EPAPER

Virat Kohli Birthday Special Story : కష్టమంటే ఏమిటో.. విరాట్‌కే తెలుసు!

Virat Kohli Birthday Special Story : కష్టమంటే ఏమిటో.. విరాట్‌కే తెలుసు!

Virat Kohli Birthday Special Story : తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకున్న కోహ్లీ దురలవాట్ల నుంచి ఎలా బయటపడ్డాడు?
పుట్టినరోజు సందర్భంగా కొహ్లీ జీవత కథ చెబుతున్న స్నేహితులు


అది 2006 సంవత్సరం.. ఢిలీ-కర్ణాటక మధ్య రంజీమ్యాచ్ జరుగుతోంది. విరాట్ కోహ్లీ 90 పరుగుల మీద ఆడుతున్నాడు. అప్పుడే ఒక షాకింగ్ వార్త వచ్చింది. తండ్రి మరణించాడన్న నిజం తెలిసింది. ఆట వదిలేసి మధ్యలో వెళ్లిపోవాలా? కొనసాగించాలా? అని సతమతమయ్యాడు. తాను గొప్ప క్రికెటర్ కావాలన్నది తండ్రి కల. అది నెరవేర్చాలి. అదే ఆయనకు నిజమైన నివాళి అనుకున్నాడు. 18 ఏళ్ల వయసులో తనెంత అంకితభావంతో ఉన్నాడో ఆ ఒక్క ఘటన నిరూపించింది. అలా మ్యాచ్ లో 160 పరుగులు చేశాడు. తర్వాత తండ్రి అంత్యక్రియలకు హాజరయ్యాడు.

విరాట్ కోహ్లీ జన్మదినోత్సవం సందర్భంగా భావోద్వేగ కథనం ఒకటి నెట్టింట పరుగులు పెడుతోంది. ఇన్నాళ్లూ తన గురించి నాణానికి ఒకవైపునే తెలిసిన ప్రజలకు, రెండో వైపు కూడా తెలిసేలా చేసింది.  విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా అతనితో సన్నిహితంగా ఉన్న ఎమ్మెస్కే ప్రసాద్, మాజీ భారత్ ఫుట్ బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రీతో తన అనుభవాలను పంచుకున్నాడు. ఇప్పుడవే వైరల్ అవుతున్నాయి.


1988 నవంబర్ 5న ఢిల్లీలో ఒక పేద పంజాబీ హిందూ కుటుంబంలో విరాట్ కోహ్లీ జన్మించాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు మూడో ఏటే కోహ్లీ బ్యాట్ పట్టాడు. తండ్రి ప్రేమ్ కొహ్లీ క్రిమినల్ లాయర్. అతి కష్టం మీద తన బజాజ్ స్కూటర్ పై కొహ్లీని ఫిరోజ్ షా గ్రౌండ్ లో వదిలి వచ్చేవాడు.అలా తిప్పడానికి ఆ పెట్రోల్ డబ్బులకి ఆయన కటకటలాడేవాడు.

తండ్రీ కొడుకులకి ఆ క్రికెట్ పై ప్రేమే జీవన బంధమైంది. ఒక అవ్యాజ్యమైన ప్రేమను పంచింది. సుమారు 10 ఏళ్లు ఆయన  కోహ్లీని గ్రౌండ్ కి తీసుకెళ్లి వదిలేవారు. ఆ దారిలో ఎన్నో కబుర్లు, కష్టాలు, జోక్స్ చెప్పుకునేవారు. కొహ్లీని గొప్ప క్రికెటర్ గా చూడాలని కలలు కనేవారు. అదే మాట పదేపదే చెప్పేవారు. అది చిన్నారి కోహ్లీలో బలమైన ముద్ర వేసింది. తన తండ్రి కోసం ఆడాలి. ఆయన ముఖంలో నవ్వు చూడాలి. ఆయన కోరిక తీర్చాలని పట్టుదలగా ఆడాడు. ఈరోజీ స్థాయిలో ఉండటానికి తన తండ్రి చూపిన మార్గమేనని అంటాడు.

ఒక సందర్భంలో విరాట్ జూనియర్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు. అయితే దానికి లంచం అడిగారు. ఆ డబ్బులు తండ్రి వద్ద లేవు. దాంతో నువ్వు అడ్డదారిలో వెళ్లవద్దు. నీ టాలెంట్ తోనే వెళ్లు. వాళ్లు నువ్వు కావాలి అనుకునేలా ఆడమని సూచించారు.

అప్పుడు విరాట్ కి మరో జీవిత సత్యం బోధపడింది. ఈ ప్రపంచంలో ఎవరూ మనకి సాయపడరు. మన కష్టం మనమే పడాలి. మనమే శ్రమించాలి అనుకున్నాడు. కానీ ఆరోజు రాత్రంతా ఏడ్చినట్టు విరాట్ తెలిపాడు. ఇక లాభం లేదనుకుని మళ్లీ కష్టపడ్డాడు. ఇంకా కష్టపడ్డాడు..మొత్తానికి రంజీ ట్రోఫీకి సెలక్ట్ అయ్యాడు. ఇక అక్కడ నుంచి కోహ్లీ వెనుతిరిగి చూసుకోలేదు.

