EPAPER

Virat Kohli Angry on 3rd Umpire: రన్ మిషన్ ఆగహ్రం.. అంపైర్ తో వాగ్వాదం.. డస్ట్ బిన్ పై కోపాన్ని చూపించిన విరాట్!

Virat Kohli Angry on 3rd Umpire: రన్ మిషన్ ఆగహ్రం.. అంపైర్ తో వాగ్వాదం.. డస్ట్ బిన్ పై కోపాన్ని చూపించిన విరాట్!

ఇప్పుడిది నెట్టింట వైరల్ గా మారింది. నిజానికి ఈడెన్ గార్గెన్ లో జరిగిన మ్యాచ్ లో విరాట్ 7 బంతుల్లో 18 పరుగులు చేశాడు. అందులో 2 సిక్స్ లు, ఒక ఫోరు కూడా ఉన్నాయి. చాలా దూకుడుగా కనిపించాడు. ఎందుకంటే 223 పరుగుల లక్ష్యాన్ని వారు ఛేదించాలి. కానీ 2.1 ఓవర్ లో హర్షిత్ రాణా వేసిన బంతిని ఆడబోయిన కొహ్లీ అనుకోకుండా బౌలర్ కి క్యాచ్ ఇచ్చాడు.

ఒక్క పరుగులో ఓడిపోవడం అనేది ఒకటైతే, విరాట్ అవుట్ కూడా వివాదాస్పదమైంది. అయితే బాల్ నడుం కంటే ఎత్తులో వచ్చిందని విరాట్ చెప్పడమే కాదు, అవుట్ ఇచ్చిన అంపైర్ తో వాగ్వాదం పెట్టుకున్నాడు. దీంతో ఒక్కసారి నెట్టింట వేడెక్కిపోయింది.


ఇది అవుట్ అని అంపైర్ ప్రకటించాడు. అది కొహ్లీకి కోపం వచ్చింది. అది నడుంకంటే పైకి వెళ్లిందని విరాట్ అంపైర్ తో గొడవ పెట్టుకున్నాడు. దాంతో రివ్యూ కోసం థర్డ్ అంపైర్ కు రిఫర్ చేశారు. సమీక్షలో బంతి సరైనదేనని తేలింది.

దీంతో విరాట్ అసహనంగా బ్యాట్ ని అటు, ఇటూ తిప్పుతూ, నేలకేసి కొట్టాడు. తర్వాత డగౌట్ వైపు వెళుతూ అక్కడే ఉన్న డస్ట్ బిన్ ని గట్టిగా కొట్టాడు. ఎప్పుడైతే విరాట్ కి కోపం వచ్చిందో, అప్పుడే నెట్టింట అభిమానులకి కూడా కోపం వచ్చింది. ఛత్…మావాడు చెప్పిందే కరెక్టు..లేకపోతే విరాట్ ఎందుకలా అంటాడు…థర్డ్ అంపైర్ కెమెరాలన్నీ ఫాల్ట్ అంటూ సాంకేతికతపై అనుమానాలు, విమర్శలు గుప్పించారు.

దీంతో పెద్ద డిబేట్ మొదలైంది. ఈ అంశంపై ఏబీ డివిలియర్స్ మాట్లాడాడు. అంపైర్ నిర్ణయం కరెక్టే అన్నాడు. సాంకేతికతలోనే ఇబ్బందులున్నాయని అన్నాడు. వైడ్ ఎత్తు ఎంత వెళ్లిందనేది తెలుసుకునే టెక్నాలజీ ఇంకా అభివ్రద్ధి చెందాలని అన్నాడు. ఎందుకంటే కెమెరాస్ వికెట్ల కింద, వికెట్ల మధ్యలో ఉంటాయి. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వచ్చే బాల్ వేగాన్ని అవి కొంతవరకే కవర్ చేస్తాయని తెలిపాడు.

Also Read: IPL 2024: ఇక ఆర్సీబీ ఇంటికే.. ప్లే ఆఫ్ దారులు మూసుకుపోయినట్టే..!

బ్యాటర్ పొజిషన్ చూడాలి. లైన్ చూడాలి, బాల్ హైట్ చూడాలి. దాని ట్రాకింగ్ పసిగట్టాలి…ఇవన్నీ ఉంటే ఎటువంటి గందరగోళం ఉండదని అన్నాడు. సిద్ధూ, అంబటి రాయుడు థర్డ్ అంపైర్ నిర్ణయం సరైంది కాదని అన్నారు. అయితే క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే సరైన నిర్ణయమే అన్నాడు. ఇక ఇర్ఫాన్ పఠాన్ కూడా అది లీగల్ బాల్ అని తేల్చి చెప్పాడు.

ఇంతమంది సీనియర్ల మధ్యనే ఇన్ని అభిప్రాయభేదాలు ఉన్నప్పుడు విరాట్ చేసిన వాగ్వాదం సరైనదేనని, అడగడంలో తప్పు లేదని కొందరు అంటున్నారు. ఏదేతైనేం ఈ ఓటమితో ఇంక ఆర్సీబీ  ఫైనల్ ఛాన్స్ లు అన్నీ మూసుకుపోయినట్టేనని విశ్లేషకులు వ్యాక్యానిస్తున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×