EPAPER

Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్.. పతకం రాకుండా వినేశ్ ఫొగాట్‌పై కుట్ర, అనర్హత వేటు

Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్.. పతకం రాకుండా వినేశ్ ఫొగాట్‌పై కుట్ర, అనర్హత వేటు

Vinesh Phogat: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఊహించని షాక్ తగిలింది. ఫైనల్ చేరి పతకం కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌పై అనర్హత వేటు పడింది. ఆమె బరువు పెరగడంతో ఒలింపిక్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.


పారిస్ ఒలింపిక్స్‌‌లో ఏం జరుగుతోంది? భారత్ దూకుడును అడ్డుకునేందుకు ప్లాన్ జరుగుతోందా? కేవలం భారత క్రీడాకారులపైనే పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు కన్నేశారా? నిన్న హాకీ జట్టులోని ఓ ఆటగాడిపై వేటు వేసింది. నేడు రెజ్లర్ వినేశ్ ఫోగాట్ వంతైంది. రేపు ఇంకెవరో? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు పారిస్ ఒలింపిక్స్‌లో ఏం జరుగుతోందన్న చర్చ ప్రపంచవ్యాప్తంగా అప్పుడే మొదలైంది.

పతకానికి అడుగు దూరంలో ఉన్న భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌పై పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు వేటు వేశారు. 50కేజీల విభాగంలో వినేశ్ ఫైనల్‌కు చేరింది. అమెరికాకు చెందిన సారా హిల్డర్ బ్రాంట్‌తో తలపడ నుంది. అయితే ఫోగాట్ ఆట ఆడే సమయానికి కేవలం 100 గ్రాముల బరువు పెరిగిందన్న కారణంతో అనర్హత వేటు వేసింది.


ALSO READ: ఫైనల్‌లో వినేశ్ ఫొగాట్.. ఆమె ఉడుంపట్టుకు క్యూబా రెజ్లర్ విలవిల..

రెజ్లింగ్‌లో ఆది నుంచి వినేశ్ ఫొగాట్‌ బలమైన ప్రత్యర్థులను ఢీ కొట్టింది. వారిందరినీ ఎత్తి కుదేసింది వినేశ్. తొలి మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన ఫేమస్ రెజ్లర్ సుసాకిపై సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత క్వార్టర్స్‌లో మాజీ యూరోపియన్ ఛాంపియన్, ఉక్రెయిన్‌కి చెందిన లివాచ్‌ను ఖంగు తినిపిం చింది. సెమీస్‌లో క్యూబాకు చెందిన గుజ్మన్ లోపేజ్‌కు చుక్కలు చూపించింది. ఫైనల్‌లో అమెరికాకు చెందని రెజ్లర్‌తో తలపడనుంది.

వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు వేయడాన్ని భారత రెజ్లర్ అధికారులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతు న్నారు. ఇదేదో కావాలనే కుట్ర జరుగుతోందని అంటున్నారు. కేవలం భారత క్రీడాకారుల విషయంలో మాత్రమే ఈ విధంగా జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

హాకీలో కీలక డిఫెండర్ అమిత్ రోహిదాస్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధించింది. బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అమిత్ స్టిక్ బ్రిటన్ ఆటగాడికి తగిలిందని పేరుతో వేటు వేసింది. రెజ్లింగ్ 68 కేజీల విభాగంలో భారత్ క్రీడాకారిణి నిషాదహియా గాయాలకు కారణం ఉత్తర కొరియా ప్లేయర్ అని అంటున్నారు.

నిషా చేతి వేలుకి కారణమైన కొరియా క్రీడాకారిణిపై ఎలాంటి చర్యలు లేవని ఆరోపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో నిషా ఓటమి వెనుక పెద్ద కుట్ర జరుగుతుందని కోచ్ ఓపెన్‌గా వెల్లడించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి పారిస్ ఒలింపిక్స్‌.. భారత్‌కు ఈసారి చేదు అనుభవాన్ని మిగిల్చాయనే చెప్పవచ్చు.

Related News

Shubman Gill: ఇలాగైతే కష్టమే అనుకుంటా.. గిల్

IND vs BAN: బంగ్లాతో తొలి టెస్ట్.. మహ్మద్ షమీకి దక్కని చోటు

US Open 2024: యూఎస్ ఓపెన్‌లో.. టైటిల్ గెలిచిన బెలారస్ భామ

Paris Paralympics 2024: పారాలింపిక్స్‌లో 29 పతకాలతో ఘనంగా ముగించిన భారత్

Duleep trophy 2024: వారెవ్వా.. ధ్రువ్ మామూలోడు కాదు.. ధోని రికార్డుకే ఎసరు పెట్టాడు!

US Open 2024 final: యూఎస్ ఓపెన్.. సిన్నర్ దే టైటిల్, ఓపెనింగ్.. ఎండింగ్ అదుర్స్..

Ollie Pope Creates History: ఏడు దేశాలపై ఏడు సెంచరీలు.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో రికార్డ్

Big Stories

×