EPAPER

Team India T20 New Jersey: కొత్త జెర్సీతో మెరిసిన.. టీమ్ ఇండియా

Team India T20 New Jersey: కొత్త జెర్సీతో మెరిసిన.. టీమ్ ఇండియా

T20 World Cup 2024 Rohit Sharma & Team India Unveil New Jersey in New York:  టీ 20 ప్రపంచకప్ సంబరాలు మొదలయ్యాయి. ప్రతి దేశం ఆటగాళ్లు కొత్త జెర్సీలతో ముస్తాబవుతున్నారు. అలాగే మన టీమ్ ఇండియా కూడా కొత్త జెర్సీలతో మెరిసింది. వీటిని ప్రముఖ స్పోర్ట్స్ వేర్ బ్రాండ్, టీమిండియా కిట్ స్పాన్సర్ అడిదాస్.. గతంలోనే అధికారికంగా రిలీజ్ చేసింది. కాకపోతే ఇప్పుడు ఆటగాళ్లు ధరించిన తర్వాత.. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ టీవీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. జూన్ 2 న టీ 20 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా మొదటి మ్యాచ్ ఆడనుంది.


కొత్త జెర్సీలతో టీ 20 ప్రపంచకప్ టీమ్ లో చాలామంది జట్టు సభ్యులు అరుపులు, కేకలతో అదరగొట్టారు. కొందరు మాత్రం కూల్ గా కనిపించారు. కొందరు మాత్రం హీరో రేంజ్ లో స్టిల్స్ ఇచ్చి ఊరుకున్నారు. అయితే జెర్సీలను కాలర్ లెస్ గా డిజైన్ చేశారు.  మొత్తానికి టీమ్ ఇండియా జెర్సీ షర్ట్ సంప్రదాయ బ్లూ కలర్ ఉంది. దానికి ఆపోజిట్ గా ఆరెంజ్ కలర్ ని హ్యాండ్స్ కి వేశారు.

ఇంతవరకు కాలర్ జెర్సీలతో కనిపించిన టీమ్ ఇండియా సభ్యులు, ఇప్పుడు కాలర్ లెస్ తో ఒక డిఫరెంట్ లుక్ తో కనిపించారు. కాకపోతే హ్యాండ్స్ కి కాషాయరంగు వేయడంతో విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది బీజేపీ రంగు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అక్కడ వందే భారత్ రైళ్లకు కూడా ఆరెంజ్ కలర్ వేశారని దుయ్యబడుతున్నారు. బీసీసీఐ కార్యదర్శి జైషా వల్లనే ఈ రంగు వాడాల్సి వచ్చిందని మండిపడుతున్నారు.


Also Read: బీసీసీఐకి గంగూలీ సలహా, కొత్త కోచ్ ఎంపికపై..

అయితే చాలామంది డ్రెస్ ది ఏముంది? బాగా ఆడాలి కానీ. అని అంటున్నారు. కొందరు సెంటిమెంటుగా వర్కవుట్ అవుతుందేమో చూడాలని అంటున్నారు. మరి కొత్త  జెర్సీ…కప్ తీసుకొస్తుందా? చూడాల్సిందే. ఇంతవరకు ఐపీఎల్ టీమ్ ల్లో అందరూ శత్రువుల్లా కొట్టుకున్నవారు…నేడు ఒకే గొడుకు కిందకు చేరి కలిసి ఆడనున్నారు. ఇది అందరికి ఆనందంగా ఉంది. పాత కక్షలన్నీ మరిచిపోయి, కలిసికట్టుగా ఆడి ఐసీసీ ట్రోఫీని తీసుకురావాలని భారత అభిమానులు కోరుతున్నారు.

కాకపోతే ఇదే నెలలో హెలికాఫ్టర్ నుంచి కొత్త జెర్సీని గాల్లో వేలాడదీస్తూ ప్రదర్శించారు. అధికారికంగా అడిదాస్ ప్రకటించకముందే సోషల్ మీడియాలో  ఫొటోలు లీక్ అయ్యాయి. కాకపోతే ఇప్పుడు టీమ్ ఇండియా సభ్యులు వాటిని ధరించి కనువిందు చేశారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×