EPAPER

Tim Southee : కివీస్ పేసర్.. టిమ్ సౌథి ప్రపంచ రికార్డ్..!

Tim Southee : కివీస్ పేసర్.. టిమ్ సౌథి ప్రపంచ రికార్డ్..!
Tim Southee

Tim Southee : అంతర్జాతీయ టీ 20 క్రికెట్ లో 150 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్ గా కివీస్ పేసర్ టిమ్ సౌథి ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. న్యూజిలాండ్ గడ్డపై పాకిస్తాన్ తో ఐదు టీ 20ల సిరీస్ లో భాగంగా తొలి టీ 20 ఆక్లాండ్ వేదికగా జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది.  భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కి వెళ్లిన పాకిస్తాన్ 18 ఓవర్లలోనే 180 పరుగులకు ఆలౌట్ అయ్యింది.


కివీస్ బ్యాటింగ్ లో కెప్టెన్ విలియమ్సన్ (57), డేరిల్ మిచెల్ (61) చేయడంతో కివీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (34), మార్క్ చాప్ మన్ (26), గ్లెన్ ఫిలిప్స్ (19) చకచకా పరుగులు తీశారు.

పాకిస్తాన్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది 3, హరిస్ రవూఫ్ 2, అబ్బాస్ ఆఫ్రిది 3 వికెట్లు తీశారు. బౌలర్లు అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఉసామా మిర్ అయితే 4 ఓవర్లు వేసి 51 పరుగులిచ్చి, ఒక్క వికెట్టు కూడా తీయలేకపోయాడు. అయితే షాహిన్ ఆఫ్రిది కెప్టెన్సీలో జరిగిన తొలి టీ 20 మ్యాచ్ ఇలా ఓటమితో మొదలైంది.


229 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ తో ప్రారంభించిన పాకిస్తాన్ 180 పరుగులకే ఆలౌట్ అయింది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఒక్కడే నిలిచి ఆడాడు. 35 బంతుల్లో 57 పరుగులు చేసి, మ్యాచ్ ని గెలిపించే స్థితికి వెళ్లాడు. కానీ వెంటనే అవుట్ అయిపోయాడు.

అయితే ఓపెనర్లు సయీమ్ ఆయుబ్ (27), రిజ్వాన్ (25), ఫఖర్ జమాన్ (15), ఇఫ్తికర్ అహ్మద్ (24) ఇలా త్వరత్వరగా వచ్చి, ఏవో నాలుగు ఫోర్లు కొట్టి హడావుడి చేసి వెళ్లిపోయారు.

అయితే పాకిస్తాన్ ని నిలువునా కివీస్ పేసర్ టిమ్ సౌథి  కుప్పకూల్చాడు. 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. దీంతో టీ 20 క్రికెట్ లో 150 వికెట్లు తీసిన తొలి బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.

బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ 140 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.  అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (130), న్యూజిలాండ్ స్పిన్నర్ ఇష్ సోధీ (127)లు తర్వాత మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ (107) , శ్రీలంక ప్లేయర్ లసిత్ మలింగ (107) వరుసగా తర్వాత స్థానాల్లో ఉన్నారు.

2008లో అంతర్జాతీయ టీ 20 క్రికెట్‌లోకి టిమ్ సౌథి అడుగుపెట్టాడు.  ఇప్పటివరకు ఆరేళ్లలో 117 టీ 20 మ్యాచులు ఆడి, 151 వికెట్లు తీశాడు. ఇక అన్ని ఫార్మాట్లు కలిపి న్యూజిలాండ్ తరఫున 746 వికెట్లు తీశాడు. వీటిలో 350 వికెట్లు టెస్టు క్రికెట్‌లోనే  ఉండటం విశేషం.

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×