EPAPER

T20 World Cup 2024 Warmup Matches: టీ 20 ప్రపంచకప్ షురూ.. జూన్ 1న బంగ్లాదేశ్ తో ఇండియా వార్మప్ మ్యాచ్!

T20 World Cup 2024 Warmup Matches: టీ 20 ప్రపంచకప్ షురూ.. జూన్ 1న బంగ్లాదేశ్ తో ఇండియా వార్మప్ మ్యాచ్!

T20 World Cup 2024 Warmup Matches Schedule Out: ఇండియాలో ఇంకా ఐపీఎల్ సీజన్ 2024 వేడి తగ్గనే లేదు. అప్పుడే ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ సెగ మొదలైంది. ఐసీసీ టీ ప్రపంచకప్ వార్మప్ షెడ్యూల్ ను ఐసీసీ ప్రకటించింది. వెస్టిండీస్, అమెరికా లాంటి దేశాల్లో విదేశీ పిచ్ లు కావడంతో అన్ని జట్లకి వార్మప్ మ్యాచ్ లు ఆడేందుకు ఐసీసీ అవకాశం ఇచ్చింది. అలా మన ఇండియా జూన్ 1 న అమెరికాలోని ఫ్లోరిడాలో బంగ్లాదేశ్ తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది.


అయితే ఇక్కడ చిన్న తిరకాసు మొదలైంది. మన ఇండియా గ్రూప్ మ్యాచ్ లన్నీ అమెరికాలోనే ఉన్నాయి. అందులో మూడు మ్యాచ్ లు పాకిస్తాన్ తో సహా న్యూయార్క్ లోనే జరగనున్నాయి. కానీ ప్రాక్టీసు మ్యాచ్ ను మాత్రం తీసుకువెళ్లి అమెరికాలోని ఫ్లోరిడాలో ఏర్పాటు చేసింది. దీంతో బీసీసీఐ రిక్వెస్ట్ చేసినా సరే, ఐసీసీ తిరస్కరించింది. ఎవరికి నచ్చినట్టు వారికి షెడ్యూల్ మార్చలేమని తెలిపింది.

మొత్తం టీ 20 ప్రపంచకప్ లో 20 దేశాలు మే 27 నుంచి వార్మప్ మ్యాచ్ లు ఆడనున్నాయి. వాటిలో పాకిస్తాన్, ఇంగ్లాండ్ ఆడే అవకాశం లేదు. మిగిలిన జట్ల సన్నాహక మ్యాచ్ ల షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది.


Also Read: Jay Shah On Hardik Pandya Selection: హార్దిక్ పాండ్యాను అందుకే తీసుకున్నాం: జై షా క్లారిటీ

ఆతిథ్య దేశమైన అమెరికా, ఐర్లాండ్‌, పాకిస్థాన్‌, కెనడాలతో కూడిన టోర్నీలో భారత జట్టు గ్రూప్‌-ఏలో ఉంది.

ఇక జూన్ 1న వార్మప్ మ్యాచ్ అనంతరం, టీ 20 ప్రపంచకప్ లో టీమ్ ఇండియా మొదటి మ్యాచ్ జూన్ 5న ఐర్లాండ్ తో ఆడుతుంది.

ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లన్నీ 20 ఓవర్ల వరకే ఉంటాయి. వీటికి అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి హోదా ఉండదు. అదే సమయంలో, పాల్గొనే జట్లు తమ 15 మంది ఆటగాళ్లను ఫీల్డింగ్ చేయడానికి అనుమతిస్తుంది. వార్మప్ మ్యాచ్ ల షెడ్యూల్ ఇలా ఉంది.

Also Read: Arjun Tendulkar Walks Off The Field why: పూరన్‌కు అర్జున్ టెండూల్కర్ భయపడ్డాడా? అది ఫేక్ గాయమా?

సోమవారం, మే 27
1. టెక్సాస్ లో కెనడా వర్సెస్ నేపాల్
2.ట్రినిడాడ్, టొబాగో లో ఒమన్ vs పాపువా న్యూ గినియా
3.ట్రినిడాడ్, టొబాగో లో నమీబియా vs ఉగాండా

మంగళవారం, మే 28
1.ఫ్లోరిడాలో శ్రీలంక vs నెదర్లాండ్స్
2. టెక్సాస్‌లో బంగ్లాదేశ్ vs అమెరికా
3.ట్రినిడాడ్, టొబాగో లో ఆస్ట్రేలియా vs నమీబియా

బుధవారం, మే 29
1.ఫ్లోరిడాలో సౌతాఫ్రికా ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్
2. ట్రినిడాడ్, టొబాగోలో ఆఫ్ఘనిస్తాన్ v ఒమన్

Also Read: Saeed Anwar: పాక్‌లో విడాకులు ఎందుకు పెరిగాయో తెలుసా? మాజీ కెప్టెన్ అన్వర్ కామెంట్స్

గురువారం, మే 30
1. టెక్సాస్ లో నేపాల్ vs అమెరికా
2.ట్రినిడాడ్, టొబాగో లో స్కాట్లాండ్ vs ఉగాండా
3.టెక్సాస్ లో నెదర్లాండ్స్ vs కెనడా
4.ట్రినిడాడ్, టొబాగో లో నమీబియా vs పాపువా న్యూ గినియా
5.ట్రినిడాడ్, టొబాగోలో వెస్టిండీస్ v ఆస్ట్రేలియా

శుక్రవారం, మే 31
1. ఫ్లోరిడాలో ఐర్లాండ్ vs శ్రీలంక
2. ట్రినిడాడ్, టొబాగోలో స్కాట్లాండ్ vs ఆఫ్ఘనిస్తాన్

శనివారం, జూన్ 1
1. ఫ్లోరిడాలో భారతదేశం vs బంగ్లాదేశ్

Also Read: Team India New Coach: టీమిండియా ప్రధాన కోచ్ రేసులో ఎవరున్నారు..?

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×