EPAPER

ICC World Cup 2023 : పూనకాలు లోడింగ్.. విరాట్, రోహిత్ దీపావళి కానుక..

ICC World Cup 2023 : పూనకాలు లోడింగ్.. విరాట్, రోహిత్ దీపావళి కానుక..


ICC World Cup 2023 : కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీ ఇద్దరు అశేష భారతాభిమానులకు దీపావళి కానుక అందించారు. కాకపోతే ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందన్నట్టుగా మారింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడు. సచిన్ రికార్డ్ అధిగమిస్తాడు.. వన్డేల్లో సెంచరీల్లో ఆఫ్ సెంచరీ కొడతాడనుకుంటే నిరాశే ఎదురైంది.


మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా సెంచరీ చేస్తాడు, సిక్స్ లు కొడతాడు, ఏడు రికార్డులు తిరగరాస్తాడనుకుంటే మూడే వచ్చాయి. ఇంకా నాలుగు మిగిలిపోయాయి. అయితేనేం వాళ్లిద్దరూ మాత్రం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో అభిమానులకు గుర్తుండిపోయేలా మరపురాని దీపావళి కానుక అందించారు.

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ పాతికేళ్ల తర్వాతైనా గుర్తుండిపోతుంది. ఎందుకంటే‘‘అదేరా..కోహ్లీ, రోహిత్ వికెట్లు తీశారు కదా, ఆ మ్యాచ్’’ అని అనుకునేలా రిమార్కబుల్ మ్యాచ్ గా మార్చేశారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేసి చెరో వికెట్ తీసుకున్నారు.


ముఖ్యంగా విరాట్ కోహ్లీ బౌలింగ్ కి రావడమే ఒక ఎక్సయిట్మెంట్ అయితే, అందులో వికెట్ కూడా తీసేసరికి చిన్నస్వామి స్డేడియం అంతా పూనకాలు లోడింగ్ అయ్యాయి. ఒక్కసారి స్టేడియం హోరెత్తిపోయింది. అనుష్క కూడా సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యింది. ఆనందంతో కేరింతలు కొట్టింది.

మ్యాచ్ 25వ ఓవర్ వచ్చేసరికి కెప్టెన్ రోహిత్ శర్మ.. ఒకనాటి అజారుద్దీన్, ధోని కెప్టెన్సీలను గుర్తుకు తెచ్చాడు. అప్పట్లో ప్రత్యర్థుల వికెట్లు పడకపోతున్నా, పిచ్ ఫాస్ట్ బౌలర్లకు సహకరించకపోతున్నా బ్యాటర్లతో వీరిద్దరూ బౌలింగ్ చేయించేవారు. మ్యాచ్ ని టర్న్ చేసేవారు. అలా ఎన్నోసార్లు  సచిన్ పార్ట్ టైమ్ బౌలర్ గా మారి అద్భుతాలు చేసిన సందర్భాలున్నాయి.

ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది. కోహ్లీ బాల్  అందుకోగానే… ఒక్కసారి స్టేడియం అంతా కేకలు, విజిల్స్ తో హోరెత్తిపోయింది. బాల్ బాల్ కి ‘ కోహ్లీ… కోహ్లీ’ అంటూ ఒకటే కేకలు, అరుపులు… మొత్తానికి తన స్పెల్ రెండో ఓవర్ లో నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ వికెట్ తీశాడు. దీంతో చిన్నస్వామి స్డేడియానికే దీపావళ్లి వచ్చిందా అన్నట్టు వాతావరణం మారిపోయింది .అభిమానులు ఆనంద సంబరాల్లో మునిగి తేలిపోయారు.

9 ఏళ్ల తర్వాత ఈ వరల్డ్ కప్ లోనే మళ్లీ బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ బౌలింగ్ చేశాడు. ఆ మ్యాచ్ లో హార్థిక్ పాండ్యా గాయపడటంతో ఆ ఓవర్ లోని మిగిలిన 3 బంతులు కోహ్లీ వేశాడు. ఆ తర్వాత మళ్లీ నెదర్లాండ్స్ పై బౌలింగ్ చేశాడు. మొత్తమ్మీద 290 వన్డేలు ఆడిన కోహ్లీ ఇప్పటివరకు 5 వికెట్లు తీశాడు. నెదర్లాండ్స్ మీద కింగ్ కోహ్లీ 3 ఓవర్లు బౌలింగ్ చేసి 13 పరుగులు ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.

మహామహా టీమ్ లనే మట్టి కరిపించిన మన బౌలర్లు నెదర్లాండ్స్ టీమ్ దగ్గర తేలిపోయారు. ముఖ్యంగా పేసర్లకి అవసరమమైన సమయంలో వికెట్లు రాకపోయేసరికి జట్టు మీద ఎంత ప్రెజర్ పడిందంటే మొత్తం 9 మంది బౌలింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా షమీకి ఒక వికెట్టు రాలేదు. అది జట్టుకెంత అవసరమో ఈ మ్యాచ్ లో, సెమీస్ ముందు అందరికీ తెలిసొచ్చింది.

మ్యాచ్ లో ఆఖరి వికెట్టు రోహిత్ తీయడం విశేషం. తనకి కూడా ప్రపంచకప్ లో తొలివికెట్ దక్కింది. పిచ్ స్పిన్ కి అనుకూలంగా ఉంది. ఉన్నది రవీంద్ర జడేజా, కుల్దీప్ ఇద్దరే. దీంతో ఒక 10 ఓవర్లను పార్ట్ టైమర్స్ తో రోహిత్ ప్లాన్ చేశాడు. శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ రెండేసి ఓవర్లు వేశారు. వారికి వికెట్లు పడలేదు. కోహ్లీ, రోహిత్ మాత్రం తీసి జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.

మొత్తానికి నెదర్లాండ్స్ పై టీమిండియా 410 పరుగులు చేసి అభిమానులకు ఆనందాన్ని పంచితే, వారికి మరింత ఆనందం కలిగించేలా రోహిత్ శర్మ, కోహ్లీ బౌలింగ్ చేసి ఆ ఆనందాన్ని రెట్టింపు చేశారు.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×