EPAPER

Suryakumar Yadav Back to IPL 2024: ఎట్టకేలకు ఫిట్.. అందుబాటులో సూర్యకుమార్.. ఏ మ్యాచ్‌కి రాబోతున్నదంటే..?

Suryakumar Yadav Back to IPL 2024: ఎట్టకేలకు ఫిట్.. అందుబాటులో సూర్యకుమార్.. ఏ మ్యాచ్‌కి రాబోతున్నదంటే..?
Suryakumar Yadav declared fit, likely to play against DC on Sunday match
Suryakumar Yadav declared fit, likely to play against DC on Sunday match

Suryakumar Yadav Likely to Play against DC on Sunday in IPL 2024: ఐపీఎల్ పేరు చెప్పుగానే అందరికీ ముందు గుర్తుకొచ్చేది తొలుత ముంబై జట్టు. ఆ తర్వాతే చెన్నై సూపర్ కింగ్స్. ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై జట్టులో ఆడేందుకు ఆటగాళ్లు పోటీ పడేవారు. అందులో ఛాన్స్ వస్తే.. భారత జట్టుకు ఎంపిక అవుతామనే ఆశ ఆటగాళ్లలో ఉండేది. ఇదంతా ఒకప్పుడు మాట. కనీసం మ్యాచ్ గెలిచేందుకు నానాకష్టాలు పడుతోంది ఆ జట్టు.


కెప్టెన్ రోహిత్‌శర్మ ప్లేస్‌లోకి వచ్చాడు హార్ధిక్‌పాండ్యా. కానీ జట్టును గెలిపించడంలో మాత్రం తడబడుతు న్నాడు ఈ ఆల్‌రౌండర్. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లే ఇందుకు ఓ ఎగ్జాంఫుల్. పాయింట్ల పట్టికలో చివరి స్థానం ఈ జట్టుదే. దీంతో ముంబై జట్టు పనైపోయిందని అభిమానులు భావిస్తున్న సమయంలో ఓ విషయం వెలుగులోకి వచ్చింది. గాయాలతో జట్టుకు దూరంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ మళ్లీ రాబోతున్నాడు. ఈ విషయం తెలియగానే ముంబై హార్డ్‌కోర్ అభిమానుల్లో ఆశ పెరిగింది. సూర్య వస్తే.. జట్టు మనుపటి ఫామ్‌ని సంతరించుకుంటుందని చెబుతున్నారు. ముంబై జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తుందని అంటున్నారు.

ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్. దాదాపు అన్ని ఫిట్‌నెస్ పరీక్షలను పూర్తి చేసినట్టు సమాచారం. మరో టెస్టు గురువారం ఉండబోతోంది. అందులో ఫిట్‌గా ఉన్నట్లు తేలితే మ్యాచ్ ఆడేందుకు అనుమతి వస్తుంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగనున్న మ్యాచ్‌కు ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. ఒకవేళ ఏదైనా కారణం వల్ల మిస్సయితే 11న ఆర్‌సీబీ మ్యాచ్‌లో ఆడే అవకాశం రావచ్చని అంటున్నారు.


Also Read: కోల్‌కతా సునామీలో కొట్టుకుపోయిన ఢిల్లీ!

సూర్యకుమార్ చివరగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడాడు. ఆ తర్వాత చీలిమండ సమస్య కారణంగా ఆపరేషన్ చేయించుకున్నాడు. అంతా ఓకే అయ్యింది. ఇప్పుడు ఫిట్‌నెస్ కోసం జాతీయ అకాడమీలో ఉన్నాడు. ఐపీఎల్ తర్వాత జూన్ నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ మొదలుకానుంది. ఈ క్రమంలో ఐపీఎల్.. సూర్యకు ప్రాక్టీసుగా ఉపయోగపడుతోందని సగటు అభిమానుల ఆశ.

Tags

Related News

Vinesh Phogat Bajrang Punia: ‘వినేశ్ ఫోగట్ చీటింగ్ చేసి ఒలింపిక్స్‌కు వెళ్లింది’.. బిజేపీ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

Duleep Trophy 2024: మళ్లీ ముంబై బ్యాటర్ వచ్చాడు.. అదరగొట్టిన ముషీర్ ఖాన్..181

Paralympics Hokato Hotozhe: పారాలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య 27!.. హై జంప్ లో గోల్డ్, షాట్ పుట్ లో కాంస్యం!

Wrestlers: బ్రేకింగ్ న్యూస్.. కాంగ్రెస్ పార్టీలో చేరిన రెజ్లర్లు వినేష్ ఫొగట్, బజరంగ్ పునియా

US Open 2024: యూఎస్ ఓపెన్..నెంబర్ వన్ ర్యాంకర్ ఓటమి

Duleep Trophy 2024: ముషీర్ ఖాన్ సెంచరీ.. అక్షర్ పటేల్ అదుర్స్

Rishabh Pant: అంతర్జాతీయ క్రికెట్ లో ఒత్తిడి తప్పదు: రిషబ్ పంత్

Big Stories

×