EPAPER

Vamshhi Krrishna: 6,6,6,6,6,6.. ఈ వంశీ కృష్ణ ఎవరు..?

Vamshhi Krrishna: 6,6,6,6,6,6.. ఈ వంశీ కృష్ణ ఎవరు..?

Vamshhi Krrishna Smashes Six Sixes in an Over: ఎక్కడో యువరాజ్ సింగ్ ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లు, ఇంకో చోట మరెవరో కొట్టారని అంటూ ఉంటారు. కానీ మన తెలుగు కుర్రాడు రైల్వేస్ తో జరిగిన మ్యాచ్ లో ఒక ఓవర్ లో ఆరు బంతులకి ఆరు సిక్స్ లు కొట్టి, అందరి దృష్టిని ఒక్కసారి తన వైపునకు తిప్పుకున్నాడు.


విషయం ఏమిటంటే కడపలో వైఎస్ రాజారెడ్డి-ఏసీఏ క్రికెట్ మైదానంలో ఆంధ్రా- రైల్వేస్ మధ్య  కల్నల్ సీకే నాయుడు ట్రోఫీ మ్యాచ్‌ జరిగింది.  నాలుగురోజుల మ్యాచ్ లో   ఈ అద్భుతం జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆంధ్రజట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 372 పరుగులు చేసింది.

రైల్వేస్ లెగ్ స్పిన్నర్ దమన్‌దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ 10 వ ఓవర్ లో  మొదటి బాల్ నుంచి ఆంధ్రా బ్యాటర్ వంశీ కృష్ణ ఉతకడం మొదలుపెట్టాడు. సింగ్ బౌలింగ్ వేయడం..గ్రౌండ్ అవతలకి పంపించడం, అంపైర్ చేతులెత్తడం పరిపాటిగా మారిపోయింది.

నిజానికి ఆంధ్రా జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో వంశీ కృష్ణ బ్యాటింగ్‌కు వచ్చాడు. అటాకింగ్ కి వెళ్లి మ్యాచ్ తీరునే మార్చేశాడు. అతని పవర్ హిట్టింగ్‌కు రైల్వే బౌలర్ల వద్ద సమాధానం లేకుండా పోయింది. ఒక్కదమన్ దీప్ సింగ్ నే కాదు, అందరికీ వంశీ కృష్ణ  వడ్డించాడు.


మొత్తానికి 54 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్ గా 64 బంతుల్లో 12 సిక్స్‌లు, 4 ఫోర్లతో 110 పరుగులు చేశాడు. అయితే దమన్‌దీప్ సింగ్ మాత్రం తన కెరీర్ లో ఈ ఓవర్ ని మరిచిపోలేడు. ఎలా వేసినా సరే, దానిని గ్రౌండ్ అవతలికి పంపించే సరికి, అందరూ కళ్లు విప్పి అలా చూస్తూ ఉండిపోయారు.

ఇంతకుముందు అంతర్జాతీయ వన్డేల్లో గిబ్స్ (దక్షిణాఫ్రికా ), జస్కరణ్ మల్హోత్రా (అమెరికా), టీ 20ల్లో యువరాజ్ సింగ్ (భారత్), పొలార్డ్ (వెస్టిండీస్) ఇలా ఆరుబంతుల్లో ఆరు సిక్సులు కొట్టిన వారిలో ఉన్నారు.

Tags

Related News

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

Rishabh Pant: అంతర్జాతీయ క్రికెట్ లో ఒత్తిడి తప్పదు: రిషబ్ పంత్

Big Stories

×