EPAPER

Gautam Gambhir on Rohit -Virat: వారిద్దరూ 2027 ప్రపంచకప్ ఆడతారు: గౌతం గంభీర్

Gautam Gambhir on Rohit -Virat: వారిద్దరూ 2027 ప్రపంచకప్ ఆడతారు: గౌతం గంభీర్

Virat and Rohit could play until ODI WC 2027 says Gautam Gambhir: టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతంగంభీర్ ఎట్టకేలకు ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాడు. శ్రీలంక పర్యటనకు వెళ్లేముందు తన మనసులో మాటలను బయటపెట్టాడు. దీంతో నెట్టింట పలు అనుమానాలకు ఫుల్ స్టాప్ పడినట్టేనని అనుకుంటున్నారు. ఇన్నాళ్లూ వచ్చిన ఎన్నో వార్తలు, చర్చలు, వాదోపవాదాలు వీటన్నింటికి భారత క్రికెట్ కోచ్ గా గంభీర్ సమాధానమిచ్చాడు. తన ప్రణాళికలను వివరించాడు.


ఈ క్రమంలోనే విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరిలో కూడా 2027 ప్రపంచకప్ ఆడే సామర్థ్యం ఉందని అన్నాడు. ఇలాంటి సీనియర్ల అండదండలు జట్టుకి ఉండటం ఎంతో ముఖ్యమని అన్నాడు. అందుకే వారిని శ్రీలంక టూర్ కి పిలిచానని తెలిపాడు. అయితే ఫిట్ నెస్ కాపాడుకోవాల్సి ఉందని చిన్న మెలిక పెట్టాడు. 2027 వచ్చేసరికి రోహిత్ శర్మకి 40, విరాట్ కొహ్లీ కి 38 ఏళ్లు వచ్చేస్తాయి. కొహ్లీ వరకు ఓకే అనుకున్నా, రోహిత్ శర్మ డౌటే అంటున్నారు. కానీ తన జీవితకాలపు లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి రోహిత్ శర్మ తప్పక ఆడతాడని అంటున్నారు.

సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తుంటాయి. వాటన్నింటిని పట్టించుకుంటే గడప దాటి బయట అడుగుపెట్టలేమని గంభీర్ అన్నాడు. అందుకే వాటి జోలికి వెళ్లదలుచుకోలేదని ఒక్కముక్కలో తేల్చి చెప్పేశాడు. ఇక్కడందరికీ ఒకటే చెబుతున్నాను జట్టు ప్రయోజనాల ముందు గంభీర్ కూడా ఎక్కువ కాదని అన్నాడు. జట్టులోని ప్రతి ఒక్కరితో నాకు సత్సంబంధాలే ఉన్నాయి. చాలా సంతోషకరమైన, ఆహ్లాదకరమైన డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం భారత జట్టులో ఉంది. అక్కడ బాగుంటేనే ఫీల్డ్ లో అద్భుత విజయాలు సాధించవచ్చునని అన్నాడు. ఆ సంగతి నాకు తెలుసునని అన్నాడు.


Also Read: హార్ధిక్‌పాండ్యా వ్యవహారం.. నోరు విప్పిన గంభీర్, అజిత్ అగార్కర్, శ్రీలంకకు బయలుదేరిన

ఇక తన ఆటిట్యూడ్ విషయంలో ఒకటి క్లారిటీగా చెప్పాడు. అందరూ నా గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే నేను మాత్రం భారత జట్టుకి సంబంధించి, ఏ విషయాన్ని సంక్లిష్టం చేయనని అన్నాడు. జట్టులోని ప్రతీ ఒక్కరికి నా మద్దతు ఉంటుందని అన్నాడు. ఇకపోతే టీమ్ ఇండియా సహాయక సిబ్బంది ఇంకా పూర్తిగా ఫైనలైజ్ కాలేదని అన్నాడు. జట్టులోని అందరి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుని ముందుకెళతానని అన్నాడు. ఆటగాళ్లకు స్వేచ్ఛనివ్వడం, వారిపై నమ్మకం ఉంచడం, ప్రోత్సహించడం కోచ్ గా నా విధి అని తెలిపాడు. మొత్తానికి గౌతంగంభీర్ ప్రెస్ ముందుకొచ్చి తన మనసులో మాట చెప్పడంతో నెట్టింట వేడి కొంచెం తగ్గిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Related News

IND vs BAN: ఇది గంభీర్ కు పరీక్ష.. రేపటి నుంచి బంగ్లాతో తొలిటెస్టు

IPL 2025: ముంబైలో ప్రకంపనలు…కొత్త కెప్టెన్​ అతడే..రోహిత్‌, పాండ్యా ఔట్‌?

Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్.. వారితో సమానంగా.. ప్రైజ్ మనీ

Kohli Vs Gambhir: ఐపీఎల్‌ లో తన్నుకున్నారు..ఇప్పుడు వాళ్లే టీమిండియాలో చీలిక తెచ్చారు..ప్రోమో అదుర్స్‌ !

Ind Vs Ban: 3 మార్పులతో బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ కు టీమిండియా రెడీ..ఫ్రీగా మ్యాచ్‌ ఎలా చూడాలంటే..?

Yashasvi Jaiswal: యశస్వి జైశ్వాల్ ముంగిట.. అద్భుత రికార్డ్

IND vs PAK: టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ లో భారీ మార్పులు.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

Big Stories

×