EPAPER

Shubman Gill : భారత్ నయా రన్ మెషీన్ .. సచిన్, విరాట్ బాటలో గిల్..

Shubman Gill : భారత్ నయా రన్ మెషీన్ .. సచిన్, విరాట్ బాటలో గిల్..

Shubman Gill : ఆడింది 21 వన్డేలు. అందులో 4 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు. అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన భారత్ బ్యాటర్ గా రికార్డు. వన్డేల్లో సగటు 70 పరుగుల పైగానే ఉంది. గత నాలుగు మ్యాచ్ ల్లో 3 సెంచరీలు. ఇది టీమిండియా ఓపెనర్ శుభ్ మన్ గిల్ వన్డేల్లో ప్రదర్శన.


శ్రీలంకపై సిరీస్ లో ఒక సెంచరీ చేసిన గిల్ ..న్యూజిలాండ్ పై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. తొలి వన్డేలో అతి పిన్న వయస్సులో డబుల్ సెంచరీ కొట్టిన బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. హ్యాట్రిక్ సిక్సులతో డబుల్ సెంచరీ మార్కును చేరుకుని విమర్శలకు చెక్ పెట్టాడు. గిల్ నిదానంగా ఆడతాడు టెస్టు బ్యాటర్ అనే ముద్ర వేస్తున్నవారికి ఇలా విధ్వంసకర ఇన్నింగ్స్ తో సమాధానం చెప్పాడు. రెండో వన్డేలో బౌలింగ్ కు అనుకూలించిన రాయ్ పుర్ పిచ్ పైనా 40 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక మూడో వన్డేలో మరో సెంచరీ బాది భారత్ నయా రన్ మెషీన్ తానేనని నిరూపించాడు గిల్. ఈ మ్యాచ్ లో 72 బంతుల్లో సెంచరీ సాధించి తన దూకుడు ఎలా ఉంటుందో మరోసారి చూపించాడు. డబుల్ సెంచరీ చేసిన మ్యాచ్ లో చివరి ఓవర్లలో సిక్సుల మోతమోత మోగించిన గిల్ మూడో వన్డేలో మాత్రం ప్రారంభం నుంచి బంతిని స్టాండ్ లోకి పంపాడు. 78 బంతుల్లో 112 పరుగులు చేసిన గిల్ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. అంటే ఎంత దూకుడు ఆడుతున్నాడో అర్ధమవుతోంది. గత రెండు సిరీస్ ల్లో గిల్ ప్రదర్శన వన్డేల్లో అతడి ఓపెనింగ్ స్థానాన్ని పదిలం చేసింది.

దూకుడు పెంచాలి..
ఇప్పటి వరకు 3 టీ20లు మాత్రమే ఆడిన గిల్ 58 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోర్ 46 పరుగులు . ఇక టీ 20ల్లో గిల్ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఈ ఫార్మాట్ లో గిల్ రాణించగలడని తాజా వన్డే ఇన్నింగ్స్ లు నిరూపించాయి. గిల్ కు టీ20 అవకాశాలు దక్కడం ఖాయం. మరి పొట్టి ఫార్మాట్ లో అదే జోరు కొనసాగించి టీమిండియా నయా స్టార్ గా మారాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


టెస్టుల్లో గేర్ మార్చాలి…
గిల్ ఇప్పటి వరకు 13 టెస్టుల్లో 736 పరుగులు చేశాడు. టెస్టుల్లో ఒకే ఒక సెంచరీ సాధించాడు. నాలుగు అర్ధ శతకాలు చేశాడు. టెస్టుల్లోనూ గిల్ భారీ స్కోర్లు సాధించాల్సిన అవసరం ఉంది. అనసరమైన షాట్లకు పోకుండా నిదానంగా ఆడే గిల్ టెస్టుల్లోనూ మరింత బాగా రాణిస్తాడని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడే సూపర్ ఫామ్ లో వచ్చిన గిల్ టెస్టుల్లోనూ సెంచరీల మోత మోగిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల బాటలో గిల్ కెరీర్ కొనసాగడం ఖాయమనే అంచనాలు వచ్చాయి. మరి అందరి అంచనాలు అందుకుని శుభ్ మన్ గిల్ టీమిండియా నయా రన్ మెషీన్ గా మారాతాడా? ఇదే ఫామ్ కొనసాగిస్తాడా? అంచనాలు అందుకుంటాడనే క్రికెట్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

Related News

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Big Stories

×