EPAPER

Under-19 World Cup: ఐసీసీ ప్రపంచకప్‌ జట్టు.. నలుగురు మన కుర్రాళ్లకు చోటు

Under-19 World Cup: ఐసీసీ ప్రపంచకప్‌ జట్టు.. నలుగురు మన కుర్రాళ్లకు చోటు
ICC Under-19 World Cup 2024

ICC Under-19 World Cup 2024: అండర్ 19-2024 వరల్డ్ కప్ ముగిసింది. టీమ్ ఇండియా కుర్రాళ్లు ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై, దిగాలుగా తిరుగు ముఖం పట్టారు. కానీ వారికి ఒక తీపి కబురు మాత్రం అందింది. అదేమిటంటే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఎంపిక చేసిన అండర్ 19 ప్రపంచ క్రికెట్ జట్టులో నలుగురు టీమ్  ఇండియా కుర్రాళ్లు ఉన్నారు. దీంతో అందరిలో ఆనందం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఐసీసీ గుర్తించిందంటే వారికి టీమ్ ఇండియా సీనియర్ల జట్టులో స్థానం దక్కినట్టే అంటున్నారు.


ఐసీసీ ఎంపిక చేసిన వారిలో బ్యాటర్లు ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్, సచిన్ దాస్‌లకు చోటు దక్కింది.  బౌలింగ్ విభాగంలో మాత్రం సౌమీ పాండే ఎంపికయ్యాడు. అండర్ 19లో  కెప్టెన్ ఉదయ్ సహరన్ 56 సగటుతో 397 పరుగులు చేశాడు. అంతేకాదు టోర్నమెంటులో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

ఐసీసీ అండర్ 19 ప్రపంచకప్ లో తనని థర్డ్ డౌన్ గా ఎంపిక చేసింది. నిజానికి ఆ ప్లేస్ లో సచిన్ దాస్ వచ్చి ఆడేవాడు. కానీ ఐసీసీ ఎంపిక చేసిన ప్రపంచకప్ లో మాత్రం ఆ ప్లేస్ ని ఉదయ్ కి ఇచ్చారు. సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ మాత్రం ఎప్పటిలా ఫస్ట్ డౌన్ ని నిలబెట్టుకున్నాడు. తను  60 సగటుతో 360 పరుగులు చేశాడు.


Read more: 36 ఏళ్లలో తొలిసారి.. ఓపెనర్ల చెత్త రికార్డ్..!

భారత్‌కు కీలక సమయాల్లో అండగా నిలిచి బెస్ట్ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్న సచిన్ దాస్ ఫోర్త్ డౌన్ లో రానున్నాడు. తను రెండు సెంచరీలు మిస్ చేసుకున్నా 60 సగటుతో 303 పరుగులు చేశాడు. తను ఫోర్త్ డౌన్ రానున్నాడు. ఇక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ సౌమీ పాండే 18 వికెట్లు పడగొట్టాడు. ఒక ఎడిషన్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా నిలిచాడు.

వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు నుంచి ముగ్గురు, సౌతాప్రికా జట్టు నుంచి ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. పాకిస్థాన్, వెస్టిండీస్ నుంచి ఒక్కో ఆటగాడికి చోటు దక్కింది. సౌతాఫ్రికాకు చెందిన లువాన్ డ్రే ప్రిటోరియస్, ఆస్ట్రేలియాకు చెందిన హ్యారీ డిక్సన్ ఓపెనర్లుగా ఎంపికయ్యారు.

ఐసీసీ ప్రపంచ కప్ జట్టుకు కెప్టెన్ గా  ఆస్ట్రేలియా ఆటగాడు హ్యూ విబ్జెన్  ఎంపికయ్యాడు. వెస్టిండీస్ ఆటగాడు నాథన్ ఎడ్వర్డ్‌ను ఆల్‌రౌండర్‌గా ఎంపిక చేశారు. బౌలర్లుగా ఆస్ట్రేలియా నుంచి కల్లమ్ విడ్లర్, పాకిస్థాన్ నుంచి  ఉబైద్ షా, సౌతాఫ్రికా నుంచి క్వేనా మఫాకా చోటు దక్కించుకున్నారు.

ఐసీసీ అండర్ 19 ప్రపంచ కప్ జట్టు ఇదే:
హ్యూ విబ్జెన్ (కెప్టెన్), ఉదయ్ సహారన్, ముషీర్ ఖాన్, లువాన్ డ్రే ప్రిటోరియస్, హ్యారీ డిక్సన్, సచిన్ దాస్, సౌమీ పాండే, నాథన్ ఎడ్వర్డ్, కల్లమ్ విడ్లర్, ఉబైద్ షా, క్వేనా మఫాక్

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×