EPAPER

Ipl Winners List From 2008: 2008 నుంచి ఐపీఎల్ విజేతలు వీరే..

Ipl Winners List From 2008: 2008 నుంచి ఐపీఎల్ విజేతలు వీరే..

ipl winners list


Ipl Winners List From 2008(Today’s sports news): ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చేస్తోంది. అంటే అప్పుడే ఐపీఎల్ ఫీవర్ మొదలైపోయింది. అయితే ఐపీఎల్ 2008లో ఇండియాలో ఘనంగా ప్రారంభమైంది. ఇందులో 10 ఫ్రాంచైజీల టీమ్స్ పాల్గొన్నాయి. మరి 2008 నుంచి ఇప్పటివరకు ఏ జట్టు టైటిల్ గెలిచిందో ఒకసారి చూసేద్దాం.

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అంటే అందరికీ తెలిసిందే. ఐసీసీ మూడు ట్రోఫీలను అందించిన ఘనత ఒక్క ధోనీకే దక్కుతుంది. అలాంటివాడు చెన్నయ్ సూపర్ కింగ్స్ జట్టుకి సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. తను ఐదుసార్లు  2010, 2011, 2018, 2021, 2023లో సీఎస్కేకి ట్రోఫీని అందిచాడు.


టీమ్ ఇండియాలో ఆడేటప్పుడు..ఆటగాళ్ల ఆటతో సంబంధం లేకుండా, కేవలం కెప్టెన్సీ ప్రతిభతో ఆఖరి బాల్ వరకు వెయిట్ చేసి, దాన్ని సిక్స్ కొట్టి మరీ మ్యాచ్ గెలిపించే ఏకైక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనే చెప్పాలి. అందరూ టెన్షను పడుతుంటారు. ఊపిరి బిగపట్టి చూస్తుంటారు. కానీ ధోనీ చాలా కూల్ గా కనిపిస్తాడు.అలాంటి ధోనీ కెప్టెన్సీ మెరుపులు ఐపీఎల్ లో ఎన్నో ఉన్నాయి.

Also Read: ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ విజేతలు వీరే..

ధోనీ తర్వాత టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. అయితే ధోనీకన్నా తనే ముందు ఐదు ట్రోఫీలను గెలిచాడు. తర్వాత రోహిత్ శర్మ రికార్డును ధోనీ సమం చేశాడు.

ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్ కి మొన్నటి వరకు సారథిగా ఉన్నాడు. నాటకీయ పరిణామాల మధ్య తనని తప్పించి, హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇచ్చారు. ఇకపోతే రోహిత్ శర్మ ఆధ్వర్యంలోని ముంబై 2013, 2015,2017, 2019, 2020 లో ఐదుసార్లు ట్రోఫీ సాధించింది.

ప్రస్తుతం ఐపీఎల్ రోహిత్ శర్మ ఆడటం లేదని తెలిసింది. ఇప్పటివరకు అందరూ వచ్చారు. ఆఖరికి కొహ్లీ కూడా వచ్చేశాడు. కానీ రోహిత్ ఇంకా రాలేదు. జట్టుతో కలవలేదు. ఈసారి ఐపీఎల్ కి రాడనే అందరూ అంటున్నారు.

అటు తర్వాత కోల్ కతా నైట్ రైడర్స్ రెండు సార్లు 2012, 2014లో విజేతగా నిలిచింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ (2022), సన్ రైజర్స్ హైదరాబాద్  (2016 ), రాజస్తాన్ రాయల్స్ (2008), డక్కన్ ఛార్జర్స్ (2009) ఒకొక్కసారి విజయం సాధించాయి.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×