EPAPER

Virat Kohli: 114 పరుగులు చేస్తే.. కొహ్లీ చేరువలో అరుదైన రికార్డ్

Virat Kohli: 114 పరుగులు చేస్తే.. కొహ్లీ చేరువలో అరుదైన రికార్డ్

Virat Kohli Set To Break Sachin ODI Records in Crucial 3rd Match Against Sri Lanka: విరాట్ కొహ్లీ.. ఇండియన్ క్రికెట్ కి వెన్నుముక. తను ఆడుతున్నాడా? లేదా? అనేది పక్కన పెడితే, తను జట్టులో ఉంటే చాలు, తను ఒక స్ఫూర్తి, ఇన్సిపిరేషన్, ఒక ఫైర్, వైబ్రేషన్, ఆగ్రెస్సివ్, కరేజ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. అన్నింటికి మించి ఫిట్ నెస్ మంత్రం.. ఇవన్నీ కలిపితే విరాట్ కొహ్లీ.. అందుకే తను జట్టులో ఉండాలని అందరూ కోరుకుంటారు.


ఇదంతా ఎందుకంటే, శ్రీలంకతో జరగనున్న మూడో వన్డేలో కొహ్లీ మరో 114 పరుగులు చేస్తే చాలు, వన్డేలో సచిన్ ఆల్ టైమ్ రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశం దక్కుతుంది. ఎందుకంటే తను 14 వేల మైలురాయిని చేరుతాడు. అదే జరిగితే వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 14వేల పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ రికార్డ్ సృష్టిస్తాడు.

తనకంటే ముందు సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర ఉన్నారు. అయితే వారు ఈ పరుగులు సాధించడానికి సచిన్ కి 350, సంగక్కరకి 378 వన్డేలు పట్టాయి. కానీ కోహ్లీ ఇప్పటివరకు 282 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఒకవేళ 114 పరుగులు చేసేస్తే 283 వన్డేల్లో అత్యంత వేగంగా 14వేల పరుగుల మైలు రాయిని చేరిన ఆటగాడిగా నిలుస్తాడు.


Also Read: సచిన్ ఫ్రెండ్ వినోద్‌కాంబ్లీకి ఏమైంది, ఈ పరిస్థితి కారణమెవరు?

అంతేకాదు 78 పరుగులు చేస్తే, అంతర్జాతీయ క్రికెట్ లో 27 వేల పరుగులు పూర్తి చేసిన క్రికెటర్ల జాబితాలో చేరతాడు. కోహ్లీ కంటే ముందు ముగ్గురు మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు. వారెవరంటే వరుసగా భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ( 34,357 పరుగులు), కుమార సంగక్కర ( 28,016 పరుగులు), రికీ పాంటింగ్ ( 27,483 పరుగులు), విరాట్ కోహ్లీ ( 26,922 పరుగులు) ఉన్నారు.

విరాట్ కొహ్లీకి శ్రీలంకపై అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. అందువల్ల కచ్చితంగా మూడో వన్డేలో విరాట్ కొహ్లీ సెంచరీ చేస్తాడని, రికార్డులన్నీ తిరగ రాస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. విరాట్ బ్యాట్ నుంచి రికార్డుల పేరు విని చాలారోజులైందని నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. మరి మన వీరాధి వీరుడేం చేస్తాడో చూడాల్సిందే.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×