EPAPER

Gautam Gambhir| టీమిండియా హెడ్ కోచ్ సాలరీ ఎంతో తెలుసా?.. రాహుల్ ద్రవిడ్, రవిశాస్త్రితో సమానంగా గౌతమ్ గంభీర్

టీమిండియా క్రికెట్ ప్రధాన కోచ్ గా ఇటీవలే మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ నియామకం జరిగింది. భారతదేశ క్రికెట్ బోర్డు బిసిసిఐ అధికారికంగా ఈ విషయాన్ని మంగళవారం ప్రకటించింది. దేశానికి రెండు సార్లు ప్రపంచ కప్ సాధించిన జట్టులో పనిచేసిన గౌతమ్ గంభీర్.. రాహుల్ ద్రవిడ్ స్థానంలో నియమితులియ్యారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టి20 ప్రపంచ కప్ గెలుచుకున్న జట్టుకు రాహుల్ ద్రవిడ్ చివరిసారిగా కోచింగ్ బాధ్యతలు నిర్వహించారు.

Gautam Gambhir| టీమిండియా హెడ్ కోచ్ సాలరీ ఎంతో తెలుసా?.. రాహుల్ ద్రవిడ్, రవిశాస్త్రితో సమానంగా గౌతమ్ గంభీర్

Gautam Gambhir| టీమిండియా క్రికెట్ ప్రధాన కోచ్ గా ఇటీవలే మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ నియామకం జరిగింది. భారతదేశ క్రికెట్ బోర్డు బిసిసిఐ అధికారికంగా ఈ విషయాన్ని మంగళవారం ప్రకటించింది. దేశానికి రెండు సార్లు ప్రపంచ కప్ సాధించిన జట్టులో పనిచేసిన గౌతమ్ గంభీర్.. రాహుల్ ద్రవిడ్ స్థానంలో నియమితులియ్యారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టి20 ప్రపంచ కప్ గెలుచుకున్న జట్టుకు రాహుల్ ద్రవిడ్ చివరిసారిగా కోచింగ్ బాధ్యతలు నిర్వహించారు.


అయితే ఇప్పుడు కొత్తగా హెడ్ కోచ్ గా వచ్చిన గౌతమ్ గంభీర్ జీతం ఎంత తీసుకుంటున్నాడనే చర్చలు క్రికెట్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. గౌతమ్ గంభీర్ కూడా భారీ సాలరీ డిమాండ్ చేశాడని, తనతో పాటు ఎవరు బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, సహాయక సిబ్బంది ఉండాలో సూచించాడని.. ఈ విషయంలో బిసిసిఐతో చర్చలు జరిపేందుకు గౌతమ్ గంభీర్ నియామకం కాస్త ఆలస్యమైందని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Also Read: Hardik Pandya | లోకం అంతా ఒకవైపు.. పాండ్యా ఒక్కడూ ఒకవైపు


ఈ విషయంపై ఒక బిసిసిఐ అధికారి స్పందిస్తూ.. గంభీర్ నియామకం.. అచ్చు 2014లో రవిశాస్త్రి నియామకంలాగే జరిగిందని చెప్పారు. 2014లో రవిశాస్త్రి టీమిండియా ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టినప్పుడు బిసిసిఐతో కనీసం కాంట్రాక్ట్ కూడా సైన్ చేయలేదని, టీమిండియాను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా రవిశాస్త్రి పనిచేశారని ఆయన తెలిపారు. గంభీర్ కూడా అందరూ అనుకున్నట్లు జీతం విషయంలో ఎలాంటి డిమాండ్స్ చేయలేదని చెప్పారు. అయితే రాహుల్ ద్రవిడ్ తో సమానంగానే ఆయనకు జీతభత్యాలు ఉంటాయని వ్యాఖ్యలు చేశారు.

టీమిండియా ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. తన బాధ్యతలను నిర్వర్తించేందుకు హెడ్ ఆఫ్ నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) క్రికెట్ వివియస్ లక్ష్మణ్, ఇండియా-A, అండర్ -19 క్రికెట్ జట్టులకు ప్రానిధ్యం వహించే నేషనల్ క్రికెట్ అకాడమీ కోచ్ ల సహకారం కావాలని అన్నారు. ప్రస్తుతం లక్ష్మణ్ జింబాబ్వేలో టీమిండియాతో ఉన్నారు. ఆయన ఇండియా తిరిగి రాగానే చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్ కర్, టి20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వన్ డే, టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మతో గౌతమ్ గంభీర్ మీటింగ్ చేస్తారని సమాచారం.

Also Read: టీ20 ర్యాంకింగ్ టాప్-10లో సూర్యకుమార్, రుతురాజ్, శ్రీలంక‌, కివీస్‌లకు షాక్

గౌతమ్ గంభీర్ నాయకత్వంలో బౌలింగ్ కోచ్ లుగా ఎల్ బాలాజీ, జహీర్ ఖాన్ పేర్లు ప్రతిపాదన జరిగిందని బిసిసిఐ అధికారి తెలిపారు. ఫీల్డింగ్ కోచ్ గా సౌత్ ఆఫ్రికా ఆటగాడు జాంటీ రోడ్స్ పేరు పరిశీలనలో ఉంది.

Team Headcoach Gautam Gambhir Salary

Tags

Related News

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

Big Stories

×