EPAPER

2007 T20 World Cup Winners : 2007 టీ 20 ప్రపంచకప్ కొట్టిన హీరోలు వీరే..

2007 T20 World Cup Winners : 2007 టీ 20 ప్రపంచకప్ కొట్టిన హీరోలు వీరే..

2007 T20 World Cup Winners : అప్పటికి టీమ్ ఇండియాలో అతిరథమహారథులు అందరూ ఉన్నారు. సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ లాంటివాళ్లు ఉన్నారు. వీరందరినీ కాదని బీసీసీఐ సెలక్షన్ కమిటీ మహేంద్ర సింగ్ ధోనికి కెప్టెన్సీ ఇచ్చింది. దీంతో ధోనీ సారథ్యంలోని 15 మంది సభ్యులు.. ఐసీసీ టీ 20 ప్రపంచకప్ ఆడేందుకు సౌతాఫ్రికా బయలుదేరారు.


అయితే చిత్రం ఏమిటంటే.. నాడు మొదలైన టీ 20 ప్రపంచకప్ నకు సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ ఎంపిక కాలేదు. ఒక్క వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే ఉన్నాడు. జట్టు సభ్యులు ఎవరంటే.. కెప్టెన్ ధోనీ, వైస్ కెప్టెన్ యువరాజ్ సింగ్, గౌతం గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, అజిత్ అగార్కర్, జోగీందర్ శర్మ, పియూష్ చావ్లా, ఆర్పీ సింగ్, శ్రీశాంత్, రాబిన్ ఊతప్ప 15మంది సభ్యులతో బయలుదేరింది.

Also Read : కొత్త కోచ్ గా గంభీర్.. నిజమేనా?


2007 ఐసీసీ టీ 20 ప్రపంచకప్ ను ప్రారంభించిన తొలిఏడాది ఇండియా గెలిచింది. దీంతో ధోనీ సారథ్యంపై ప్రజలకే కాదు, బీసీసీఐకి నమ్మకం కలిగింది. మొత్తం అన్ని బాధ్యతలు తనపైనే పెట్టింది. అదే ఊపులో 2011లో వన్డే ప్రపంచకప్ ను కూడా ధోనీ తీసుకొచ్చాడు. అప్పుడెప్పుడో 1983లో కపిల్ దేవ్ తీసుకురావడమే. మళ్లీ 28 ఏళ్ల తర్వాత ఆ కలను ధోనీ నెరవేర్చాడు.

ఇదే టీ 20 ప్రపంచకప్ లో యువరాజ్ సింగ్ అద్భుతంగా ఆడాడు. ఇదే టోర్నమెంటులో యువరాజ్ ఆరు బాల్స్ కి ఆరు సిక్స్ లు కొట్టి క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేశాడు. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ని ఒక రేంజ్ లో ఆటాడుకున్నాడు. ఓవరాల్ గా 9 మ్యాచ్ ల్లో 362 పరుగులు చేశాడు. 15 వికెట్లు తీసుకున్నాడు. నిజానికి 2007 టీ 20 ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ అన్నది ముమ్మాటికి సత్యం.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×