నాడు తండ్రి మరణించిన చితి వద్ద కోహ్లీ ప్రతిజ్ణ చేశాడు. నాన్నకిచ్చిన మాట నిలబెడతానని సోదరుడితో చెప్పాడు. అది నిజం చేశాడు. ఈ క్రమంలో ఎన్నో ఆటుపోట్లు ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాడు. ఆదాయం లేదు, క్రికెట్ ఖరీదైన ఆట..తండ్రి లేడు. సోదరుడు చిన్నవాడు. ఈ సమయంలో తల్లి సరోజ్ కొహ్లీ ఎంతో కష్టపడి విరాట్ కి ఏ లోటూ రానిచ్చేది కాదు. అయితే తండ్రి జ్నాపకాలు గుర్తుకి వస్తే మాత్రం కోహ్లీ ఇప్పటికి ఎమోషనల్ అయిపోతాడు. చిన్నపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకుంటాడు.

ఈ క్రమంలో విరాట్ కోహ్లీ అండర్ 19లో సెలక్ట్ అయ్యాడు. బోర్డ్ దృష్టిలో పడ్డాడు. జాతీయ జట్టుకి ఎంపికయ్యాడు. చిన్నవయసులోనే 2011 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ లో ఉండటం ఒకవైపు నుంచి పేరు ప్రఖ్యాతులు, డబ్బులు అన్నీ ఒకేసారి వచ్చేసరికి కొహ్లీ దారి తప్పాడు. మందు పార్టీలు, జల్సాలతో ఆట గాడి తప్పింది. వళ్లు పెరిగింది.

శ్రీలంకతో టూర్.. అక్కడగానీ ఆడకపోతే ఇక ఇంటికేనని అర్థమైంది. అంతే ఒక్కసారి కొహ్లీలోని కసి, పట్టుదల పైకి వచ్చాయి. విజృంభించాడు. ఆరోజు రాత్రి మళ్లీ అలవాటైన ఫ్రెండ్స్ అందరూ పార్టీకి పిలిచారు. కోహ్లీ ఆరోజు ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇంక పార్టీల జోలికి వెళ్లకూడదు. తండ్రికిచ్చిన మాట మీదే దృష్టి పెట్టాలి అనుకున్నాడు.

అంతే ఫిట్ నెస్ మీద శ్రద్ధ పెట్టాడు. కొహ్లీ పట్టుదల తెలుసుగా.. పెరిగిపోయిన కొవ్వుని తగ్గించే పని పట్టాడు. అలా 10శాతం తగ్గించగలిగాడు. తర్వాత అమ్మ పెట్టే అన్నం మానేశాడు. ఫుడ్ కోచ్ ల సలహా మీద నడిచాడు. అలా కొన్నాళ్లకి నార్మల్ పొజిషన్ కి వచ్చాడు.

140 కిమీ వేగంతో వచ్చే బాల్ ని, ఎంత నిశితంగా చూడాలో, అంతకన్నా వేగంగా శరీరాన్ని కదిలించాలి. అలా చేయలంటే బాడీ ఫిట్ గా ఉండాలి, యాక్టివ్ గా ఉండాలి. అదే కోహ్లీ కూడా చేశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఫిట్ నెస్ మంత్ర… కొహ్లీ అదే సూత్రాన్ని పాటించాడు. తర్వాత ఎప్పుడూ కూడా కోహ్లీ డ్రింక్స్ జోలికి వెళ్లలేదు. నాన్ వెజ్ కూడా మానేశాడు.అంత ప్రోటీన్స్ ఉన్న ఫుడ్, మిల్లెట్స్ తో కూడిన ఫుడ్ కే ప్రిఫరెన్స్ ఇస్తాడు. అదే తన ఆరోగ్య సూత్రం అని చెబుతున్నాడు.

తన చిన్నతనంలో అద్దె ఇంట్లో ఉండేవారు. అద్దె కట్టలేదని వారి సామాన్లన్నీ రోడ్డు మీద పారేశారు. అది చిన్నతనంలో కొహ్లీపై బలమైన ముద్ర వేసిందని చెబుతాడు. అంతేకాదు.. తండ్రికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. మంచం మీద నుంచి లేవలేని స్థితి. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కోహ్లీ ఉండిపోయాడు. ఈ సంఘటనలన్నీ డబ్బుల విలువను తెలియజేసిందని అంటాడు.  అప్పుడే ఎక్కువ డబ్బులు సంపాదించాలని నిర్ణయానికి వచ్చానని అంటాడు. ఈరోజున కోహ్లీకి ఏడాదికి ప్రకటనల ద్వారా 300 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. మొత్తానికి ఇంతవరకు కొహ్లీ ఆదాయం వెయ్యికోట్లు దాటేసిందని చెబుతారు.

చూశారు కదండీ.. కోహ్లీ జన్మదినోత్సవం సందర్భంగా ఎంతోమంది కోహ్లీ ఎదిగిన తీరు గుర్తు చేసుకుంటున్నారు. నేటి అత్యుత్తమమైన ఆట వెనుక ఎంత కఠోర శ్రమ ఉందో చెబుతున్నారు. అంతేకాదు  కోహ్లీ కథ యువతకు ఆదర్శప్రాయమని అంటున్నారు.అయితే ఇప్పటికి కొహ్లీ కి ఒక కోరిక ఉంది. భారతదేశంలో అత్యుత్తమమైన క్రికెటర్ గా ఎదగాలి. అదింకా సాధ్యం కాలేదని నవ్వుతూ చెబుతుంటాడు. అందుకే  ప్రతీ ఒక్కరు జీవితంలో ఎదగాలంటే అనునిత్యం తామెంచుకున్న రంగంలో నిరంతరం కష్టపడుతూనే ఉండాలని, అందులో ఎత్తుపల్లాలను అధిగమిస్తూ వెళ్లాలని చెబుతున్నారు. అందుకు విరాట్ కోహ్లీ ఒక ఉదాహరణ అని అంటున్నారు.

Related News

Paralympics 2024: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. 29కి చేరిన పతకాల సంఖ్య

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

Big Stories

×