Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ( IPL 2025) టోర్నమెంట్ కోసం రంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది అంటే నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ మొదటి వారంలో… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన…. మెగా వేలం జరగనుంది. ఈ మెగా వేలం దుబాయ్ లో జరగనున్నట్లు… ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. లేకపోతే ముంబైలో జరిగే ఛాన్స్ ఉంది. అయితే… మెగా వేలం నేపథ్యంలో ఇప్పటికే అన్ని జట్ల ఫ్రాంచైజీలు… తమ ప్లేయర్లను… లిస్ట్ అవుట్ చేస్తున్నాయి.
ఏ ప్లేయర్ను అంటిపెట్టుకోవాలి ? ఏ ప్లేయర్ ను వేలంలో వదిలివేయాలి ? ఎలాంటి ప్లేయర్ ను కొత్తగా కొనుగోలు చేయాలి? ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎవరిని ఎంచుకోవాలి ? అనే అంశాలను బేస్ చేసుకొని 10 ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. రేపటి లోగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు సంబంధించిన రిటెన్షన్ లిస్టును… పది జట్లు….బీసీసీఐ పాలకమండలికి ఇవ్వాల్సి ఉంది. అయితే ఇలాంటి నేపథ్యంలో బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ ( RCB )అదిరిపోయే వ్యూహాత్మక నిర్ణయంతో ముందుకు వెళ్తోంది.
Also Read: Gujarat Titans: షమీకి ఎదురుదెబ్బ… ఆ ప్లేయర్ కు 18 కోట్లు?
అన్ని ఫ్రాంచైజీలకు షాక్ ఇచ్చేలా సంచలన నిర్ణయం తీసుకుందట బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్. ఈ సీజన్ కోసం ప్రత్యేకంగా…. కొత్త కెప్టెన్ ను తీసుకువచ్చేందుకు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ నిర్ణయం తీసుకుందట. ఇందులో భాగంగానే విరాట్ కోహ్లీకి బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్సీ పదవిని ఇవ్వబోతున్నారట. గతంలోనే బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ కొనసాగిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టుకు… ఐపీఎల్ టోర్నమెంట్ రాలేదు..
అంతేకాదు ఆ జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ ( Virat Kohli )… ఉన్నప్పుడు.. ఆయన పర్ఫామెన్స్ పెద్దగా ఇవ్వలేదు. ఒకవేళ విరాట్ కోహ్లీ ఆడిన మిగతా ప్లేయర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యేవారు. ఇలా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ అనేక పరిస్థితులను ఎదుర్కొంది. దీంతో విరాట్ కోహ్లీ పై వేటు వేశారు. కెపెన్సి నుంచి తప్పించి డూప్లిసిస్ కెప్టెన్సీ ఇవ్వడం జరిగింది. 2022 సంవత్సరం ఐపీఎల్ నుంచి.. మొన్నటి వరకు ఆయన కెప్టెన్ గా ఉన్నారు.
అయితే ఈసారి డూప్లిసిస్ ను వేలంలో వదిలివేయనుంది.ఆయన ఏజ్ బార్ కావడంతో అతన్ని వదిలేస్తోంది ఆర్ సి బి. ఇలాంటి నేపథ్యంలో బెంగళూరు జట్టుకు కొత్త కెప్టెన్ కావాలి. మ్యాక్సీ మామ కు ఇద్దామన్నా కూడా… ఆయన పర్ఫామెన్స్ గత ఏడాది గోరంగా ఉంది. అందుకే అతనిని కూడా ఈసారి వేలంలో వదిలే అవకాశాలు ఉన్నాయి. సిరాజ్ కు పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. రోహిత్ శర్మ అని కొనుగోలు చేద్దామన్న ముంబై వదిలేలా కనిపించడం లేదు.
ఇక చేసేదేం లేక విరాట్ కోహ్లీని మళ్లీ కెప్టెన్ చేసేందుకే… బెంగళూరు రాయల్ చాలెంజర్స్ నిర్ణయం తీసుకుందట. దీనిపై విరాట్ కోహ్లీ తో కూడా చర్చించారట. దీనికి విరాట్ కోహ్లీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీనిపై రెండు రోజుల్లో ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.