EPAPER

Virender Sehwag : బైబై .. హ్యాపీగా బిర్యానీ తిని ఇంటికెళ్లండి.. పాకిస్తాన్ పై సెహ్వాగ్ ట్వీట్..

Virender Sehwag : బైబై .. హ్యాపీగా బిర్యానీ తిని ఇంటికెళ్లండి..  పాకిస్తాన్ పై సెహ్వాగ్ ట్వీట్..

Virender Sehwag : ఎప్పుడూ లేనిది డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వివాదాస్పద ట్వీట్ చేశాడు. ఇప్పుడది నెట్టింట పెద్ద డిబేట్ గా మారింది. ఇంతకీ ఏమన్నాడంటే పాకిస్తాన్ కి బైబై చెప్పేశాడు. చక్కగా విమానమెక్కి ఇంటికెళ్లండి. బిర్యానీ, భారతీయుల ఆతిథ్యం బాగుంది కదా… అన్నాడు. అదే ఇప్పుడు సెహ్వాగ్ కొంప మీదకి వచ్చింది.


ఇన్నాళ్లూ కుదురుగా ఉన్నావు కదా.. ఇప్పుడెందుకు లేని తలనొప్పిని తెచ్చి పెట్టుకున్నావని కొందరంటున్నారు. కొందరేమో అందులో తప్పేం ఉందని సెహ్వాగ్ ని సమర్థిస్తున్నారు. మరికొందరు ఇలా మాట్లాడటం సెహ్వాగ్ స్థాయి కాదని అంటున్నారు. ఇవన్నీ చిల్లర మాటలు, తను అనకుండా ఉండాల్సిందని అంటున్నారు.

కరెక్టుగా సెహ్వాగ్ ఏం చెప్పాడంటే.. “పాకిస్థాన్ ఇక ఇంటికి పరిగెత్తడమే. ఇక్కడి బిర్యానీ, భారతీయుల ఆతిథ్యాన్ని బాగా ఆస్వాదించారు కదా..   విమానంలో సురక్షితంగా ఇళ్లకు వెళ్లండి. బైబై పాకిస్థాన్‌ అంటూ” ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. అంటే ఇంక ఆడింది చాలు బయలుదేరండి అనే సెన్స్ వచ్చేలా ఉందని కొందరంటున్నారు.


పాకిస్థాన్ జట్టును ఉద్దశిస్తూ వీరూ పెట్టిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఎప్పుడైనా ఎవరినైనా విమర్శించేటప్పుడు రెండు విషయాలు ప్రస్తావించకూడదు. ఒకటి తిండి, రెండు డబ్బులు…వీటని ఉపయోగిస్తే తప్పకుండా అవతలి వాళ్ల మనోభావాలు దెబ్బతింటాయని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు.

ఇంట్లోని సొంత కుటుంబ సభ్యులతో కూడా ఈ మాటలు అనకూడదని అంటున్నారు. అంతెందుకు పిల్లల్ని అస్సలు అనకూడదని చెబుతున్నారు. చాలామంది క్యాజువల్ గా ‘మీకు తిండి దండగ’ అంటుంటారు. అలాగే ‘వీడికోసం లక్షలు తగలేశాను ’ అంటుంటారు. ఇవి ప్రమాదమేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సెహ్వాగ్ మాటలు కొత్త తలనొప్పులు తెప్పించేలా ఉన్నాయని అంటున్నారు.

అంతేకాదు కొన్ని బౌన్సర్లు సెహ్వాగ్ పైకి కూడా వస్తున్నాయి. నువ్వెన్ని సార్లు ఫస్ట్ బాల్ కే గోల్డెన్ డక్ అయి వెనక్కి రాలేదు. ఒక అంతర్జాతీయ ఆటగాడివై అయి ఉండి, తోటి క్రీడాకారులను గౌరవించాల్సింది పోయి, మనమే అర్థం చేసుకోకుండా రాళ్లు వేయడం సరికాదని సూచిస్తున్నారు. మొత్తానికి చివరికిది ఎంత దూరం వెళుతుందో తెలీదని అంటున్నారు.

మరోవైపు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఏమన్నాడంటే భారతీయులు మాపై అమితమైన ప్రేమ, అభిమానం చూపించారు. అది మరిచిపోలేమని అన్నాడు. ఇప్పుడు మనోడు సెహ్వాగ్ ఇలా అన్నాడు. అతిథులను గౌరవించడం మన భారతీయ సంప్రదాయం..ఇంకెప్పుడూ ఇలా మాట్లాడవద్దని సెహ్వాగ్ కి చాలామంది సూచిస్తున్నారు.

Related News

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

Big Stories

×