనాడు టీమ్ కి ఆడుతుంటాడు. 2017లో జాతీయ జట్టుకి ఎంపికైన వాషింగ్టన్ సుందర్ ఇప్పటివరకు 4 టెస్ట్ మ్యాచ్ లు ఆడాడు. 526 పరుగులు చేశాడు. 96 అత్యధిక స్కోరుగా ఉంది. ఇక 6 వికెట్లు తీశాడు. 19 వన్డేలు ఆడి 265 పరుగులు చేశాడు. 18 వికెట్లు తీశాడు. చివరిగా 48 టీ 20లు ఆడి 135 పరుగులు చేశాడు. అన్నింటికి మించి 42 వికెట్లు తీశాడు. ఈ రికార్డులే తనకి జాతీయ జట్టులోకి ఎంట్రీ పాస్ గా ఉపయోగపడుతున్నాయి.

Also Read: బెస్ట్ ఫీల్డర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. కెరీర్ ముగిసినట్టేనా?

చాలామంది అనేదేమిటంటే, అవకాశాలు వచ్చినప్పుడే, గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాలని అంటున్నారు. ఉదాహరణ చెప్పాలంటే తాజాగా రింకూసింగ్, శివమ్ దూబె వీళ్లకిలాగే పేరొచ్చింది. ఏదొక మ్యాచ్ లో మ్యాచ్ విన్నర్ అయితే, కొంతవరకు వెనుతిరిగి చూసుకునే అవకాశం ఉండదు. అప్పుడు మనసత్తా ఏమిటో, జాతీయ జట్టులో ఉండాలా? వద్దా? అనే మీమాంశ ఉండదు, తాడోపేడో తేలిపోతుందని అంటున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×