EPAPER
Kirrak Couples Episode 1

Virat Kohli Fan Moment : కోహ్లి వద్దకు దూసుకొచ్చిన అభిమాని.. వీడియో వైరల్..

Virat Kohli Fan Moment : కోహ్లి వద్దకు దూసుకొచ్చిన అభిమాని.. వీడియో వైరల్..

Virat Kohli Fan Moment : ఇండోర్ లో జరిగిన రెండో టీ 20 సందర్భంగా పలు ఆసక్తికరమైన విశేషాలు చోటు చేసుకున్నాయి. మొదట ఆఫ్గానిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న సందర్భంగా విరాట్ కోహ్లీ లాంగ్ ఆన్ లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఇది గమనించిన ఒక అభిమాని నిబంధనలను అతిక్రమంచి, గ్రిల్స్ ఎక్కి, పోలీసుల కళ్లు కప్పి గ్రౌండ్ లోకి ఒక్క దూకు దూకి విరాట్ దగ్గర పడ్డాడు.


మొదట కంగారుపడిన కోహ్లీ తర్వాత అభిమానికి ఒక హగ్ ఇచ్చాడు. అయితే అభిమాని మొదట విరాట్ కాళ్లు పట్టుకున్నాడు. తను వారిస్తున్న వినకుండా కాళ్లకు దండం పెట్టి, అప్పుడు విరాట్ హగ్ ని స్వీకరించాడు. దీంతో అప్పటికి సెక్యూరిటీ సిబ్బంది హడావుడిగా దూసుకొచ్చి, ఆ వీరాభిమానిని బయటకు తీసుకువెళ్లారు . ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

విరాట్ కోహ్లీ అంటే అభిమానం లేనిది ఎవరికి ఉంటుంది. అయితే ఇప్పుడు పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఎంక్వైరీ మొదలవుతుంది. అతని ఆధార్ కార్డ్ తీసుకుంటారు. అలాగే తను టికెట్టు ఎలా కొనుగోలు చేశాడని చూస్తారు. అతని బ్యాక్ గ్రౌండ్ చూస్తారు. ఇలా ఒకటి కాదు, తనకి కొహ్లీని చూసిన ఆనందం లేకుండా చేసేస్తారు.


టెక్నికల్ ఇలా ఒకరికి జరిగనప్పుడు ఉదాసీనత చూపిస్తే, మన భారతదేశంలో ప్రజల మైండ్ సెట్ తెలిసిందే కదా…చిన్న సందు ఇస్తే చాలు ఎలా దూరిపోతారో…అందుకే ఆ వీరాభిమానికి ఒక డోస్ ఇచ్చినా ఇస్తారని అంటున్నారు. లేదంటే స్టేడియం నిబంధనలను అనుసరికి పెనాల్టీ విధించవచ్చు. లేదంటే ఆ పబ్లిక్ వల్లనే క్రికెట్ కి ఆదరణ ఉంది కాబట్టి, మానవతా దృక్పథంతో విడిచిపెట్టినా పెట్టవచ్చు. లేదంటే మరీ కఠినంగా ఉంటే ఒక రోజు లేదా వారం రోజులు జైలు శిక్ష ఉండవచ్చు.

కాకపోతే ఆ వీరాభిమాని ఒక రకంగా అదృష్టవంతుడనే చెప్పాలి. ఎందుకంటే విరాట్ మంచి మూడ్ లో ఉన్నాడు. లేదంటే తను గానీ చిరాకు పడి ఉంటే, ఈపాటికి వీరాభిమాని వీపు విమానం మోతమోగేదేనని నెట్టింట హల్చల్ అవుతోంది.

Related News

Akash Deep: ఆకాశ్ దీప్‌కు అక్కడ తగిలిన బంతి.. నవ్వులే నవ్వులు

Pant Sorry to Siraj: సిరాజ్ కి సారీ చెప్పిన పంత్..

IPL 2025: వచ్చే సీజన్ లో ఈ 5 జట్లకు కొత్త కెప్టెన్లు..SRH కు ఆ డేంజర్ ప్లేయర్ ?

Afg vs Sa: డేంజర్ గా మారుతున్న ఆఫ్ఘనిస్తాన్.. 177 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా పై చారిత్రాత్మక విక్టరీ

Jasprit Bumrah: 400 వికెట్ల క్లబ్ లో జస్ప్రీత్ బుమ్రా

IND vs BAN 2024: కొంపముంచిన అంపైర్ తప్పిదం.. కోహ్లీపై రోహిత్ సీరియస్ ?

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

Big Stories

×