EPAPER

Swapnil Kusale win bronze: బుల్లెట్ దిగింది.. స్విప్నిల్‌కు కాంస్యం, ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో పతకం

Swapnil Kusale win bronze: బుల్లెట్ దిగింది..  స్విప్నిల్‌కు కాంస్యం, ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో పతకం

Swapnil Kusale win bronze: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం వచ్చింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ విభాగంలో యువ షూటర్ స్వప్నిల్ సత్తా చాటాడు. మూడు పొజిషన్ షూటింగ్‌ ఈవెంట్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. ఈ విభాగంలో ఇండియాకు ఇదే ఫస్ట్ మెడల్. మూడో పతకాన్ని అందించిన స్వప్నిల్ కుసలేకు అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి.


50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఫైనల్‌లో మూడు రౌండ్లు ఉంటాయి. మోకాలు, ప్రోన్, స్టాండింగ్ పొజిషన్లలో పోటీ జరిగింది. మొత్తం 590‌ కి గాను 451.4 పాయింట్లతో మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు స్వప్నిల్. చైనాకు చెందిన లి విన్ 463.6 పాయింట్లలో బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. ఉక్రెయిన్‌కి చెందిన కులిష్ 461.3 పాయింట్లతో సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు.

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటివరకు మూడు పతకాలు సొంతం చేసుకుంది. ఆ పతకాలన్నీ షూటింగ్ లోనే వచ్చాయి. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మనుభాకర్, మనుభాకర్-సరబ్‌జోత్, స్వప్నిల్ కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. గతంలోకి ఒక్కసారి వెళ్తే.. 2004 ఏథెన్స్‌లో రాజవర్థన్‌సింగ్, 2008 బీజింగ్‌లో అభినవ్ బింద్రా, 2012 లండన్‌లో విజయ్‌కుమార్, గగన్ నారంగ్ పతకాలు సాధించారు.


Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×