EPAPER

Vinesh Phogat: సంచలన నిర్ణయం.. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వినేష్ ఫొగట్

Vinesh Phogat: సంచలన నిర్ణయం.. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వినేష్ ఫొగట్

Vinesh Phogat retires after disqualification from Paris Olympics: రెజ్టర్ వినేష్ ఫొగట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్టింగ్‌కు వినేష్ ఫొగెట్ రిటైర్మెంట్ ప్రకటించింది. 24 ఏళ్ల రెజ్లింగ్ కెరీర్‌కు వినేష్ పొగట్ గుడ్ బై చెప్పడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. చివరి క్షణంలో ఆమెపై అనర్హత పడడంతోనే రెజ్లింగ్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆమె ట్వీట్ చేశారు.


ఒలింపిక్స్‌లో అనర్హతపై వినేష్ ఫొగట్ భావోద్వేగం వ్యక్తం చేసింది. ‘అమ్మా..నన్ను క్షమించు. మీ కల, నా ధైర్యం చెదిరిపోయాయి. నాపై కుస్తీ గెలిచింది..నేను ఓడిపోయా. నన్ను క్షమించండి. ఇంతకంటే పోరాడే బలం నాకు లేదు. గుడ్ బై రెజ్లింగ్ 2001-2024.’ అంటూ వినేష్ ఫొగట్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్ చేరిన వినేష్..ఈసారి స్వర్ణం సాధిస్తుందని 140కోట్ల భారతీయులు అనుకున్నారు. కానీ అనూహ్యంగా అనర్హత వేటు పడడంతో నిరాశకు గురవుతున్నారు. అంతకుముందు బరువు తగ్గించుకునేందుకు మరికొంత సమయం ఇవ్వాలని ఒలింపిక్స్ నిర్వాహకులను ఎంత బతిమాలినా ఫలితం లేకపోయింది.


మరోవైపు తనను అనర్హురాలిగా ప్రకటించడంతో ఆమె సవాల్ చేస్తూ ఫొగట్ కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ను సైతం ఆశ్రయించింది. తను సిల్వర్ మెడల్‌కు అర్హురాలినని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. అయితే దీనిపై ఆర్బిట్రేషన్ తీర్పు ఇవ్వాల్సి ఉండగానే.. వినేష్ సంచలన నిర్ణయం తీసుకుంది.

Also Read: వినేశ్ ఫొగాట్, రెజ్లింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయి.. అధికారులు ఏం చేశారు ?

ఇదిలా ఉండగా, ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన వినేష్ ఫొగట్‌కు నిరాశ ఎదురైంది. 100గ్రాములు ఎక్కువ బరువు ఉండడంతో అనర్హత వేటు పడింది. మహిళల ఫ్రీ స్టయిల్ 50 కేజీల విభాగంలో వినేష్ ఫొగట్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. కాగా, ఆమె 50 కిలోల కంటే 100 గ్రాముల బరువు ఉండటంతో అనర్హురాలిగా ప్రకటించారు. స్వర్ణం సాధించేందుకు కేవలం అడుగు దూరంలో ఇలా ఎదురుదెబ్బ తగలడంతో ఆమె కల చెదిరింది. ఈ సంఘటనతో వినేష్..తీవ్ర నిరాశలోకి కూరుకుపోయింది.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×