EPAPER

Indian Cricket Team Players: 15 ఏళ్ల తర్వాత.. టాప్ ఆర్డర్ రికార్డ్ బ్రేక్ ఐదుగురు ఆఫ్ సెంచరీలు

Indian Cricket Team Players: 15 ఏళ్ల తర్వాత.. టాప్ ఆర్డర్ రికార్డ్ బ్రేక్ ఐదుగురు ఆఫ్ సెంచరీలు

 


team india

After 15 years.. Top order record breaking five off centuries: టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ ఎప్పుడూ పేపర్ల మీదే బలంగా కనిపిస్తుందనేది ఒక వాదన ఉంది. అందరూ రికార్డుల కోసం ఆడతారు.. జట్టు కోసం ఆడరనే నిందలు  ఉన్నాయి. కానీ ఆ కాలం దాటిపోయింది. ఇప్పుడందరూ సమష్టిగా జట్టు కోసం ఆడుతున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ తో ధర్మశాలలో జరుగుతున్న చివరి టెస్ట్ లో రికార్డులు బ్రేక్ అయ్యాయి.  మొదటి ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా టాప్ ఆర్డర్ ఐదుగురు ఆఫ్ సెంచరీలు చేశారు. అందులో రోహిత్ శర్మ (103), గిల్ (110) సెంచరీలు చేశారు.


ఈ క్రమంలో భారత్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్‌పై భారత టాప్ 5 బ్యాటర్లు ఆఫ్ సెంచరీలు స్కోర్లు సాధించడం ఇదే మొదటిసారి.  టోటల్ గా చూస్తే ఇది నాలుగోసారి. అంతేకాదు… 14 ఏళ్ల తర్వాత టీమిండియా మళ్లీ ఈ ఫీట్ సాధించింది.

Read more: సెంచరీలతో చెలరేగిన గిల్, రోహిత్.. టీమిండియా భారీ స్కోరు..

మొట్టమొదటగా 1998లో కోల్‌కతా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో భారత టాప్ 5 బ్యాటర్లు 50 ప్లస్ స్కోర్లు  చేశారు. ఆ తర్వాత 1999లో మొహాలీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఈ ఘనత సాధించింది. ఆ తర్వాత పదేళ్లకు 2009లో ముంబై వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు 50 ప్లస్ స్కోర్లు సాధించారు.

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్, శుభ్‌మాన్ గిల్, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ 50 ప్లస్ స్కోర్లు సాధించారు. దేవదత్ పడిక్కల్(65), యశస్వీ జైస్వాల్ (57), సర్ఫరాజ్ ఖాన్ (56) హాఫ్ సెంచరీలతో అలరించారు.

టీమ్ ఇండియా ఈ సిరీస్ లో ఐదుగురు కొత్తవారికి అవకాశం ఇచ్చింది. వారిలో సర్ఫరాజ్ ఖాన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, ఆకాశదీప్ అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు టీమ్ ఇండియా రిజర్వ్ బెంచ్ స్ట్రాంగ్ గా ఉంది. అయితే దురద్రష్టవశాత్తూ రజత్ పటీదార్ కి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేక పోయాడు.

Tags

Related News

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Big Stories

×