EPAPER

T20 World CupSemi Final : సెమీస్ బెర్త్ లపై పెరుగుతున్న ఉత్కంఠ

T20 World CupSemi Final : సెమీస్ బెర్త్ లపై పెరుగుతున్న ఉత్కంఠ

T20 World CupSemi Final : T20 వరల్డ్ కప్ లో సూపర్-12 మ్యాచ్ లు పూర్తయ్యే కొద్దీ… సెమీస్ బెర్త్ లపై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోతుంది. ఒక్కో మ్యాచ్ కూ సమీకరణాలు మారిపోతుండటంతో… ప్రతీసారీ లెక్కలతో కుస్తీ పడుతున్నారు… ఫ్యాన్స్. ఏ మ్యాచ్ ఫలితం ఎలా వస్తే… ఏ జట్టుకు ప్లస్ అవుతుంది? ఏ జట్టుకు మైనస్ అవుతుంది? అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.


గ్రూప్‌-2లో 2 జట్లు ఇంటికెళ్లక తప్పని పరిస్థితిలో ఉండగా… 4 జట్లు సెమీస్ రేసులో ఉనాయి. ప్రస్తుతం న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఐదేసి పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఆప్ఘన్ పై గెలుపుతో శ్రీలంక 4 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ నాలుగు జట్లకు సూపర్-12లో ఒక్కో మ్యాచ్ మాత్రమే మిగిలిఉంది. ఐర్లాండ్‌తో జరిగే మ్యాచ్ లో న్యూజిలాండ్‌ గెలిస్తే సెమీస్ బెర్త్ గ్యారంటీ. అదే ఐర్లాండ్ గెలిస్తే… కవీస్ కు కష్టాలే. ఆప్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలిస్తే… సెమీస్ కెళ్లే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆప్ఘన్ గెలిస్తే కంగారూలకు కంగారు తప్పదు. శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో ఇంగ్లాండ్‌ గెలిస్తే… ఆ జట్టుకు సెమీస్ బెర్త్ ఖాయం. అదే లంక గెలిస్తే ఇంగ్లాండ్ ఇంటి దారి పట్టాల్సిందే. లంక సెమీస్ ఆశలు మాత్రం సజీవంగా ఉంటాయి. ఒకవేళ ఆసీస్, కివీస్‌, ఇంగ్లాండ్‌ జట్లు… తమ చివరి మ్యాచుల్లోనూ ఓడిపోతే… నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ దక్కించుకుంటుంది. ఇంగ్లాండ్‌పై గెలిచిన లంక అగ్రస్థానంతో సెమీస్‌కు దూసుకెళ్తుంది. కానీ.. ఆసీస్, కివీస్‌, ఇంగ్లాండ్‌ తమ చివరి మూడు మ్యాచ్ ల్లోనూ గెలిస్తే… అన్ని జట్లకూ ఏడేసి పాయింట్లు వస్తాయి. అప్పుడు నెట్ రన్‌రేట్‌ ఎక్కువగా ఉన్న రెండు జట్లు సెమీస్ చేరతాయి.

ఇక గ్రూప్-1 సమీకరణాలు చూస్తే… సౌతాఫ్రికాకు పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌తో రెండు మ్యాచ్ లు ఉన్నాయి. వీటిలో ఒక్కదానిలో గెలిచినా సఫారీలకు సెమీస్ బెర్త్ దక్కుతుంది. ఒకవేళ బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లు ఆడబోయే రెండు మ్యాచ్ ల్లోనూ గెలిస్తే… వరుసగా 8, 7 పాయింట్లతో ఉంటాయి. అయినా నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉన్న ప్రొటీస్‌ భపడాల్సిందేమీ లేదు. అలాకాకుండా భారత్ చేతిలో బంగ్లాదేశ్, జింబాబ్వే ఓడితే… సౌతాఫ్రికా నేరుగా సెమీస్ చేరుకుంటుంది.


ఇక భారత్ విషయానికొస్తే… ఎలాంటి లెక్కలతో సంబంధం లేకుండా నేరుగా సెమీస్ చేరాలంటే… బంగ్లా, జింబాబ్వే జట్లపై గెలవాలి. అలాకాకుండా ఒక మ్యాచ్ లో గెలిచి ఒక మ్యాచ్ లో ఓడితే… బంగ్లా, జింబాబ్వే సెమీస్ రేసులోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇదే జరిగి పాకిస్థాన్ కూడా మిగిలిన రెండు మ్యాచ్ ల్లో గెలిస్తే… ఆ టీమ్ కూడా నెట్ రన్ రేట్ చేతిలో ఓడితే లెక్కలు తారుమారు అవుతాయి. భారత్ కు పోటీగా జింబాబ్వే సెమీస్ రేసులోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా జింబాబ్వేపై గెలిచి బంగ్లాదేశ్‌ చేతిలో ఓడితే… బంగ్లాతో నట్లయితే.. సౌతాఫ్రికాతో పాటు బంగ్లా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ రెండింటిలో ఒకటి ఓడి ఒకటి గెలిచి.. అదే సమయంలో పాకిస్తాన్‌ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి 6 పాయింట్లు సాధిస్తే నెట్‌ రన్‌రేట్ పరంగా సెమీస్ బెర్త్ కోసం పోటీపడే అవకాశం ఉంటుంది. ఎలాంచి చిక్కులు లేకుండా భారత్ సెమీస్ చేరాలంటే… బంగ్లా, జింబాబ్వేపై కచ్చితంగా గెలవాలి.

Related News

Nindha Movie: ఓటీటీలోనూ దూసుకుపోతున్న ‘నింద’.. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూసా..?

Game Changer: ఎట్టేకలకు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చేసిందోచ్..

Inaya Sulthana: ఇసుకలో ఇనయా ఆటలు.. మరీ అంతలా అందాలు ఆరబెట్టాలా?

Donations To Flood Victims: ఏపీకి విరాళాల వెల్లువ.. ఎన్నడూ లేనంతగా.. వాళ్ల కోసమేనా!

Mississippi bus crash: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..7 గురి దుర్మరణం..37 మందికి గాయాలు

Pranayagodari: ‘గు గు గ్గు’ పాటను రిలీజ్ చేసిన గణేష్ మాస్టర్

Rare Airbus Beluga: శంషాబాద్ ఎయిర్ పోర్టులో బాహుబలి ఎయిర్ క్రాఫ్ట్ ఎంత పెద్దదో చూశారా?

Big Stories

×