EPAPER

Virat Kohli vs Asitha Fernando: శ్రీలంక ఆటగాళ్లూ.. మీకిది తగునా..

Virat Kohli vs Asitha Fernando: శ్రీలంక ఆటగాళ్లూ.. మీకిది తగునా..

Kohli & Asitha Fernando in Ind vs SL 3rd ODI(Today’s sports news): ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామంటే భావోద్వేగాలు  పీక్స్ లో ఉంటాయి. ఆట చూసే ప్రజల్లోనే అంత ఉంటే, ఆడేవాళ్లకి ఇంకెంత ఉంటుంది. అందులో తప్పు లేదు. కానీ టీమ్ ఇండియాలో ఆటగాళ్లు సీనియర్లే కాదు.. వారికి క్రికెట్ ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయి. ఎంతో గౌరవ మర్యాదలున్నాయి. వారు లెజండరీ క్రికెటర్లు.  అలాంటి క్రికెటర్లను అవుట్ చేసి, ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కానీ, విపరీతార్థాలు వచ్చేలా వ్యవహరించడం సరికాదని, నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.


ఇంతకీ ఏమైందంటే.. మూడో వన్డేలో విరాట్ కొహ్లీకి బౌలింగు చేస్తూ శ్రీలంక పేసర్ అసిత ఫెర్నాండో చూపిన హావభావాలు నెట్టింట వైరల్ అయ్యాయి. అవతల ఉన్నది కొహ్లీ.. అయితే తనని ఎంతో మంది ఆరాధ్య క్రికెటర్ గా చూస్తుంటారు. ఆఖరికి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తన ఫేవరెట్ క్రికెటర్ కొహ్లీ అని బహిరంగంగా చెబుతాడు. అలాంటి కొహ్లీని పట్టుకుని.. నువ్వూ.. నీ బ్యాటింగు అన్నట్టు చూస్తూ.. రెచ్చగొట్టడం సరికాదని నెటిజన్లు అంటున్నారు.

అయితే కొహ్లీ కూడా ఊరుకోడు కదా.. తను కూడా అలాగే కళ్లతో చూసి, తర్వాత అసిత ఫెర్నాండో ఓవర్ లో ముందుకొచ్చి ఫోర్ కొట్టి గట్టిగా బదులిచ్చాడు. తర్వాత అనూహ్యంగా వెల్లెంగే బౌలింగులో ఎల్బీగా అవుట్ అయ్యాడు. అప్పుడు శ్రీలంక క్రికెటర్లందరూ విరాట్ కొహ్లీ మొఖం వైపు చూస్తూ గేలి చేస్తూ కెమెరా కంటికి కనిపించారు. కొహ్లీ తలదించుకుని మౌనంగా డగౌట్ వైపు వెళ్లిపోయాడు. ఇది చూసిన కొహ్లీ అభిమానులు శ్రీలంక ఆటగాళ్లపై సీరియస్ అవుతున్నారు.


Also Read: సిరాజ్ తో అన్ని ఓవర్లు అవసరమా?: రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు

క్రికెట్ అనేది జెంటిల్మేన్ గేమ్. శ్రీలంక జట్టులోకి ఒక డిసిప్లీన్ లేని క్రికెటర్లందరినీ తీసుకొచ్చారని అంటున్నారు. విరాట్ కొహ్లీని పట్టుకుని అలా ప్రవర్తించడం సరికాదని అంటున్నారు. పేసర్ అసిత ఫెర్నాండో ఇక శుభ్ మన్ గిల్ వికెట్ తీసి చాలా జుగుప్సాకరంగా డ్యాన్స్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు. అతని విక్రత చేష్టలు చూసి, శ్రీలంక జట్టు కూడా ఇబ్బంది పడింది. గెలుపు-ఓటములు ఆటలో సర్వ సాధారణంగా జరుగుతుంటాయి. ఏదో రెండు మ్యాచ్ లు గెలిచామని, ఇలా రెచ్చిపోకూడదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎవరైనా హద్దుల్లో ఉంటేనే అందమని చెబుతున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×