EPAPER

Umpires in India-Pakistan Match: ఖండంతరాలను దాటిన ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ ఫీవర్.. వరల్డ్ కప్ ఇండో-పాక్ అంపైర్లు వీరే!

Umpires in India-Pakistan Match: ఖండంతరాలను దాటిన ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ ఫీవర్.. వరల్డ్ కప్ ఇండో-పాక్ అంపైర్లు వీరే!

On-Field Umpires on India-Pakistan Match in T20 World Cup 2024: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఇప్పటి నుంచే సెగ మొదలైంది. జూన్ 1 నుంచి ఐసీసీ టీ 20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. జూన్ 5న భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడనుంది. దీంతో ఒక్కసారి మ్యాచ్ లో హైప్ క్రియేట్ అయ్యింది.


న్యూయార్క్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టికెట్లన్నీ హాట్ కేకుల్లా అయిపోయాయి. ఇంత బీభత్సమైన రెస్పాన్స్ చూసిన ఐసీసీ ఏం చేసిందంటే టికెట్ రేట్లు అమాంతం పెంచేసింది. అదిప్పుడు పెద్ద వివాదాస్పదమైంది.

ఈ నేపథ్యంలో అసలు ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కు అంపైర్లు ఎవరున్నారనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే వారి పేర్లను ఐసీసీ ప్రకటించింది. ఇంతకీ వారెవరంటే  రిచర్డ్ ఇల్లింగ్ వర్త్, రోడ్నీ టక్కర్ ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. టీవీ అంపైర్ గా క్రిస్ గఫానీ, మ్యాచ్ రిఫరీగా డేవిడ్ బూన్ ఉండనున్నారు.


Also Read: భారత్- పాకిస్తాన్ మ్యాచ్.. టికెట్ ధరపై రచ్చ రచ్చ

ఇప్పటికే టీమ్ ఇండియా తమ జట్టుని ప్రకటించింది. అయితే పాకిస్తాన్ బోర్డు మాత్రం ఇంకా ఎవరెవరు ఆడుతారనేది చెప్పలేదు. బహుశా రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. వాళ్లు కేవలం ప్రపంచకప్ గెలవడం ఒకటి, ఇండియాపై గెలవడం ఒకటి ఈ రెండు కాన్సెప్ట్ లతో
ఆ బోర్డు తీవ్ర కసరత్తు చేస్తోంది.

కానీ మన జట్టుని చూస్తే అంతవరకు ఐపీఎల్ లో అద్భుతంగా ఆడి, ప్రపంచకప్ కి పేర్లు ప్రకటించిన దగ్గర నుంచి ఒకరిని మించి ఒకరు త్వరగా అవుట్ అయి వచ్చేస్తున్నారు. ఆ తర్వాత కూడా ఎవరూ అంతగా క్లిక్ అవలేదు. మరి ఈ జట్టు వెళ్లి విదేశాల్లో ఎంత గొప్పగా ఆడుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.

Also Read: Virat Kohli’s Batting Position: ఓపెనర్ గా రావాలా? లేక ఫస్ట్ డౌన్ రావాలా? కొహ్లీపై నెట్టింట చర్చ

నిలకడగా ఆడిన ఎంతోమందిని కాదని, అంతర్జాతీయ అనుభవం పేరుతో అంతంతమాత్రంగా ఆడుతున్న వారికి  బీసీసీఐ సెలక్షన్ కమిటీ పెద్ద పీట వేసింది. మరి ఈ ప్రయోగం ఎంతవరకు సఫలీక్రతం అవుతుందో ఎవరికీ తెలీడం లేదు. కాకపోతే మనకి ఉన్నవారిలో ది బెస్ట్ టీమ్ ని సెలక్ట్ చేసినట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తెలిపారు. మరి ఈసారైనా ఐసీసీ ట్రోఫీ తెస్తారా? లేదా?అనేది చూడాల్సిందే.

Related News

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

Rishabh Pant: అంతర్జాతీయ క్రికెట్ లో ఒత్తిడి తప్పదు: రిషబ్ పంత్

Big Stories

×