EPAPER

India Vs USA: ప్రపంచ కప్ లో యూఎస్‌పై భారత్ గెలుపు!

India Vs USA: ప్రపంచ కప్ లో యూఎస్‌పై భారత్ గెలుపు!

India Won by 7 Wickets against USA in T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ 2024లో భారత్ వరుసగా మూడో మ్యాచ్ లో గెలిచి సూపర్-8కు చేరింది. అమెరికాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 7 వికెట్ల తేడాతో వియజం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేయగా, ఈ లక్ష్యాన్ని భారత్ 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.


న్యూయార్క్ వేదికగా బుధవారం అమెరికాతో జరిగిన ఈ మ్యూచ్ లో టీమిండియా టాస్ గెలిచి మొదటగా ఫీల్డింగ్ ఎచుకుంది. మొదటగా బౌలింగ్ చేసిన భారత బౌలర్లు రెచ్చిపోయారు. సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 50 పరుగులు చేసి టీమిండియా విజయం కీలక పాత్ర పోషించాడు.

రోహిత్ 3 పరుగులు, రిషభ్ పంత్ 18 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 50 పరుగులు(49 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ లు), శివమ్ దూబె 31 పరుగులు(35 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ లు ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు.


టీమిండియా బౌలర్ల అద్భుత ప్రదర్శనతో అమెరికా బ్యాటర్లు చేతులెత్తేశారు. అమెరికా బ్యాటింగ్ లో షాయన్ జహంగీర్ డకౌట్ తో మొదట్లోనే పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తరువాత స్టీవెన్ టేలర్ 24 పరుగులు, నితీశ్ కుమార్ 27 పరుగులతో రాణించారు. మిగతా బ్యాటర్లంతా పెద్దగా బ్యాటింగ్ చేయలేదు. ఆండ్రీస్ గౌస్ 2 పరుగులు, ఆరోన్ జోన్స్ 11 పరుగులు, కోరీ అండర్సన్ 15 పరుగులు, హర్మీత్ సింగ్ 10 పరుగులు, షాడ్లీ వాన్ షాల్క్ విక్ 11 పరుగులు, జస్దీప్ సింగ్ 2 పరుగులు చేశారు. ఇలా అమెరికా తక్కువ స్కోరు మాత్రమే చేయగలగింది.

Also Read: Virat Kohli-Anushka Sharma Chants: ’10 రుపీకీ పెప్సీ.. కోహ్లీ భాయ్..!’ విరాట్‌పై అభిమానుల గజల్స్..

భారత బౌలర్లు… అర్ష్ దీప్ సింగ్ 4 వికెట్లతో చెలరేగాడు. తన కోటాలో 4 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 4 వికెట్లు పడగొట్టాడు. ఆ తరువాత ఆల్ రౌండర్ అయినటువంటి హార్ధిక్ పాండ్యా 4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు. ఆ తరువాత అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు. ఇలా టీమిండియా అద్భుత ప్రదర్శన చేసి సూపర్ -8లోకి ఎంట్రీ ఇచ్చింది.

Related News

Rohit Sharma: 2027 వరకు రోహిత్ శర్మనే కెప్టెన్..కాంగ్రెస్ ప్రకటన

Mohammed Shami: మహమ్మద్ షమీది దొంగ ప్రేమ..మాజీ భార్య హాసిన్ సంచలనం!

Ind vs Ban: హైదరాబాద్‌లో భారత్-బంగ్లాదేశ్‌ మ్యాచ్.. నేటి నుంచి టికెట్ల విక్రయం

Ms Dhoni: RCBపై కోపంతో ధోనీ… TV పగలగొట్టేశాడు..క్లారిటీ ఇదే?

Rashid Khan: పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్‌..ఒకే రోజూ 4 గురికి !

T20 World Cup: నేడు మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఇండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌

Telangana BIG TV Cricket League : తమన్ ఊచకోత.. 34 బంతుల్లో సెంచరీ

×