EPAPER

IPL 2025: కోహ్లీకి షాక్‌ తప్పదా…RCB రిటెన్షన్ లిస్ట్ ఇదే!

IPL 2025: కోహ్లీకి షాక్‌ తప్పదా…RCB రిటెన్షన్ లిస్ట్ ఇదే!

 


IPL 2025: ఐపీఎల్‌ మాజా ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతోంది. ఐపీఎల్ లో ఉన్న టీమ్ లు అన్నింటిలో ఆర్సిబి క్రేజీ టీం అని చెప్పవచ్చు. ప్రతిసారి హాట్ ఫేవరెట్ గానే బరిలోకి దిగుతున్న టైటిల్ మాత్రం అందుకోలేకపోతోంది. మూడుసార్లు ఫైనల్ కు చేరుకుంది. అయినప్పటికీ ట్రోఫీని దక్కించుకోలేకపోతోంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఈ సారైనా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మెరుగైన ప్రదర్శన చూపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. డ్రీమ్ నెరవేరాలని ఆశపడుతున్నారు. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లుక్ ఈసారి ఇలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారుతుంది. ఆర్సిబి రిటెన్షన్ లిస్ట్ పైన చర్చలు జరుగుతున్నాయి.

కొత్త నిబంధనల ప్రకారం ఆరుగురిని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రిటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఒకరిని రైట్ టు మ్యాచ్ నిబంధన ప్రకారం తీసుకోవచ్చు. ఈసారి జట్టులో చాలా మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిటైన్ చేసుకునే ప్లేయర్ల జాబితాలో విరాట్ కోహ్లీ కచ్చితంగా ఉంటాడు. 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున విరాట్ కోహ్లీ బరిలోకి దిగుతున్నాడు. ఆర్సిబితో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. కెప్టెన్ గా ఉన్నా లేకపోయినా జట్టు ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ఆ టీమ్ లో నిలకడగా రాణిస్తున్నాడు. గత సీజన్లోను ఆకట్టుకున్నాడు.


Also Read: Ratan Tata: టీమిండియా క్రికెటర్లకు ఆపద… ఆదుకున్న రతన్ టాటా !

లాస్ట్ సీజన్లో 741 పరుగులు చేశాడు. టాప్ స్కోరర్ గా నిలిచి ఆరెంజ్ క్యాప్ ను అందుకున్నాడు. ఆర్సిబి తరఫున 18 కోట్లు తీసుకునే ప్లేయర్ కోహ్లీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. జట్టులో విరాట్ కోహ్లీని మించిన రేంజ్ ఎవరికి లేదని ఎక్స్పర్ట్ అంచనాలు వేస్తున్నారు. ఆర్సిబికి కోహ్లీతోనే గ్లామర్ అని చెబుతున్నారు. సిరాజ్ కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కీలక ఆటగాడు. గత సీజన్లో అద్భుతంగా రాణించారు. 14 లీగ్ మ్యాచుల్లో 15 వికెట్లు సొంతం చేసుకున్నా. కోహ్లీతో సిరాజ్ కు కూడా మంచి బాండింగ్ ఉంది. దీంతో ఇతడిని ఆర్సిబి వదలదనే ప్రచారం జరుగుతోంది. గత సీజన్లో ఆర్సిబిలోకి కెమెరూన్ గ్రీన్ ఎంట్రీ ఇచ్చాడు. 17 కోట్లకు ఆసీస్ ప్లేయర్ ను ఆర్సిబి తీసుకుంది. వారీ అంచనాలకు తగిన రేంజ్ లో రాణించకపోయినప్పటికీ పరవాలేదనిపించాడు.

13 మ్యాచుల్లో 225 పరుగులు చేసి 10 వికెట్లు సొంతం చేసుకున్నాడు. కెమెరూన్ గ్రీన్ ను ఆర్సిబి అట్టి పెట్టుకునే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. గతంలోనూ గ్లెన్ మాక్స్వెల్ నిరాశపరిచాడు. బ్యాటింగ్ తో బాలింగ్ తో విఫలమయ్యాడు. ఓ రకంగా ఆర్సిబికి భారం అయ్యాడని చర్చలు కూడా జరిగాయి. అంచనాలకు తగినట్టుగా ఆడని మ్యాక్సీని బెంగుళూరు జట్టు వదులుకుందనే టాక్ వినిపిస్తోంది. ఓ రకంగా మ్యాక్సీని వదలకపోతే గ్రీన్ వేలానికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పర్ట్ అంటున్నారు. కెప్టెన్ పాఫ్ డూప్లెసిస్ ను కూడా ఆర్సిబి వదిలేసేలా ఉంది. ఈ సౌత్ ఆఫ్రికా స్టార్ ప్లేయర్ వయసు 40 సంవత్సరాలు. వయసును దృష్టిలో పెట్టుకొని డూప్లెసిస్ ను పక్కకు తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సీజన్లో అద్భుతంగా రాణించిన రజక్ పాటీదార్, యస్ దయాల్, ఆకాష్ దీప్ పై కూడా ఆర్సిబి ఫోకస్ ఉంటుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.

Related News

Rohit Sharma – Devara: BGM దేవరది..బ్యాటింగ్‌ రోహిత్‌ శర్మది..ఇక రచ్చ రచ్చే !

IND VS BAN: హైదరాబాద్ గడ్డపై టీమిండియా…రేపే బంగ్లాతో మ్యాచ్

Rafael Nadal: రఫెల్ నాదల్ సంచలన నిర్ణయం…!

Ratan Tata: టీమిండియా క్రికెటర్లకు ఆపద… ఆదుకున్న రతన్ టాటా !

Riyan Parag: బంగ్లా మ్యాచ్‌ లో పరాగ్‌ ఓవరాక్షన్‌..ఇదే తగ్గించుకుంటే మంచిది !

IND vs BAN: తెలుగోడి ఊచకోత.. బంగ్లాపై టీమిండియా విజయానికి 5 కారణాలు ఇవే !

Big Stories

×